వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 7

మొలకలు

మొలక అంటే వ్యాసాలే, కానీ ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న దశలో ఉన్నాయన్న మాట. ఇంకా వికీపీడియా సభ్యుల దృష్టి వాటి మీద పడలేదు. వ్యాసం ప్రారంభం అయితే జరిగింది గాని, పూర్తి స్థాయి వ్యాసానికి ఉండవలసినంత సమాచారం అందులో ఇంకా లేదు. అంత మాత్రం చేత మొలకలు అంటే పనికిరానివని అనుకోరాదు. వ్యాసం తయారయే క్రమంలో మొలక అనేది మొదటి అడుగు! ఈ మొలకలతో ఎలా వ్యవహరించాలో నిర్దేశించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం. ఒక మొలకను ప్రారంభించేటపుడు, దాని ప్రధాన ఉద్దేశ్యం విస్తరణ అని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్లుగా, ఆ వ్యాసంలో విస్తరణకు వీలైనంత కనీస మాత్రపు సమాచరం ఉండేలా చూడాలి. పుస్తకాల నుండి గానీ, యాహూ, గూగుల్ వంటి సెర్చి ఇంజనుల నుండి గాని మీ తొలి సమాచారాన్ని సేకరించ వచ్చు. ఇతర మార్గాల నుండి సేకరించిన సమాచారాన్ని కూడా పొందుపరచ వచ్చు; ఆ సమాచారం సరియైనదీ,నిష్పాక్షికమైనది అయి ఉండాలి.

ఇంకా: మొలక



నిన్నటి చిట్కా - రేపటి చిట్కా