వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఎన్నికలు


ప్రాజెక్టు పరిధి లక్ష్యాలు మార్చు

చురుకుగా ప్రాజెక్టుకొరకు పనిచేసే సభ్యుల తక్కువ కనుక ప్రాజెక్టు 2019 దశ పరిధి రాష్ట్రం, జిల్లా స్థాయి వరకు వుండాలి. నియోజకవర్గ స్థాయిలో ఏకరూపత, నాణ్యత సాధించలేకపోయాము కాబట్టి.--అర్జున (చర్చ) 05:51, 4 ఏప్రిల్ 2019 (UTC)Reply

@User:Chaduvariగారి ఫోన్ చర్చ ప్రకారం, గెలిచినవారి వివరాలు, ఆయా నియోజక వర్గాలలో చేర్చటం పరిధిలో వుండాలి. నియోజకవర్గాల వ్యాసాలను ఏకరూపత సాధించటం ప్రస్తుత దశకి వదిలేయవచ్చు. --అర్జున (చర్చ) 12:14, 4 ఏప్రిల్ 2019 (UTC)Reply

జిల్లా స్థాయి శాసనసభ ఫలితాల పటములు మార్చు

జిల్లా స్థాయి శాసనసభ ఫలితాల పటములు వివరమైన వ్యాసము వున్నప్పుడే ఉపయోగంగా వుంటాయి. వైకాప రికార్డు స్థాయిలో గెలిచినందున, చాలా జిల్లాలకు ఒకటే రంగుగా వుంటుంది. అవసరమైతే పటము కొరకు నన్ను సంప్రదించండి. --అర్జున (చర్చ) 11:45, 10 జూన్ 2019 (UTC)Reply

నియోజకవర్గాల మూసలు మార్చు

{{Infobox constituency}} కు బదులుగా {{Infobox Lok Sabha constituency}} లేక {{Infobox Vidhan Sabha constituency}} వాడితే మన భారత లోకసభ ఎన్నికల ఫలితాలను చేర్చటానికి వీలవుతుంది.--అర్జున (చర్చ) 06:23, 11 జూన్ 2019 (UTC)Reply

ఆంగ్లంలోని మూసలు కూడా సరిగా నిర్మించలేదు. కావున పై ప్రతిపాదన విరమించడమైనది.--అర్జున (చర్చ) 06:36, 11 జూన్ 2019 (UTC)Reply

అర్జున సమీక్ష మార్చు

ప్రాజెక్టు బలాలు మార్చు

  1. సమగ్రంగా ఎన్నికలు మరియు సంబంధిత పేజీల నాణ్యతకు తొలిసారిగా ప్రాజెక్టురూపంలో కృషి
  2. అవసరమైన తెలుగు పటాలు చేర్చగలగటం
  3. ఆంగ్ల వికీతో వివరాలు, పటాలు పంచుకోవటం, వ్యాసం మెరుగుపరచటం

ప్రాజెక్టులో మెరుగుపరచవీలున్నవి మార్చు

  1. ఇద్దరు మాత్రమే చాలా కృషి చేయగా మిగతా సభ్యులు స్వల్పంగా కృషి చేశారు. కావున సమగ్రంగా అనుబంధ వ్యాసాలు తాజాపరచబడలేదు.
  2. చాలామందికి ఆసక్తిగల అంశం ఐనా, ఇతర పనుల ప్రాధాన్యతలవలనో యేమో ఎక్కువమంది పాల్గొనలేదు.

--అర్జున (చర్చ) 04:49, 5 జూలై 2019 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/ఎన్నికలు".