వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/ఇండియా కమ్యూనిటీ కన్సల్టేషన్ 2014

India Community Consultation Meet -2014 (Most of the) Participants
India Community Consultation Meet -2014 (Most of the) Participants

వికీపీడియా, వికీసోర్స్, విక్షనరీ మొదలగు స్వేచ్ఛా విజ్ఞానం, స్వేచ్ఛా విజ్ఞాన వనరులను ప్రోత్సహిస్తూ వికీ సముదాయాలకు సహకారం అందిస్తూ వెనకుండి నడిపిస్తున్న వికీమీడియా ఫౌండేషన్ వారు బెంగుళూరులో భారతీయ భాషల వికీపీడియాల మనుగడ భవిష్యత్తు గురించి చర్చించేందుకు అన్ని భారతీయ భాషల సమూహాలతో సమావేశం ఏర్పాటు చేసారు. వికీమీడియా ఫౌండేషన్ నుండి గ్రాంట్స్ మేకింగ్ విభాగానికి సంబంధించిన అనసూయ సేన్ గుప్త, అసఫ్ బర్తోవ్, ఆర్థిక విభాగానికి సంబంధించిన గార్ఫీల్డ్, బోర్డ్ సభ్యులు బిశాఖా దత్త, పత్రీశియో పాల్గొన్నారు. తెలుగు, ఆంగ్లం, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఒడియా, బాంగ్లా, అస్సామీ, పంజాబీ, గుజరాతీ భాషల సభ్యులు వారి వారి సమూహాలకు నేపధ్యం వహిస్తూ పాల్గొన్నారు. కొందరు సభ్యులు వ్యక్తిగత స్థాయిలో కూడా పాల్గొన్నారు. రెండు రోజుల ఈ సదస్సులో ఎన్నో పాఠాలు, నేర్పులు. విశేషాంశాలు నేర్పించిన ఈ సమావేశానికి తెవికీ సభ్యులుగా వాడుకరులు అహ్మద్ నిసార్, విశ్వనాధ్, ప్రణయ్ రాజ్, పవన్ సంతోష్, రహ్మానుద్దీన్ పాల్గొన్నారు. సీఐఎస్-ఏ౨కే ఉద్ద్యోగి స్థాయిలో విష్ణు, రహ్మానుద్దీన్ పాల్గొన్నారు. ఇప్పటి వరకూ భారతదేశంలో ఉన్న కుటిల రాజకీయాలకు స్వస్తి పలుకుతూ మరింత పారదర్శకంగా వ్యవహారాలు జరిగేలా చూసేందుకు ఈ సమావేశం ఏర్పాటయిందన్నద్ది విదితం. సామరస్యంగా వికీమీడియా భారతదేశ చాప్టర్, సీఐఎస్-ఏ2కే, వివిధ వికీపీడియా సమూహాలు మసలేలా చర్చలు జరిగాయి. భాషా సమూహాలకు పెద్ద పీట వేస్తూ, వారి సమస్యల్ని బేరీజు వేస్తూ చిన్న సమూహాల నుండి మాధ్యస్త, పెద్ద సమూహాల వరకు గల సమస్యలను, మంచి విషయాలనూ, బలాలనూ, బలహీనతలనూ, అవకాశాలనూ, ప్రమాదాలనూ గుర్తించి, సమస్యల పరిష్కార మార్గ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వికీపీడియా, సోదర ప్రాజెక్టులలో గల వివిధ బాధ్యతాయుత అంశాలను ముఖ్యంగా పని చేస్తున్న మూడు సంస్థలు- సీఐఎస్-ఏ2కే, భారతదేశ చాప్టర్, సమూహం మధ్య పంచి, ప్రత్యేక సంస్థ చేయాల్సిన పనులను జాబితాగా పరిచారు. అక్టోబర్ 4, 5 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమం, ఈ తరహాలో ఇదే ప్రప్రథమం.

అక్టోబర్ 3

మార్చు

అక్టోబర్ 3 న సాయంత్రం బెంగుళూరు స్థానికుల నెలవారీ సమావేశం తో లాంఛనంగా ఈ కార్యక్రమం మొదలయింది. ఆ సమావేశంలో పరిచయాలు, అనేకాంశాలపై చర్చలు జరిగాయి. ఇది చాలా మామూలుగా అయిపోయింది.

అక్టోబర్ 4

మార్చు
  • ఇది తొలి రోజు సమావేశం. వివరాలుఇక్కడచూడవచ్చు.
  • ఈ రోజు భోజన విరామానికి ముందు అంతా చిన్ని చిన్ని ఆటలతో సాగింది. ఆ ఆటల్లోనే, సభ్యుల సమూహంలో పాత్ర, సమూహంలో జరిగే సమిష్టి కృషుల పై చర్చ జరిగింది.
  • భోజన విరామం తరువాత ప్రత్యేక సమూహం ఏ విషయాలలో బలంగా ఉంది, బలహీనంగా ఉంది. ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యడం ఆపివేయాలి అన్న విషయాలపై చర్చ జరిగింది.
  • సాయంత్రానికి జరిగిన సమావేశంలో గతంలో జరిగిన అతి పెద్ద తప్పులను బేరీజు వేసుకుంటూ అవి జరిగిన సందర్భాలూ, పరిస్థితులపై చర్చ జరిగింది.

అక్టోబర్ 5

మార్చు
  • రెండో రోజు ఉదయం, వికీపీడియా లాంటి ఉద్యమాలు, వాటి గమనాగమనాలపై గగన్ ఆనే స్థానిక కార్యక్రమ నిర్వాహకుడు ప్రదర్శన ఇచ్చారు.
  • తరువాత అసఫ్ ప్రదర్శన ద్వారా ఒక పూవు వికాసాన్ని వికీపీడియా సమూహంతో పోల్చుతూ వినూత్న అంశాలను తెరమీదకు తెచ్చారు.
  • ఆ తరువాత క్రియాశీల వాడుకరుల సంఖ్యానుసారంగా సమూహాలను మొగ్గ స్థాయి, వికసిస్తున్న స్థాయి, పూర్తి వికాసం చెందిన స్థాయిగా గుర్తించారు.
  • మొగ్గ స్థాయిలో అస్సామీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, సంస్కృతం సమూహాలు.వికసిస్తున్న స్థాయిలో తెలుగు, అరవం, మలయాళం, హిందీ, ఉర్దూ, బాంగ్లా సమూహలు. పూర్తిగా వికసించిన స్థాయి సమూహంగా ఆంగ్లం ఉన్నాయి.
  • ఈ సమూహాలిలా రూపొందాక, ప్రతీ సమూహం, వారు చెయ్యాల్సిన పనులు, ఆపివేయాల్సిన పనులు, మొదలుపెట్టవలసిన పనులు, బాహ్య సహకారం కావాల్సిన పనులు విడివిడిగా చర్చించుకున్నారు.

ఆ వివరాలు:

మొగ్గ స్థాయి

మార్చు

ఆపివేయాల్సినవి

మార్చు
  • పదే పదే ఒకే వ్యక్తి వికీ శిక్షణకు హాజరవడం - ఇది అతనికి అలసటనిస్తూ ఇతరులకు జ్ఞానాన్ని పంచుకోనీకుండా చేస్తుంది.
  • సరిగ్గా స్పందన లేని ప్రదేశాలలో శిక్షణ శిబిరాల ఏర్పాటు వృధా ప్రయాస.

మొదలుపెట్టాల్సినవి

మార్చు
  • చిన్ని చిన్ని అంశాలపై కేంద్రీకరిస్తూ ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి.
  • ఆన్‌లైన్ లోనే శిక్షణ జరగాలి.
  • కొత్త ఔత్సాహికులకు మరింత శిక్షణ ఇవ్వాలి.
  • ఆసక్తి ఉన్నవారికే శిక్షణ.
  • ఆన్‌లైన్ లో వికీపీడియా ఎడిటింగ్ చేసేలా సదుపాయం ఉండాలి.
  • శిక్షణా సంస్థలు (బీ ఎడ్ కళాశాలలు) వికీపీడియాపై శిక్షణ పొందాలి.
  • ఉచితంగా అందుబాటులో ఉన్న ఓసీఆర్ ప్రాజెక్టులను వాడుకోవాలి.
  • కొత్త వాడుకరుల రచనలను పరిశీలించి వారు వికీపీడియాలో మెరుగ్గా పనిచేసేలా చూడాలి.
  • వాడుకరులకు వివిధ నియమాలూ, నిబంధనలపై అవగాహన కావాలి.
  • వివిధ మూసలను తాజాపరచాలి.
  • వికీట్రెండ్స్ ఆధారిత ఎడిటింగ్.
  • క్రియాశీల వాడుకరులను గుర్తించాలి.
  • మాస్ కమ్యూనికేషన్ ప్రాజెక్టు విద్యార్థులకు వికీ అవగాహన.
  • సిటిజెన్ జర్నలిజం ద్వారా వికీపీడియాను మరింత మందికి చేర్చాలి.
  • ట్వీట్ చేసేప్పుడు వికీపీడియా అంశాలను చేర్చి మీడియా హ్యాండిల్స్ ని జతచేస్తే తప్పక మరింత ప్రచారం జరుగుతుంది.
  • 1000 అత్యావశ్యక వ్యాసాలు.
  • వికీపత్రిక పునరుద్ధరణ.
  • కనీస నిబంధనల జాబితా.
  • అధికారులకూ, నిర్వాహకులకూ ప్రత్యేక శిక్షణా శిబిరాలు.
  • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వికీ టెక్ వాడుకర్లతో సంభాషణలు
  • తక్కువ వేగం గల అంతర్జాలం కలవారికి సౌకర్యంగా ఉండేలా చూడటం

కొనసాగాల్సినవి

మార్చు
  • ట్విటర్ మరియు ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం
  • ఫేస్‌బుక్ వేదికగా చర్చలు, ప్రకటనలు
  • వివిధ అంశాలపై శిక్షణ సామగ్రితో వికీహౌ లాంటి సదుపాయం
  • ఫేస్‌బుక్ వాడుకరులను వికీపీడియనులుగా మార్చటం.

వికసిస్తన్న స్థాయి

మార్చు

ఆపివేయవలసినవి

మార్చు
  • కొత్త వాడుకరులను దూరంగా ఉంచటం.
  • ఫౌండేషన్ వారు బలవంతంగా సాఫ్టువేర్ మార్పులను రుద్దటం.
  • కఠినమైన విధానాలను కాస్త సరళీకరించడం.
  • బయట నుండి (సీఐఎస్ లేదా ఫౌండేషన్ లేదా చాప్టర్) జరిగే పనులు వికీపీడియా కాకుండా సోదర ప్రాజెక్టుల్లో పని చేయాలి.(ఈ సూచన తమిళ వికీకే ప్రత్యేకం)
  • సీనియర్ సభ్యులను తికమక పెట్టి, లేదా వారిని వికీకి దూరం చేసే పనులు.
  • ఫౌండేషన్ నుండి వచ్చే సమాచారం, సంభాషణలు ప్రాంతీయ భాషలోనే ఉండాలి.

మొదలుపెట్టాల్సినవి

మార్చు
  • ఔట్రీచ్ కార్యక్రమాలకు మరింత సులభంగా సహకారం (ప్రయాణ ఖర్చు, వసతి, మొ॥)
  • GLAM ను భారతీయ సందర్బంలో మార్పులు చేసి ఆచరించడం
  • స్వేచ్ఛా విజ్ఞానం కోసం పని చేస్తున్న ఇతర సంస్థలు - ఎఫ్ఎస్ఎఫ్, ఎఫ్ఎస్ఎంఐ, మొజిల్లా లాంటి సంస్థలతో భాగస్వామ్యం
  • గ్రామీణప్రాంతాల్లో ఔట్రీచ్
  • హిందీపై ప్రత్యేక శ్రద్ధ
  • మహిళా వికీపీడియనుల సంఖ్యను పెంచాలి
  • సాంకేతిక నైపుణ్యం పెంచాలి
  • భారతీయ భాషలన్నిటికీ కలిపి విడిగా ఒకే రచ్చబండ కావాలి
  • నెలవారీ సమావేశాలు కావాలి
  • వికీమేనియాలో భారతదేశ ప్రాతినిధ్యం ఉండాలి
  • వికీపీడియా జీరో మొదలుపెట్టాలి
  • ఒకే ధ్యేయంతో పని చేస్తున్న ఇతర సంస్థలను కలుపుకుపోవాలి
  • బొమ్మల ఎక్కింపు, దస్త్రాల ఎక్కింపు లాంటి పాలిసీ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగి, భారతీయ సందర్భంలో పాలిసీలు రూపొందించాలి.
  • ప్రతీ క్రియకూ 'బెస్ట్ ప్రాక్టిసెస్" అనేవి నిర్ధారించాలి
  • ఏ సమయంలోనైనా ప్రతి వికీ ప్రాజెక్టులో కనీసం ఒక అధికారి, నలుగురు నిర్వాహకులు క్రియాశీలంగా ఉండాలి.

కొనసాగించాల్సినవి

మార్చు
  • సమిష్టి కృషి ప్రాజెక్టులు
  • ఔట్రీచ్
  • సదస్సులు/ సమావేశాలు/ ఉత్సవాలు
  • సమూహాన్ని బలోపేతంగా ఉంచడం
  • వ్యక్తిగత ఎంగేజ్మెంట్ గ్రాంట్, ప్రోగ్రాం ఎంగేజ్మెంట్ గ్రాంట్
  • ఇంతకు ముందులా ముందుగా నోటీసు ఇస్తూ మార్పులను తెలపాలి

సహకారం కావాల్సిన విషయాలు

మార్చు
  • వికీపీడియా ప్రచార వనరులు - చేపుస్తకం, స్టికర్లు, టీషర్టులు. మొ॥
  • JSTOR లాంటి వనరులకు సదుపాయం
  • ఓసీఆర్, టీటీఎస్ లాంటి సాంకేతికాలు అందుబాటులోకి రావాలి.
  • వివిధ పుస్తక ప్రచురణకర్తల నుండీ వికీసోర్స్ కోసం పుస్తకాలు తీసుకోవడంలో
  • ఎఫెసెఫ్ లాంటి సంస్థల సంభాషణలలో
  • "ఐఈజీ గ్రాంట్ కు దరఖాస్తు చేసుకోవడం ఎలా" లాంటి వికీ సంబంధిత విషయాలపై శిక్షణా పుస్తకాలు
  • తక్కువ వేగపు ఇంటర్నెట్ ఉన్న వారికి సహకారం
  • వికీటెక్ వద్ద ఉన్న ఉపకరణాల జాబితా

పూర్తిగా వికసించిన సమూహాలు (ఆంగ్లం)

మార్చు

ఆపివేయాల్సినవి

మార్చు
  • ఆంగ్లంలోని భారతదేశ సంబంధిత వ్యాసాలు నాణ్యమైనవి అన్న ఆలోచనలు
  • ఇతర భాషా వికీపీడియాలలో ఆంగ్ల మూలాలను నిలిపివేయడం (మరాఠీలో ఇది ఉంది).
  • స్పష్టమైన ఫలితాలు లేనిదే ప్రాజెక్టులు మొదలుపెట్టడం.

మొదలుపెట్టవలసినవి

మార్చు

ఇండియా కమ్యూనిటీ కన్సల్టేషన్ 2014 బెంగుళూరు సమావేశంలో తెలుగు వికీ బృందం యొక్క అనుభవాలు, నిర్ణయాలు

మార్చు
  • వికీపీడియన్లుగా ఈ సమావేశంకు అహ్మద్ నిసార్, విశ్వనాధ్, పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్ లు హజరయ్యారు. CIS A2K ద్వారా రహ్మాన్ హాజరయినా తెలుగు వికీపీడియా తరపున తెలుగు వికీ సమూహం కోరిక మేరకు వారితో కలసి సమావేశంలో పాల్గొన్నారు.
  • అక్టోబర్ 4 తేదీన జరిగిన సమావేశంలో ముందుగా ప్రతి భాష వికీపీడియా వారూ సమూహంగా తాము గర్వంగా చెప్పుకునేవి మూడు విషయాలు, జరగకుండా ఉండాల్సిందని భావించేవి రెండు విషయాలు వ్రాసి, వాటిని అనంతరం తమకై కేటాయించిన సమయంలో వేదికపై వివరించారు. తెలుగు వికీపీడియన్లు సమూహంగా ఈ అంశాలను చర్చించిన తరువాత రహ్మానుద్దీన్ వ్రాసి పెట్టారు. అనంతరం వేదికపై పవన్ సంతోష్, విశ్వనాథ్ వాటిని వివరణాత్మకంగా వివరించారు. సమావేశ విశేషాలను రహ్మనుద్దీన్ ఇప్పటికే పైన వ్రాసారు.
  • అక్టోబర్ నాలుగవ తేదీ సాయంత్రం ఇప్పటివరకూ భారతీయ భాషల వికీపీడియాల విషయంలో జరిగిన లోటుపాట్లు, సమస్యల గురించి వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా పలువురు వికీపీడియన్లు వికీమీడియా ఇండియా చాప్టర్ గతంలో చేసిన పొరపాట్లు, రహస్య కార్యాచరణ విధానాలు, పాక్షిక నిర్ణయాలు వంటి వాటిపై ప్రశ్నించగా వాటికి గత ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. వికీమీడియా ఇండియా వారు వికీమీడియా ఫౌండేషన్ ను గ్రాంట్ల విషయమై ప్రశ్నించగా వారు సమాధానం ఇచ్చారు. చర్చ మొత్తంగా ఫలప్రదమై జరిగిన పొరపాట్లు తిరిగి జరగకుండా చూసేలా సాగడం శుభపరిణామం. తెలుగు వికీపీడియా తరఫున చేయదగ్గ ప్రతిపాదనలకు ఇలాంటి వాడి వేడి సమయం సరైన సందర్భం కాదని తోచడంతో నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలు తర్వాతి రోజు చేస్తామని విశ్వనాథ్ గారితో చెప్పించి, అలాగే చేశాము.
  • అక్టోబర్ 5తేదీన తెలుగు తరఫున ముందుగా నిర్ణయించుకున్న సూచనలతో పాటుగా బ్లూమింగ్(పుష్పిస్తున్న) వికీపీడియాల గ్రూపులోని ఇతర వికీల సూచనల్లో తెలుగుకూ పనికివచ్చే మరికొన్ని సూచనలు చేర్చాము. అవి కూడా పైన చేరాయి.

సమావేశం అనంతరం తెలుగు వికీ అభివృద్దికి సూచనలు సలహాలకు మేము కలసిన వ్యక్తులు, వారి ద్వారా పొందిన సలహాలు

మార్చు

రెండురోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం/రాత్రి దాకా జరిగిన సమావేశాల్లోనే కాక ఆపైన సమావేశాల ఆవల కూడా తెవికీ బృందంలోని కొందరు సభ్యులు చురుకుగా ఇతర భాషల్లో అనుభవజ్ఞులైన, చురుకైన వికీపీడియన్లతో, వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధులతో చక్కని చర్చలు జరిపారు. ఫలప్రదమైన ఈ చర్చల సారాంశం ఇది:

 
సమావేశంలో ఇతర వికీ సమూహపు సభ్యులతో తెలుగువికీ సభ్యులు

అసఫ్ బర్తోవ్(Asaf Bortov)

మార్చు

నాలుగవ తేదీన సమావేశం ముగిశాకా రాత్రి విశ్రాంత సమయంలో విశ్వనాథ్, పవన్ సంతోష్ కలిసి వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగి ఐన అసఫ్ బర్తోవ్ ను కలిసి తెవికీ తరఫున ఆయనతో కొద్ది సమయం మాట్లాడాలని వివరించారు. ఆయన మరికొద్ది సేపటికే ఆ అవకాశం కల్పించడంతో విశ్వనాథ్, పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్, అహ్మద్ నిసార్ లతో పాటుగా రహ్మానుద్దీన్ సహకారం కూడా తీసుకుని ప్రత్యేక సమావేశంగా కలిసారు. సాయంత్రం జరిగిన వాడి వేడి సమావేశ సమయంలోనే ఈ ప్రతిపాదనలు చేయడం ద్వారా మరిన్ని సమస్యలకు, గొడవలకు దారితీసే అవకాశం ఉన్నందున ఇలా ప్రత్యేకంగా కలిసినట్టు చెప్పగా ఆయన ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఆపైన రహ్మాన్ సహకారంతో తెవికీ భవిష్యత్ అభివృద్ధికి వికీమీడియా ఫౌండేషన్ నేరుగా చేయదగ్గ సహకారం గురించి ప్రస్తావించగా ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. విధుల్లో భాగంగానే కాక వ్యక్తిగతంగా ఓ వికీమీడియన్ గా కూడా ఇటువంటి విషయాలకు సహాయం చేస్తానని తెలిపారు. ఆపైన ఈ విషయాన్నీ సమావేశాలు ముగిసేంత వరకూ కొద్దిపాటి ప్రత్యేకమైన శ్రద్ధతో, ప్రణాళిక బద్ధంగా, ప్రతినిధి బృందం సంప్రదింపుతో మాత్రమే ముందుకు తీసుకువెళ్లాలని అసఫ్ తెలుపగా అహ్మద్ నిసార్, విశ్వనాథ్, పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్, రహ్మానుద్దీన్ లు అందుకు అనుగుణమైన నిర్ణయాన్ని సమిష్టిగా తీసుకున్నారు.


ఓం శివ ప్రకాశ్ (Om Shiva Prakash (KannDa Wikipedian )

మార్చు
 
సమావేశంలో ఇతర వికీ సమూహపు సభ్యులతో తెలుగువికీ సభ్యులు

ఐదవ తేదీన(చివరిరోజు) సమావేశం ముగిసిన వెంటనే కన్నడ వికీపీడియన్ ఓం శివ ప్రకాష్‌తో రెహ్మానుద్దీన్, విశ్వనాథ్, పవన్ సంతోష్, ప్రణయ్‌రాజ్‌లు మాట్లాడారు. కన్నడ భాషలోని ప్రత్యేకమైన ప్రక్రియ వచనాలు. కన్నడ వచనాల ద్వారా బసవేశ్వరుడు, అక్క మహాదేవి వంటి ఎందఱో కవులు, సంస్కరణాభిలాషులు, ఆధ్యాత్మిక విప్లవకారులు గొప్ప వచన సాహిత్యం సృష్టించారు. ఆ భాషకు ఆభరణం వంటి ఈ వచనాలను కన్నడ వికీమీడియన్ ఓంశివప్రకాష్ ఎన్నో సంవత్సరాలుగా వచనాలకు సంబంధించిన వెబ్సైట్ లో పొందుపరుస్తున్నారు. అక్కడ చేర్చిన వచనాలలో ఒక్కో పదాన్ని వెతికితే ఏ కవి ఏ సమయంలో ఎన్నిమార్లు వాడారో, ఏ నేపథ్యంలో వాడారో కూడా రావడం విశేషం. ఐతే కొన్ని వచనాలు తెలుగులో కూడా ఉండడం, లిపి కన్నడం కావడం గమనించిన రహ్మాన్ ఆయనతో ఏర్పాటైన సమావేశంలో తెలుగు వారికి ఇప్పటికే యూనీకోడీకరణ పొందిన ఆ వచనాలను తెలుగులిపిలో ఇవ్వాలని కోరారు. అనేకమైన కన్నడ కులాలకు ఉపకులాల వారు తెలుగువారు కావడంతో తెలుగు భాషలో ఉన్న కన్నడిగుల చరిత్రను కన్నడిగులకు తాము అందించగలమని మాట ఇచ్చారు. ఈ సాంస్కృతిక సహకారం ద్వారా తెలుగు, కన్నడ వికీసోర్సులు లాభించే వీలు దొరుకుతోంది.

ఆరుణ్ (Arun (English,Kannada)

మార్చు
 
అరుణ్‌తో తెలుగువికీ సభ్యులు
  • అక్టోబర్ 5వ తేదీన అధికారిక సమావేశాలు సాయంత్రం 5.10 నిమిషాలకే ముగిశాయి. ఆపైన ఓం శివ ప్రకాష్(కన్నడ వికీమీడియన్)తో మాట్లాడిన అనంతరం ఆంగ్ల వికీపీడియాలో అనుభవజ్ఞుడైన భారతీయ ఎడిటర్ అరుణ్ ను కొన్ని సూచనల కొరకు విశ్వనాథ్, పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్, రహ్మానుద్దీన్ లు విడిగా కలిశారు. వారు అడిగిన ప్రశ్నలను అనుసరించి అరుణ్ చేసిన సూచనలు ఇలా ఉన్నాయి:
  • తెలుగు భాషలో కొన్ని పత్రికలను ప్రామాణికమైనవిగా నిర్ధారించుకుని, వ్యాసరచనలో వాటిని ఎక్కువగా సంప్రదించాలి. కొన్ని పత్రికల్లోని సమాచారాన్ని అనుసరించి వాటి ప్రామాణికత గురించి ప్రజల్లో, మేధావి వర్గంలో ఏర్పడిన అభిప్రాయాలు తెలిసి ఉంటాయి కనుక ఫలప్రదమైన చర్చల ద్వారా నిర్ధారించుకోవాలి.
  • కొన్ని పత్రికలకు ఆర్కైవ్స్ లేకపోవడం, కొన్నిటికి ఉన్న ఆర్కైవ్స్ పబ్లిక్ లో ఉంచకపోవడం, మరికొన్ని గత కొద్ది సంవత్సరాలే ఆర్కైవ్స్ నిర్వహించడం వంటి సమస్యలు ఉన్నాయి. కనుక ఈ సమస్యలను అధిగమించేందుకు గాను తమ ప్రాముఖ్యత ఏమిటో పత్రికలకు ముందు చెప్పాల్సి ఉంటుంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా పత్రికలు అనుసరించి ఆర్థికంగా, బ్రాండ్ పరంగా ఆర్కైవ్స్ విషయంలో పొందుతున్న లాభాలు అర్థమయ్యేలా వివరిస్తూ, వికీపీడియా వలన పత్రికలు, పత్రికల వలన వికీపీడియా ఎలా పరస్పరం లాభం పొందుతుందో తెలిసేలా చక్కగా డ్రాఫ్ట్ చేసిన లేఖ ప్రామాణికతతో సంబంధం లేకుండా అన్ని పత్రికలకు పంపాలి.
  • ఆపైన అవసరం, అవకాశం అనుసరించి పత్రికలను ప్రత్యేకించి కలవాలి. కలిసి వారి వద్దనున్న ఆర్కైవ్స్ బయటపెడితే దాని ద్వారా వారికి గూగుల్ సెర్చ్ ఇంజన్, వికీపీడియాల ద్వారా ఎలా లాభం కలుగుతుందో, ముందు బయటపెట్టిన వారికి ముందు లాభం కలిగే వీలు ఎలా ఉంటుందో వివరించి సాధించాలి. ఇందుకోసం అవసరమైతే ప్రపంచవ్యాప్తమైన ప్రభావం వికీమీడియా ఫౌండేషన్ సహకారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలలో అవసరాన్ని బట్టి తన సాయం కూడా అందిస్తానని చెప్పారు.
  • సాలార్ జంగ్ మ్యూజియం, ఇతర విలువైన వస్తు సంగ్రహాలయాలు glam తరహా కార్యక్రమాలకు అంగీకరించకపోవడం గురించి వివరించగా ఇప్పటికే అటువంటి మ్యూజియంలతో దేశవ్యాప్తంగా వ్యవహరించి ఒప్పించిన అనుభవం తనకు ఉందని, కనుక తానూ హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ నివాసం ఉంటున్న ప్రణయ్, సంతోష్ వంటి వారిని కలిసి అటువంటి మ్యూజియం అధికారులతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పారు.
  • నోటబిలిటీ ప్రాతిపదికను తెలుగులో ఏర్పరుచుకునేందుకు ఆంగ్ల వికీ ప్రమాణాలు ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవచ్చో, ఎక్కడ స్వతంత్రంగా వ్యవహరించావచ్చో అన్న విషయాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా నోటబిలిటిపై ఇప్పటికే అక్కడ కొన్ని ప్రమాణాలు ఏర్పడడంతో మూసలనే కాక ఎన్నో సాంకేతిక ఉపకరణాలు అనువదించుకోవచ్చు అంటూ వాటిని చూపారు. ఉపకరణాలు వాడినా పాలసీలు భాషకు అనుగుణంగా ఏర్పరుచుకొమ్మని ఆయన సలహా ఇచ్చారు.
  • హైదరాబాద్ నగర చరిత్రపై ఆసక్తికరంగా పనిచేస్తున్న ఫేస్ బుక్ గుంపును వికీపీడియా వైపు ఆకర్షించేందుకు ఏమి చేయవచ్చునన్న ప్రశ్నకు సమాధానంగా ఇటీవల ఏర్పాటైన చరిత్ర టైం లైన్ ఉదాహరించి, వికీలో వ్యాసం సృష్టించి ఆ వ్యాసం ద్వారా చరిత్ర టైం లైన్ చేయిస్తే వారు ఆసక్తికరంగా భావించి వికీలోకి వచ్చే వీలుంది అన్నారు. ఏ మార్పు చేయాలన్నా వ్యాసంలో మార్పులు చేయాల్సి రావడంతో అది చివరకు వికీకి మేలుగా పరిణమించవచ్చని సూచించారు.
  • ఈ సమయంలో అరుణ్ ఢిల్లీ మ్యూజియంలో ఉన్న అరుదైన కళాఖండం en:Ivory carved tusk depicting Buddha life stories గురించి తాను ఆంగ్లవికీలో వ్రాసిన వ్యాసం గురించి వివరించారు. ఆపైన దానిని తెలుగు వికీపీడియాలోకి అనువదించమని కోరారు.(ఆ అనువాదం ఇక్కడ చూడవచ్చు)

రవి (Ravi (Tamil Wikipedian)

మార్చు
 
కన్నడ,ఒడియా వికీ సమూహపు సభ్యులతో తెలుగువికీ సభ్యులు

తమిళ వికీమీడియన్ అయిన రవిశంకర్ ను అరుణ్ తో సమావేశం ముగిశాక మూవెన్ పిక్ హోటల్ లాబీలో పవన్ సంతోష్, రహ్మానుద్దీన్, విశ్వనాథ్, ప్రణయ్ రాజ్ లు కలిశారు. తమిళనాట అసంఖ్యాకమైన లైబ్రరీలలో ఉండిపోయిన తెలుగు సారస్వతం గురించి ఆయనతో మాట్లాడి తమిళ వికీపీడియన్లు అటువంటి లైబ్రరీలకు వెళ్తే తెలుగును కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరాము. తమిళనాట తెలుగు సాహిత్యం ఉండడాన్ని గురించి ఆయన వ్యక్తపరిచిన సందేహాలకు రహ్మానుద్దీన్, పవన్ సంతోష్ తెలుగు సారస్వత చరిత్రను వివరిస్తూ దక్షిణాంధ్ర నాయకుల యుగాన్ని గురించి తెలిపి సమాధానమిచ్చారు. అనంతరం జరిగిన చర్చల్లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల ఉమ్మడి సంస్కృతి ఐన కర్ణాటక సంగీతం గురించిన కంటెంట్ అభివృద్ధికి నాలుగు భాషల వికీమీడియన్లు ఓ ఉమ్మడి వేదిక ఏర్పరుచుకోవాల్సిన అవసరం చర్చకు వచ్చింది. ఆయన రెండు ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు. వికీమీడియా భారతదేశ చాప్టర్ ఉద్యోగి స్థాయిలో అన్ని విధాలా తెలుగుకూ సమానంగా వనరులు అందిస్తూ సహకరిస్తానని చెప్పారు.

విశ్వప్రభ (Viswanathan Prabhakaran (Malayalam Wikipedian)

మార్చు
 
విశ్వానాధన్ ప్రభాకరన్‌తో తెలుగువికీ సభ్యులు(ఛాయాచిత్ర సౌజన్యము ప్రణయరాజ్)
 
తెలుగు వికీ సభ్యుల మంతనాలు
  • రాత్రి భోజనం అనంతరం మళయాళ వికీమీడియన్ విశ్వనాథన్ ప్రభాకరన్ (విశ్వప్రభ)ను విశ్వనాథ్, పవన్ సంతోష్, రహ్మానుద్దీన్, ప్రణయ్ రాజ్ లు కలిసి అర్థరాత్రి 2 గంటల వరకూ మాట్లాడారు. మలయాళ వికీమీడియన్లు ఇప్పటికే చక్కని ప్రభుత్వ సహకారంతో ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ వికీసోర్సుకు కేరళ సాహిత్య అకాడమీ నుంచి ఎన్నో కాపీరైట్ మరియు ఉచిత పుస్తకాలు స్వీకరించి, వాటిని యూనీకోడీకరించడానికి పాఠశాల విద్యార్థులకు, ఇతరులకు పోటీలు నిర్వహించారు. దీనివల్ల వెయ్యిమంది పిల్లలు వికీమీడియన్లు కావడమే కాక 12 వేల పేజీలు టైప్ చేసి దిద్దబడ్డాయి.
  • విశ్వనాథన్ ప్రభాకరన్ తో జరిగిన చర్చల సారాంశం కింద ఉంది.(ఈ సమాధానాలు అన్నీ రహ్మాన్, సంతోష్, విశ్వనాథ్, ప్రణయ్ లు వేసిన ప్రశ్నలకు సమాధానాలు):
  • డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పుస్తకాలు తెవికీలో ఇప్పటికే జాబితాలుగా వేస్తున్న విషయం తెలుసుకుని ఈ విషయమై పుస్తకాలు మరింత తేలికగా డీఎల్ఐ సైట్ నుంచి డౌన్లోడ్ చేసి వికీసోర్సులో చేర్చడం నేర్పుతానని ముందుకువచ్చారు. భవిష్యత్తులో ఈ పుస్తకాల వివరాలు వికీడేటా ద్వారా మరింత ఉపయోగకరం అయ్యేందుకు భారతీయ భాషలు అన్నీ ప్రయోజనం పొందేలా ఓ సమగ్రమైన సాంకేతిక ప్రయత్నం జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఆ దిశగా కొన్ని విషయాలు రెహ్మాన్, విశ్వప్రభలు పంచుకున్నారు.
  • మళయాళ వికీపీడియా అభివృద్ధికి ప్రభుత్వాన్ని ఎలా సంప్రదిస్తున్నారో, ఏ విధంగా ప్రభుత్వంతో వికీకి ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కృషిజరుగుతోందో విశ్వప్రభ ద్వారా తెలుసుకోవడం జరిగింది. స్వేచ్చా విజ్ఞానం పట్ల ప్రభుత్వంలో సానుకూలమైన దృక్పథం ఉన్న వ్యక్తులు ఉండడంలోని అవసరాన్ని ఆయన వివరించారు. ఈ విషయంలో తెవికీ పరిస్థితిని, తెవికీకి సానుకూలంగా ఉన్న వ్యక్తులను గురించి కొంతవరకూ ఆయనకు వివరించడం జరిగింది. చివరిగా ప్రభుత్వంలో వ్యక్తులు మారుతూండడం తద్వారా విధానాలు బుట్టదాఖలై మళ్ళీ కొత్త ప్రయత్నాలు చేసుకుంటూ రావాల్సిన స్థితి ఏర్పడడం గురించి వివరించి విశ్వప్రభ వాపోయారు. ఈ అంశంలో మరింత బలమైన సానుకూల వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాల్సిన అంశంపై అందరూ ఏకీభవించారు.
  • మలయాళ వికీసోర్సు చేసిన విజయవంతమైన పోటీ గురించి ఆయన తెలిపారు. ఆ ప్రయత్నం ఎలా మొదలైందన్న విషయంపై ఆసక్తికరమైన కోణాలు పంచుకున్నారు. మొదట ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటుచేసి, దానిని సద్వినియోగం చేసేందుకు సరైన విధానాన్ని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, ఆపైన అలాంటి విధానం కోసం అన్వేషిస్తూ ఉపాధ్యాయులకు కొందరు సాంకేతికంగా ముందున్న ఉపాధ్యాయులతో శిక్షణ నిర్వహించారని తెలిపారు. అదే సమయంలో ఆ శిక్షణను ఇచ్చే టీచర్లు వికీపీడియన్లు కావడంతో వారు వికీపీడియన్లతో ప్రభుత్వం పాలసీ స్థితి పంచుకున్నారని చెప్పారు. ఆ నేపథ్యంలో సీనియర్ వికీపీడియన్లు(వారిలో విశ్వనాథన్ ముఖ్యులు) వికీసోర్సు పోటీ రూపొందించి ఆ విధానాన్ని వికీపీడియన్లుగా ఉన్న ఉపాధ్యాయులతో ప్రతిపాదింపజేశారు. ప్రభుత్వం ఈ పోటీ లో పాల్గొనాల్సిందిగా సిఫారసు చేస్తూ పాఠశాలలకు ప్రకటనపత్రికలను పంపింది. ఆపైన ఉపాధ్యాయులకు వికీపీడియన్లు విషయాన్ని వివరించి పిల్లలతో పోటీ చేసేలా ప్రయోగం ప్రారంభించారు. వికీసోర్సులో ఎన్ని పేజీలు /ఎంత కంటెంట్ ఎవరు ఎక్కువ టైప్ చేస్తారన్న అంశంపై ఈ పోటీ జరిగింది. ఆ పోటీ ముగిసేలోగా సిఐఎస్ వారిని సంప్రదించి ధనసహాయము పొందారు. మూడు బహుమతులకు టాబ్లెట్లు ఇచ్చారు. ఇందులో మొదటిది ధనసహాయము ద్వారా కొనగా, మిగిలినవి దాతల సాయంతో ఇచ్చారు. ఇవి గాక పాల్గొన్నవారికి అందరికీ పుస్తకాల అంగడిలో చెల్లే రెండేసి వేల రూపాయల బహుమతి పత్రాలను కూడా బహూకరించారు. ఈ పోటీ ద్వారా 12వేల పేజీలను వెయ్యిమంది కొత్త వాడుకరులు టైప్ చేశారు.
  • ఈ పోటీ నిర్వహణకు ఉపయోగించిన ఉపకరణాలు, ఉదాహరణకు: వికీసోర్సులో ఎవరెన్ని పేజీలు , ఎంత సమాచారాన్ని రాస్తున్నారన్న విషయాలు తెలిపే గణణ పనిముట్లు వంటివి, తెవికీతో పంచుకుంటానని ఆయన ముందుకువచ్చారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తమ అనుభవం ఉపయోగపడుతుందని ఆయన భావించారు. చివరగా తనకు తెలుగైనా, మళయాళమైనా, తమిళమైనా ఒకలాంటివే అన్నారు. ఒక భాష మసాలాదోస, మరో భాష పూరీ, ఇంకొకటి పావ్ భాజీ లాంటివి ఏదైనా రుచికరమే అంటూ చమత్కరించారు.
  • మలయాళ వికీసోర్సు అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెవికీకి కూడా ఉపకరిస్తాయని భావించి ఆయనతో మాట్లాడడం జరిగింది. రాత్రి రెండింటి వరకూ ఆ చర్చ నడచింది. ఆపైన తెల్లవారుఝాము నాలుగు గంటలకు బయలుదేరి పవన్ సంతోష్, విశ్వనాథ్‌లు హైదరాబాద్, రాజమండ్రి వెళ్ళిపోగా, ప్రణయ్ 6 వ తేది ఉదయం బయలుదేరి హైదరాబాద్ చేరారు. రహమాన్ బెంగళూరులో ఉండిపోయారు.

లంకెలు

మార్చు