వికీపీడియా:స్థానికీకరణ

మీడియావికీ తెలుగు రూపమునకు చాలావరకు ట్రాన్సేట్వికీ.నెట్ లో స్థానికరణ చెయ్యాలి. దానిలో ఖాతా ద్వారా ప్రవేశించి మాత్రమే చేయాలి. అయితే కొన్ని సందేశాలకు లక్ష్య వికీపైనే చేయాలి. ట్రాన్స్లేట్ వికీలో కొత్త అనువాదాలు ప్రతిరోజు వికీమీడియా గెర్రిట్ లో తాజా చేయబడతాయి. సోమవారం లేక గురువారం వికీమీడియా గిట్హబ్ లో చేర్చబడి[1], ఆ కోడ్ విడుదలైనపుడు(సాధారణంగా 15-30 రోజులకొకసారి) ఉపయోగంలోకి వస్తాయి.[2][3]

సవరించాల్సిన సందేశాన్ని గుర్తించుట మార్చు

  • మామూలుగా తెలుగు రూపం అక్కడక్కడా అనువాదం కాని సందేశాలు ఆంగ్లంలో కనబడతాయి. అలా ఆంగ్లంలో కనబడే సందేశపు కోడ్ ని గుర్తించటానికి. పేజీ చివరిన ?uselang=qqx అని చేర్చి మరల పేజీ చూడండి. ఉదా: మొదటి పేజీలో సందేశపు కోడ్ల కనబడే ఉదాహరణ)
  • వ్యాస చరిత్ర లాంటి పేజీల URL లో ? వాడబడివుంటే &uselang=qqx అని చేర్చితే సరిపోతుంది.(ఉదాహరణ)
  • అప్రమేయంగా రూపుదిద్దే పేజీలకు (Special:Pages) ?uselang=qqx &debug=1చేర్చాలి. (ఉదాహరణ) .

అప్పుడు కనబడే (బ్రాకెట్ల లోని కోడ్ ని తీసుకొని) ట్రాన్స్లేట్వికీ.నెట్ లో సందేశానికి http://translatewiki.net/wiki/MediaWiki:<తరువాత సందేశముకోడ్>/te చేర్చిన యూఆర్ఎల్ కి వెళ్లండి. అక్కడ అనువాదాన్ని సరిదిద్ది భద్రపరచండి. ఆ మార్పు తెవికీ లో ప్రతిఫలించడానికి సుమారు రెండు వారాల వరకు పట్టవచ్చు. ఉదా: మొదటిపేజీ అనేదానికి కోడ్ (mainpage) కావున http://translatewiki.net/wiki/MediaWiki:Mainpage/te

ఆ సందేశం మీకు ట్రాన్స్లేట్వికీ.నెట్ లో కనబడకపోయినట్లైతే అది లక్షిత వికీపీడియా లోనే మార్చాలి. ఆ సందేశానికి ముందు MediaWiki: చేర్చి వెతకండి. ప్రత్యేక: ప్రత్యేక పేజీలు ను చూసినపుడు (specialpages-summary) స్థానికీకరణ చేయడానికి ఉదాహరణ. ఇక్కడ చేసినమార్పు భద్రపరచిన వెంటనే క్రియాశీలమవుతుంది.

ప్రత్యేక అనువాదం మార్చాలనుకునేటపుడు అనుభవజ్ఞులైన వారితో సంబంధిత సందేశపుచర్చాపేజీలో లేక రచ్చబండలో చర్చించి మార్చితే బాగుంటుంది.

సందేశం గల మాడ్యూల్ ను గుర్తించుట మార్చు

  • ఇప్పటికే ట్రాన్స్లేట్ వికీలో అనువదించిన సందేశం పేరులో తొలి పదం లేక Tag అనే పదం తర్వాతి పదం మాడ్యూలు పేరవుతుంది. ఉదా:MediaWiki:Discussiontools-replywidget-mode-visual/te, MediaWiki:Tag-discussiontools-visual-description/te లో అనేవాటిలో Discussiontools మాడ్యూల్.
  • మీడియావికీ కోడ్ లో కనబడే ఆంగ్ల సందేశాన్ని వెతకటం [4]ద్వారా ఆ సందేశం గల మాడ్యూల్ ని గుర్తించవచ్చు. ఆ తరువాత ట్రాన్స్లేట్ వికీలో ఆ మాడ్యూల్ కు సంబంధించిన అన్ని సందేశాలకు అవసరమైన అనువాదాలు చేయవచ్చు.

మార్పులు చేసేటప్పుడు గమనించాల్సినఅంశాలు మార్చు

  1. మీడియావికీ పేరుబరులను User: File Talkలను సందేశాలలో మార్చవలసినపనిలేదు. అవి ప్రత్యేకంగా కనబడినప్పుడు మాత్రమే మార్చాలి.
  2. GENDERఅనేది కనబడితే దానిని మార్చకూడదు. కొన్ని భాషలలో సందేశాలను పంపిన వ్యక్తి పురుషుడు లేక స్త్రీ కి తగ్గట్టుగా వాడటానికి అది వాడుతారు. తెలుగులో ఆడ, మగకు గౌరవసూచకంగా ఏకప్రయోగం (రుతో అంతమయ్యేటట్లు) చేస్తే దానిని పట్టించుకోకుండా అనువాదం చేయాలి.
  3. $1, $2 లాంటివి సందేశంలో చేర్చబడే పేరులు అలానే వుంచాలి.
  4. Plural కనబడినపుడు ఏక బహువచనాలకు అనువైన సందేశభాగాలను చేర్చండి.

మీడియా వికీ స్థానికీకరణ స్థితి మార్చు

ట్రాన్స్లేట్వికీ పేజీలో te:తెలుగు వరుస చూడండి. అక్టోబరు 2013న 59శాతంగా వుంది(10,910 /26,896 ). 2020 నవంబర్ 11 న ఇది 29% గా వుంది. 25% కన్నా తగ్గితే కొత్త అనువాదాలు ఎగుమతి కాకపోవచ్చు. కావున దీనిపై ధ్యాస పెట్టాలి. ఇది 75శాతం కన్నా పెచ్చు వుండేటట్లుగా నిర్వహించుకుంటే తెలుగుమాత్రమే తెలిసినవారికి ఉపయోగంగా వుంటుంది.

మీడియావికీలో పనిచేసే స్క్రిప్ట్ ల స్థానికీకరణ మార్చు

దిగుమతి చేసుకున్న మూసలు, హాట్కేట్ లాంటి జావాస్క్రిప్ట్ ప్రోగ్రాములు స్థానికీకరణ చేయటానికి మూలంలో స్థానికీకరణ భాగాలను పరిశీలించి అంతవరకే చేయాలి. మూల ప్రొగ్రామ్ నడుస్తున్నప్పుడు తెరపై కనబడే సందేశాలే స్థానికీకరణ చేయవలసినవి. కొన్ని కేటాయించబడిన పేర్లు, మీడియావికీ అప్రమేయంగా తెలుగులో చూపెడుతుందని వాటిని అనువాదం చేయనవసరంలేదని గమనించాలి.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Translating:MediaWiki#Exports". 2020-11-11.
  2. "Release notes (mediawiki)". 2020-11-15.
  3. "Schedule for the deployments (R1.36)". 2020-11-15.
  4. "Mediawiki code search tool". 2020-11-16.