వికీపీడియా:తటస్థ దృక్కోణం
![]() | ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
తటస్థ దృక్కోణం అనేది వికీమీడియా మౌలిక సూత్రాలలో ఒకటి. వికీపీడియాలోని అన్ని వ్యాసాలూ, విజ్ఞాన సర్వస్వపు అంశాలూ అన్నీ కూడా ప్రముఖ దృక్పధాలకు, ప్రధానమైన ఇతర దృక్పధాలకూ ప్రాతినిధ్యం కలిగించాలి. నమ్మదగిన ఆధారాలున్న, ఇతర వేదికలలో ప్రచురింపబడిన, అన్ని దృక్పధాలకూ స్థానం ఉండాలి.
వికీపీడియా విషయ సంగ్రహానికి సంబంధించినవి మూడు ముఖ్యమైన విధానాలున్నాయి. అవి:
- తటస్థ దృక్కోణం (en:Wikipedia:Neutral point of view)
- ఒరిజినల్ పరిశోధన తాలూకు అసలు ప్రతి కాకూడదు (en:Wikipedia:No original research)
- నిర్ధారణకు అనుకూలంగా ఉండాలి. (en:Wikipedia:Verifiability)
ఈ మూడు విధానాలు కలిసి వికీపీడియాలో ఉంచదగిన విషయపు మౌలిక పరిధులను నిర్దేశిస్తాయి. ఒక వ్యాసపు నాణ్యతను, వికీపీడియా ప్రామాణికతను నిర్ణయిస్తాయి. కాబట్టి వీటిని సంయుక్తంగా పరిశీలించాలి గాని, విడివిడిగా చూడరాదు. సభ్యులంతా వీటి గురించి బాగా తెలుసుకొని ఉండాలి. ఈ మూడు సూత్రాలను దేనికదే విడివిడిగా కాక సంయుక్తంగా, విచక్షణతో అమలు చేయాలి. అంతే కాకుండా ఈ మౌలిక సూత్రాలను సభ్యుల ఏకాభిప్రాయం ఉన్నా కూడా రద్దుచేయరాదు. ఈ మౌలిక సూత్రాల ఆచరణను, వివరణను మరింత మెరుగుపరచే దిశలో మాత్రమే ఈ విధానాల పేజీలను దిద్దవచ్చును.
ఉపోద్ఘాతం సవరించు
వికీపీడియాలోని వ్యాసాలన్నీ తటస్థ దృక్కోణంతో రాయాలనేది వికీపీడియా విధానం. అన్ని ప్రముఖ దృక్కోణాలను, ప్రధానమైన చిన్న, చిన్న దృక్కోణాలనూ వ్యాసాలు నిష్పాక్షికంగా ప్రతిబింబించాలి. తేలిగ్గా అపార్ధం చేసుకునే అవకాశం గల విధానమిది. వికీపీడియా గొప్పతనమేమిటంటే, వ్యాసాలు పక్షపాత రహితంగా ఉండేందుకు ఇక్కడి సభ్యులంతా కృషిచేస్తారు.
నిష్పాక్షికంగా రాయడానికి సాధన అవసరం. ఇది ఎలా రాయాలనే విషయమై అనుభవజ్ఞులైన సభ్యులు తమ సలహాలను ఒక పాఠంగా రాయాలని కోరుతున్నాం.
తటస్థత - ప్రాధమిక భావన సవరించు
వికీపీడియా లో "నిష్పాక్షికత", "తటస్థ దృక్కోణం" అనే వాటిని మామూలు అర్ధానికి భిన్నంగా, చాలా ఖచ్చితమైన అర్ధంలో వాడతాము:
- వ్యాసాలు చర్చలను నిష్పాక్షికంగా వివరించాలి గానీ, చర్చలో ఏదో ఒక పక్షం గురించి బోధించ కూడదు. ప్రజలు సాధారణంగా అంతర్గతంగా పక్షపాతం కలిగి ఉంటారు గనుక, ఇది కష్టమైన విషయమే. కనుకనే వ్యాసాలలో ప్రధాన దృక్పధా లన్నింటికీ సముచితమైన స్థానం కల్పించమని కోరుతున్నాం. ఫలానా దృక్కోణం సరైనది, మరొకటి సరి కానిది, ఇంకొకటి హానికరమైనది - వంటి వ్రాతలు కాని, సూచనలు కాని వ్యాసాలలో అసలు తగవు.
ఆంగ్ల వికీలో సంబంధిత వ్యాసాలు సవరించు
- NPOV tutorial
- Examples
- Examples Debate
- Understand Bias
- List of controversial issues
- Words to avoid
- en:Talk:Creationism
- meta:Positive tone
- Guidelines for controversial articles
- en:God's Eye View
- en:consensus reality
- en:Wikipedia:Avoid weasel terms
- WikiProject Countering Systemic Bias