వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/2018 మే 20 ప్రాజెక్టు టైగర్ ఎడిటథాన్
ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ ఎడిటథాన్
వివరాలు
మార్చు- ప్రదేశం: పవన్ సంతోష్ నివాసంలో, ప్రగతి నగర్ చెరువు సమీపంలో, భాగ్యనగర్ హైట్స్, హైదరాబాద్
- తేదీ & సమయం: 2018 మే 20, ఆదివారం
కార్యక్రమ ప్రణాళిక
మార్చు- కార్యక్రమంలోనే "ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ" ఎడిటథాన్ జరుగుతుంది.
సమావేశ నిర్వాహకులు
మార్చు- అజయ్
నిర్వహణ సహకారం
మార్చు- పవన్ సంతోష్
పాల్గొన్నవారు
మార్చునివేదిక
మార్చు- 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు వికీపీడియన్లు వీవెన్, అజయ్ బండి, స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ కార్యకర్త, తెలుగు వికీపీడియాలో ఇటీవల చేరిన జోయల్ వినయ్, పవన్ సంతోష్ కలిశారు.
- పవన్ సంతోష్ ప్రాజెక్టు టైగర్ ఎందుకు నిర్వహిస్తున్నారో వివరించి స్థానిక అంశాల జాబితా, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యతా జాబితాలు వారికి చూపించాడు. తన వ్యక్తిగత గ్రంథాలయంలోని పలు పుస్తకాలను సభ్యులకు ఇచ్చి, వాటి ఆధారంగా వ్యాసాలు వ్రాయమని ప్రోత్సహించాడు.
- వీవెన్ ఒక వ్యాసాన్ని అనువదించారు. అనువాదంలో ఏర్పడే సమస్యలు, వాటిని దిద్దుకోవల్సిన విధానాల గురించి ఇతర సభ్యులకు ఇష్టాగోష్టిగా వివరించారు.
- అజయ్ తాను చేస్తున్న అనువాదాలు కొనసాగించారు. తెలుగు నవలా సాహిత్యం గురించి రిఫరెన్సు గ్రంథాన్ని తీసుకుని దాని ఆధారంగా వ్యాసాలు సృష్టించడం, విస్తరించడం సాగించారు.
- జోయల్ అనువాద వ్యాసాలు రాశారు. శాస్త్రీయమైన అంశాలపైన తెలుగులో అనువాదాలు చేస్తానని తెలిపారు. ఎడిటథాన్ సభ్యులు దాదాపు 6 గంటల వరకూ తమ ఎడిటింగ్ కార్యకలాపాలు కొనసాగించి తర్వాత సమావేశాన్ని ముగించారు.
- 26న స్వేచ్ఛ సంస్థ సభ్యుడు భవభూతి ఆధ్వర్యంలో లమకాన్‌లో ఇటువంటిదే మరో ఎడిటథాన్ తలపెట్టినా అది జరగలేదు.