వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 8

మొలకలను కనుక్కోవటం, వ్యాసాలుగా తీర్చిదిద్దటం

వికీపీడియాలో వ్యాసాలు చాలా చిన్నవిగా ఉండి, కేవలం, వ్యాసాం పేరుకు అర్థాన్ని మాత్రమే తెలుపుతూ ఉంటే దానిని మొలక అని పిలుస్తారు. తెలుగు వికీపీడియాలో 50-70 శాతం వ్యాసాలు మొలకలుగానే ఉన్నాయి. అలాంటి వ్యాసాలను విస్తరించి మంచి మంచి వ్యాసాలుగా తీర్చిదిద్దండి. మీరు ఆ వ్యాసాన్ని అతి గొప్ప వ్యాసంగా తయారు చేయలేకపోవచ్చు, కానీ ఇతర సభ్యులకు వ్యాసాన్ని మరింత విస్తరించడానికి కావలిసిన సదుపాయాలను వ్యాసంలో చేర్చినా చాలు, ఆ వ్యాసం దానంతటదే పెరిగి పోతుంది.

మొలకలను వర్గం:మొలక అనే పేజీలో పట్టుకోవచ్చు. అలా కాకుండా ఇంకా సులువుగా మొలకలను పట్టుకోవాలని అనుకుంటే గనక మీ అభిరుచులు లో "ఇతరాలు" అనే ట్యాబులో ఉన్న "మొలక లింకు ఫార్మాటింగు కొరకు హద్దు (బైట్లు):" అనే డబ్బాలో ఎన్ని అక్షరాల కంటే తక్కువ ఉంటే మొలకగా గుర్తించాలో తెలుపండి, తరువాత నుండీ మీరిచ్చిన సంఖ్య కంటే తక్కువ అక్షరాలున్న వ్యాసాలన్నీ ముదురు ఎరుపు రంగులో కనపడతాయి. ఆ విధంగా మొలకలను చాలా సులువుగా గుర్తుపట్టవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా