వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణంతో వ్యాసరచన ఋతువు 2020
తొలగించబడిన గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా
మార్చుగతంలో తొలగించబడిన గూగుల్ అనువాద వ్యాసాలు వికీపీడియా:గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా - 2020 జనవరి 19 పేజీలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా అనువాదం చేయడానికి ఈ జాబితా ఉపయోగపడుతుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:16, 5 అక్టోబరు 2020 (UTC)
కృషి వివరాలను చేర్చడం
మార్చుప్రాజెక్టులో భాగంగా మనం చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు తాజాకరిస్తే బాగుంటుంది. మొత్తమ్మీద ఎంత పని చేసామో, ఎవరెవరు ఎంత పని చేసారో తెలుస్తూంటుంది. పరిశీలించండి. __10:10, 16 అక్టోబరు 2020 (UTC)
అనువాదాన్ని ప్రచురించడంలో లోపం
మార్చుఅనువాద పరికరం నుండి కొన్ని అనువాదాలను ప్రచురించడంలో కింది లోపం తలెత్తుతోంది.
తెలియని, తేరుకోలేని లోపమేదో ఎదురైంది. లోపం వివరాలు: Error converting HTML to wikitext: docserver-http: HTTP 400: {"type":"https://mediawiki.org/wiki/HyperSwitch/errors/unknown_error","method":"post","uri":"<...>
ఈ లోపం కారణంగా ఇప్పటికి మూడు అనువాదాలు ప్రచురణ కాకుండా ఆగిపోయాయి. డెవలపర్లకు రిపోర్టు చేసాను. వేరే భాషల వాళ్లకు కూడా ఈ లోపం వచ్చినట్టు గమనించాను. చూడాలి ఏమౌతుందో.
పేజీలో మ్యాపులు ఉండడం వలన ఇలా జరుగుతుందేమో..నని నా డౌటానుమానం. కాబట్టి మ్యాపులున్న పేజీలను అనువదించేటపుడు మ్యాపులున్న విభాగాలను వదిలేస్తే మంచిదని అనుకుంటున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 04:52, 22 అక్టోబరు 2020 (UTC)
యాభై అయినయ్
మార్చుప్రస్తుతానికి యాభై అయినట్టు కృషి పేజీ చూపిస్తోంది. వెంకటరమణ గారు తన కృషిని చేర్చాల్సి ఉంది. ఇంకా 9 రోజులుంది. ప్రాజెక్టు లోని ఆరుగురం తలా 9 వ్యాసాలు చేరిస్తే వంద అవలీలగా దాటెయ్యొచ్చు. మన ప్రాజెక్టులో రాసి కంటే వాసే ముఖ్యం. కానీ అంకె కూడా చూట్టానికి బాగుండాలి కదా..! అంచేత, రండి.. నడుం కడదాం, వంద కోసం పాటు పడదాం. __చదువరి (చర్చ • రచనలు) 06:51, 22 అక్టోబరు 2020 (UTC)
- చదువరి గారూ, నేను సిద్ధమండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:49, 22 అక్టోబరు 2020 (UTC)
- :) ఏనుగులు తినేవాడికి పీనుగులు ఫలహారమంట ప్రణయ్ గారూ. 1500/1500 చేసినవాడికి 9/9 ఒక లెక్ఖా అంట! ఆంజనేయుడు పిల్లకాలవను దాటినట్టే!! __చదువరి (చర్చ • రచనలు) 09:34, 22 అక్టోబరు 2020 (UTC)
- :):).-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:49, 22 అక్టోబరు 2020 (UTC)
- నేను సిద్ధమే.--యర్రా రామారావు (చర్చ) 15:32, 22 అక్టోబరు 2020 (UTC)
- నేనూ సైయే --పవన్ సంతోష్ (చర్చ)
- :):).-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:49, 22 అక్టోబరు 2020 (UTC)
ఇంకా కొంత మంది అనువదించవలసింది
మార్చునిర్వాహకులు సగానికిపైగా పాల్గొనకపోవడం ఈ ప్రాజెక్టు నాలాంటి సాదా వాడుకరిని నిరుత్సాహపరుస్తుంది...ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 12:04, 1 నవంబర్ 2020 (UTC)
- ప్రభాకర్ గారూ, నిరుత్సాహం కలిగిస్తుంది, నిజమే. నేనూ చాలాసార్లు అనుభవించాను. కానీ తప్పదు, ఇక్కడ అలాగే ఉంటుందని మనకు తెలుసు కదా! పనిచేస్తున్నది మనమొక్కరమే అయినా సరే.., మన మానాన మనం చేసుకుపోవడమే. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమన్నా మనపని మనం చేసుకుపోవాలి. పని చేసేవాళ్లను చూసి ఉత్తేజం పొందాలి (ఉదాహరణ: ప్రణయ్ రాజ్, యర్రా రామారావు, వెంకటరమణ లాంటివాళ్ళు). వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. వాళ్లతో కలిసి పనిచేస్తూ ఉండాలి. అప్పుడు మనకు ఆ నిరుత్సాహం తగ్గుతుంది. ఛీరప్. __చదువరి (చర్చ • రచనలు) 02:07, 2 నవంబర్ 2020 (UTC)
- అంతే, అంతేనండీ..--యర్రా రామారావు (చర్చ) 03:06, 2 నవంబర్ 2020 (UTC)
- చదువరి గారూ, యర్రా రామారావు గారూ, నమస్తే సార్ మీ సూచనలకు ధన్యవాదాలు, కనీసం వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణంతో వ్యాసరచన ఋతువు 2020 ఒకటి జరుగుతుందని ఒక సంతకం అయిన చేసినా కాస్తా సచేతనంగా ఉన్నరనే విషయం అనుకుంటాం కధా సార్ మొలక ప్రాజెక్టు అలానే వదిలేశారు, భవిష్యత్తులో జరిగే ఏ ఇతర ప్రాజెక్టులందు అయినా కనీసం సంతకం అయినా చేయాలని నా విన్నపం. --ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 03:41, 2 నవంబర్ 2020 (UTC)
- ప్రభాకర్ గారూ, ఇక్కడ రాసి తీరాలన్న నియమమేమీ లేదు కాబట్టి దాన్ని ఒక బాధ్యత అని భావించకండి. ఎవరి తీరికను బట్టి వాళ్ళు రాస్తూంటారు. మరీ ముఖ్యంగా నిర్వాహకులు విజ్ఞాన సర్వస్వ వ్యాసాలు రాసి తీరాలన్న నియమమేమీ లేదు. ఈ విషయంలో వాళ్లకు ప్రత్యేక బాధ్యతలేమీ లేవు. వాళ్లకు ప్రత్యేక బాధ్యతంటూ ఏదైనా ఉందీ అంటే అది నిర్వహణ పరంగానే. __చదువరి (చర్చ • రచనలు) 04:39, 2 నవంబర్ 2020 (UTC)
- చదువరి గారూ, ఇక్కడ రాసి తీరాలన్న నియమమేమీ లేదు కాబట్టి దిద్దుబాట్ల సంఖ్య 365 రోజులు సంవత్సరమునకు 300 వదిలేసిన 65 దిద్దుబాట్ల కనీస సంఖ్య గా మార్చండి. సార్ ఇప్పుడున్న దిద్దుబాట్ల సంఖ్య మరీ 20 తక్కువగా ఉన్నది. ఆ చిన్న సంఖ్య కూడా పూర్తి చేయలేకపోతున్నారు. కాస్త బాధ్యత పెంచమని అని నా అభిప్రాయం. --ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 06:04, 2 నవంబర్ 2020 (UTC)