వికీపీడియా చర్చ:తెవికీ వ్యాసములు జాబితా (వైవిఎస్‌రెడ్డి)
తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
ప్రసాద్ గారూ నమస్కారం. ఈ వ్యాసాల జాబితా ఎందుకు సృష్టించబడినదో తెలియడం లేదు. ఇలాగే ప్రతి వాడుకరి జాబితా కూడా సృష్టించబడుతుందా? తెలియజేయగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:41, 18 ఫిబ్రవరి 2015 (UTC) సుల్తాన్ ఖాదర్ గారు, నమస్కారము. తప్పకుండా కొంతవరకు అయినా తెలియజేస్తాను.
- ఇది వాడుకరులందరికీ సంబంధించినది. ముందుగా వైవిఎస్‌రెడ్డి గారి జాబితా తీసుకున్నాను. (వారు ధనాత్మక ఆవేశంతో ఆలోచిస్తారని ఆశిస్తాను)
(1) వ్యాసములు సృష్టించిన వాడుకరి వాటి గురించి పట్టించు కుంటారేమో నని ఆశ. (2) వ్యాసములు సృష్టించిన వాడుకరి వాటిని తొలగించుటకు, వృద్ధిపరచుటకు ఏమైనా చర్యలు తీసుకుంటారా ? (3) వ్యాసములు సృష్టించిన వాడుకరి వాటి గురించి అభిప్రాయములు ఆయా వ్యాసములలో కొంత అయినా సమాచారము ఇస్తారా ? ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే..........JVRKPRASAD (చర్చ) 05:52, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- వాడుకరుల అభిప్రాయములు ప్రకారము ఈ జాబితా అభివృద్ధి పరచబడుతుంది. దయచేసి చర్చలు చేయగలరు. JVRKPRASAD (చర్చ) 05:57, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- JVRKPRASAD గారూ 1) ఇది ప్రధాన పేరుబరిలో ఉండకూడదు 2) ఇలాంటి జాబితానే ఆయన వాడుకరి పేజీలో ఉంది కాబట్టి కొత్తగా గుర్తు చేయవలసిన అవసరం లేదనుకుంటా ౩) ఇలా ప్రతి ఒక్కరికి జాబితా చేసి మీ సమయాన్ని వృధాచేసుకోవద్దు ఎందుకంటే పట్టించుకోని వాళ్ళు మనం అరిచి గీపెట్టినా పట్టించుకోరు 4) ఇదివరికే ఆసక్తి ఉన్నవాళ్ళకి ఇలాంటి మొలకల జాబితా తయారు చేయించి ఇవ్వగలను అని నేను చెప్పినప్పుడు ముగ్గురు వాడుకరులు ముందుకొచ్చారు. వారికి నేను ఆ జాబితా తయారుచేసి ఇచ్చాను. మీకూ కావాలంటే మీరు సృష్టించిన మొలకల జాబితా తయారుచేసి ఇవ్వగలను 5) వ్యాసాలు సృష్టించినవారు దానిలో ఇంత సమాచారం చేర్చాలి, అంత సమాచారం చేర్చాలి అన్న నియమేమీ లేదు. నిజానికి వికీపీడియాలో మొలకలు ఉన్నంత మాత్రాన పెద్ద నష్టమేమీ లేదు. కాకపోతే ప్రస్తుతానికి ఈ మొలకలు ఎక్కువగా ఉన్నాయి అంతే --వైజాసత్య (చర్చ) 06:07, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- వైజాసత్య గారు, ఈ జాబితా తయారు విషయములో అసలు నా మంచి ఉద్దేశ్యము (పాత వాడుకరుల సేవలు వెలుగులోకి తీసుకు వద్దామని ఉంది. వారు ఎంతో శ్రమతో పునాదులు వేసి తీర్చిదిద్దారు. వారి సేవలు ఏనాడూ మరువ రానివి. వారు అందరూ మాకు ఆదర్శం కావాలి అని నా ఉద్దేశ్య ఆశ మరియు ఆశయం. కాని వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వారు గౌరవించ దగినవారు. వారికి తగిన మర్యాద, అభిమానము అందించాలి......ఇలా చాలా కోణాలు లోని విషయాలు) చాలా వేరు. అంత విషయాన్ని ఇక్కడ పొందుపరచడము ప్రస్తుతము అవసరము లేదనుకుంటాను. మీరు ఇచ్చిన జవాబులో ముఖ్యమైనది మాత్రము మీ నుండి నేను తయారు చేసిన మొలకలు జాబితా పొందగలను అన్న విషయము. తప్పకుండా దయచేసి నాకు పంపండి. వీలయితే విస్తరిస్తాను. అవకాశము లేకపోతే ఆయా వ్యాసములలో చర్చా పేజీలలో కారణము పొందు పరచుతాను. జవాబు తగు విధముగా అందిస్తారని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 06:40, 18 ఫిబ్రవరి 2015 (UTC)