వికీపీడియా:పాఠకుల ప్రశ్నలు

(వికీపీడియా:Readers' FAQ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు
యొక్క భాగము
ప్రశ్నల పేజీలు...
చూడండి...
అడ్డదారి:
WP:RFAQ

వికీపీడియా గురించి పాఠకులకు ఉండే కొన్ని సందేహాలకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది.


వికీపీడియా లో అన్వేషణ ఎలా చెయ్యాలి?

మార్చు
తెర మీద ఎడమ పక్కన ఒక చిన్న అన్వేషణ పెట్టె ఉంటుంది, దాని పక్కనే వెళ్ళు అనీ, అన్వేషణ అని రెండు మీటలు ఉంటాయి. మీరు వెదక దలచిన దాన్ని ఆ పెట్టెలో టైపు చేసి, ఎంటర్‌ కీ ని నొక్కండి. లేదంటే, వెళ్ళు ను గానీ అన్వేషణ ను గానీ నొక్కండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:అన్వేషణ చూడండి.
గూగుల్‌ లో ఈ లింకును ఉపయోగించి కూడా వికీపీడియా లో అన్వేషణ చెయ్యవచ్చు . కాకపోతే గూగుల్‌ లో వచ్చే ఫలితాలు పాతబడి ఉంటాయి. ఎందుకంటే, వారి బాట్స్‌ ఒక నిర్ణీత వ్యవధి ప్రకారం అన్వేషణ చేస్తాయి, అందుచేత ఇటీవల జరిగిన మార్పులు వాటి దృష్టికి రావు.
వికీపీడియా లో అన్వేషణ కు User:AxelBoldt కొన్ని bookmarklets ను తయారు చెసారు. వాటిని మీరు ఇక్కడ పొందవచ్చు.
చివరగా, వికీపీడియా లోని వివిధ భాషల్లో అన్వేషణ కొరకు మీరీ చక్కటి బహుళ భాషాన్వేషి ని వాడవచ్చు (ప్రస్తుతం పనిచేయడం లేదు).

వికీపీడియా తో ఎలా అన్వేషించాలి?

మార్చు
వికీపీడియా లో పరిశోధన గురించిన సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.

వికీపీడియా లోని విషయాలపై లైసెన్సు ఒప్పందం ఏమిటి?

మార్చు
వికీపీడియా లోని వ్యాసాలన్నీ సార్వజనీనం. ఇవి GNU ఫ్రీ దాక్యుమెంటేషన్‌ లైసెన్సు కు లోబడి ఉంటాయి. వికీపీడియా:కాపిహక్కులు చూడండి.

వికీపీడియా మొత్తాన్ని నా సైటు లో ప్రచురించుకోవచ్చా? వికీపీడియా ను ఎంతవరకు నేను ఉదహరించవచ్చు?

మార్చు
మీ ప్రచురణ GNU ఫ్రీ దాక్యుమెంటేషన్‌ లైసెన్సు కు లోబడినంత కాలం, మీ ఇష్టం వచ్చినంత ప్రచురించుకోవచ్చు, ఉదహరించవచ్చు. వికీపీడియా:కాపీహక్కులు చూడండి.

నా సైటు లోని ఒక పదానికి లింకును వికీపీడియా కు ఇవాలంటే, నా సైటుకు GNU FDL ఉండాలా? ఒకవేళ నేను మూడు నాలుగు వాక్యాలు వాడుకుంటే? మొత్తం వ్యాసాన్నే వాడుకుంటే ఏమిటి?

మార్చు
మొదటి రెండూ fair use సిధ్ధాంటానికి లోబడి ఉన్నాయి కనుక వీటికీ "అవసరం లేదు". ఇక మూడోదానికి సంబంధించి, మీ లాయరును సంప్రదించండి. కాకపోతే, వికీపీడియన్లు మంచిగా ఆలోచిస్తారు కనుక, చిన్న చిన్న అతిక్రమణలపై దావాలు వెయ్యం.

వికీపీడియా CD లో దొరుకుతుందా? దాన్ని దిగుమతి చేసుకోవచ్చా?

మార్చు
ప్రస్తుతానికి CD లు లేవు. డాటాబేసు ను ఇక్కడి నుండి దిగుమతి చేసుకోవచ్చు, కానీ, దానిని వాడుకోవాలంటే, మీరు web server, PHP, MySQL మా వికీ సాఫ్ట్‌ వేర్‌ -మీడియావికీ ని మీ కంప్యూటర్‌ లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. వికీపీడియా ను CD గా మార్చడంపై ప్రస్తుతం User:Jimbo Wales/Pushing To 1.0 లో చర్చ జరుగుతున్నది. కాని ఇంకా నిర్ణాయక ప్రణాళికలు తయారు చెయ్యలేదు.


అయితే, చాలమంది వికీపీడియన్లు వివిధ వికీపీడియా డాటాబేసులను TomeRaider మూస లో అందుబాటులో ఉంచారు. మరిన్ని వివరాలకు వికీపీడియా:TomeRaider database చూడండి.

ఏదైనా పేపరులో వికీపీడియా వ్యాసాన్ని ఉదహరించాలంటే ఎలా?

మార్చు
ఆ పేపరులో ఇతర వనరులను ఎలా ఉదహరిస్తారో అలాగే వికీపీడియానూ ఉదహరించండి. వ్యాసకర్తలను విడి విడిగా ఉదహరించనక్కర లేదు, కానీ మీరు ఆ వ్యాసాన్ని సేకరించిన తేదీని మాత్రం రాయండి.
వికీపీడియా:వికీపీడియా ను ఉదహరించడం చూడండి.

కొన్ని పేజీల నేపధ్యం నీలం గానూ, కొన్నిటికి తెల్ల గాను ఎందుకు ఉంటుంది?

మార్చు
విజ్ఞాన సర్వస్వం వ్యాసాల పేజీలు తెల్లటి నేపధ్యం తో ఉంటాయి, ప్రత్యేక పేజీలు, చర్చా పేజీలు, సభ్యుని పేజీలు, వికీపీడియా గురించిన పేజీలకు నీలం నేపధ్యం ఉంటుంది. మీరు చూస్తున్నది సర్వస్వం వ్యాసం అవునో, కాదో చూడగానే తెలియడానికే ఈ ఏర్పాటు.
(గమనిక: మీరు ప్రస్తుతం వాడుతున్న తొడుగు పై దీని సమాధానం ఆధారపడి ఉంటుంది. మరింత సమాచారం కొరకు Help:Preferences on MetaWiki చూడండి.)

యాదృఛ్చిక పేజీ

మార్చు

యాదృఛ్చిక పేజీ లింకును వాడినపుడు, కొన్ని అంతగా ప్రాముఖ్యం లేని విషయాలకు సంబంధించిన వ్యాసాలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి విరుగుడు ఏమిటి?

అవును, అటువంటి పేజీలు ఎక్కువ ఉంటే, తరుచుగా రావడానికి అవకాశం ఉంది. మీకు వాటిపై ఆసక్తి లేకపోతే, మరోసారి యాదృఛ్చిక పేజీ లింకును నొక్కండి.