వికీపీడియా చర్చ:తెవికీ గమనించదగు దినోత్సవాలు

తాజా వ్యాఖ్య: అంతర్జాతీయ కవుల దినోత్సవం టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

అంతర్జాతీయ కవుల దినోత్సవం మార్చు

తెవికీ గమనించుదగు దినోత్సవాల కు మొదటి అడుగు పడినది. విష్ణు గారి చొరవ వలన ఎన్ టి ఆర్ ట్రస్ట్ లో పవన్, కశ్యప్ అక్కడి విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి (Skill Development) కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ కవుల దినోత్సవం (21 మార్చి 2016) న తెవికీలో వ్యాసాలెలా వ్రాయవచ్చునో నేర్పారు. అనివార్య కారణాల వలన కవులు ఈ దినోత్సవం నాడు చురుకుగా పాల్గొనలేకపోయిననూ, ఈ సందర్భంగా కనీసం వికీ గురించిన వ్యాప్తి మరి కొందరికి చేరటం శుభపరిణామం. ఈ దిశగా ఇది మొదటి విజయంగా నేను భావిస్తోన్నాను. వ్యక్తిగత కారణాల వలన నేనూ ఈ ఉత్సవాలలో పాలుపంచుకోలేకపోయినందుకు చింతిస్తున్నాను. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకు తప్పక హాజరయి వికీ వ్యాప్తికి నా వంతు సహాయాన్ని అందించటానికి ప్రయత్నిస్తాను. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కాంక్షిస్తూ ఇందులో నేను పాలుపంచుకొనే శుభదినం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ... మీ - శశి (చర్చ) 09:38, 24 మార్చి 2016 (UTC)Reply

Return to the project page "తెవికీ గమనించదగు దినోత్సవాలు".