వికీపీడియా:సమావేశం/హైదరాబాదులో వికీపీడియా దశాబ్ది వేడుకలు
జనవరి 23, 2011 న హైదరాబాద్ లో వికీపీడియా దశాబ్ది ఉత్సవాలను వికీపీడియన్లు నిర్వహించారు. ఆ వేడుక యొక్క సంగతులు, విశేషాలని ఈ పేజీలో క్రోడీకరిద్దాం. దయచేసి ఈ పేజీలోని అంశాలని విశదీకరించండి.
కార్యక్రమ నివేదిక
మార్చు- వికీపీడియా 10 సంవత్సరాల ప్రస్థానంపై జిమ్మీవేల్స్ సందేశం (వీడియో)
- తెవికీలోని విశేష వ్యాసాలు, లిబ్రె ఆఫీస్, మరియు ఇతర సమాచారంతో కూడిన సీడీ ఆవిష్కరణ, పంపిణీ
- వికీపీడియా 10 కేకు కోత.
- దీన్ని వికీ పద్ధతిలో చేసాం. ఆంగ్లాక్షరాలు మరియు అంకెలు ఉన్న చీటీలని అందరికీ పంచి వాటిల్లో "W", "1", మరియు "0" అన్న చీటీలు వచ్చిన వారితో కేకుని కోయించాం.
- వికీపీడియా మరియు సోదర ప్రాజెక్టుల గురించిన వివరణ
- 2010లో తెలుగు వికీపీడియా ప్రగతిపై అవలోకనం.
- వికీపీడియాలో వ్యాసాలు ఎలా వ్రాయాలి అన్న అంశంపై ప్రదర్శన
- కంప్యూటర్లపై నేరుగా ప్రయోగాలు
హాజరైనవారు
మార్చుబొమ్మల కొలువు
మార్చుమీ అభిప్రాయాలు
మార్చుఈ వేడుకల గురించి, కార్యక్రమాల గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింద వ్రాయండి.
- నేను మొదటిసారి వికీ సమావేశాలలో పాల్గొనడం. ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఇలాంటి సమావేశాలు ప్రతి నెల హైదరాబాదులో జరిగితే బాగుంటుంది. లైవ్ గా వికీలో రచనలు చేసేవారి అనుమానాలు నివృత్తి చేయవచ్చును. వికీ అభివృద్ధికి ఒక మార్గ నిర్దేశానికి కూడా మంచి అవకాశం చేకురుతుంది. నా కేంద్రంలో అభిరుచి ఉన్నవారెవరికైనా నేను వికీ గురించి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను.Rajasekhar1961 05:16, 24 జనవరి 2011 (UTC)
- నేను ఈ సమావేశంలో కొన్ని విషయాలు ఛెప్పలేకపోయాను. కొత్తపల్లి సంస్థ ఉబుంటులో స్క్రైబస్ లో తెలుగు వాడుకోలేకపోతున్నామనీ, ఈ విషయాన్ని సదస్సు దృష్టికి తీసుకురమ్మని కోరారు.అలాగే అనూ ఫాంట్స్ ని యునికోడ్ లోకి మార్ఛగలిగే టూల్స్ గురింఛి ఛెప్పమన్నారు. ఈ అంశాలపై కృషి ఛెయగలరు. ధన్యవాదాలతో, డా.శివబాబు
- వికీపేడియా దశాబ్ది వేడుకలలో పాల్గొనడం నాకు చాలా అనందాన్ని కలుగచేసింది. నిర్వాహకులకు, మా సందేహాలు తీర్చిన అర్జున రావు గారికి, రహ్మానుద్దీన్ గారికి, వీవెన్ గారికి, ఆతిధ్యమిచ్చిన కశ్యప్ గారికి, వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్రీనివాస కుమార్ గారికి నా ధన్యవాదాలు. వికీపీడియా రూపకర్త జిమ్మీ వేల్స్ కు నా అభినందనలు. నేను వికీపేడియాకు చాలా ఋణపడి ఉన్నాను. అందుకని వీలైనంత మందికి, ముఖ్యంగా స్త్రీలకీ, పిల్లలకీ, రైతులకీ వికీపేడియా, మరియు వికీమీడియా యొక్క ఇతర ప్రాజక్టుల గురించి తెలియచెప్పడానికి నాకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటాను. విక్షనరీ లో వ్యవసాయ పదజాలాన్ని సమకూర్చే ప్రయత్నంలో ఉన్నాను- సుగుణశ్రీ