వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/వ్యాస వివరాల పరిచయం

చదువరి అభిప్రాయాలు

మార్చు

ఈ పాఠానికి ముందు, వికీలో ఉన్న వివిధ ఎడిటర్లను వివరించే మరొక పాఠం రావాలని నా అభిప్రాయం. ఎందుకంటే.. "మూలపాఠ్యాన్ని సవరించు", "మూలపాఠ్యాన్ని సృష్టించండి", "సృష్టించు", విభాగాన్ని సవరించే "మూలపాఠ్యాన్ని సవరించు", విభాగాన్ని సవరించే "మార్చు","Edit this page", "సోర్సు చూడు" అనే లింకులను వివరించాలి. వాటిని వివరించాలంటే ముందు వికీలో ఉన్న వివిధ ఎడిటర్లను వివరించాలి. పై లింకుల్లో దేన్ని నొక్కితే ఏ ఎడిటరు వస్తుందో చెప్పాలి. ఒక్కో ఎడిటరు వలన లాభాలేంటో వివరించాలి. ఆ ఎడిటర్లను ఎంచుకోవడం ఎలానో వివరించాలి. అభిరుచుల్లో ఏ అంశాన్ని ఎంచుకుంటే ఏయే ట్యాబులు కనిపిస్తాయో వివరించాలి. విజువల్ ఎడిటరునే ఎంచుకుంటే ఎందుకు మంచిదో వివరించాలి. ఈ పాఠం తయారీలో వికీపీడియా:విజువల్ ఎడిటర్, వికీపీడియా:విజువల్ ఎడిటర్/యూజర్ గైడ్ పేజీలు ఉపయోగపడవచ్చు, పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 05:59, 19 ఏప్రిల్ 2022 (UTC)Reply

ధన్యవాదాలు చదువరి గారు, తెవికీ పాఠ్య ప్రణాళిక పాఠ్యాంశాల పేజీలో `విజువల్, సోర్స్ ఎడిటింగుల పరిచయం' అనే విభాగాన్ని చేర్చాను. మీరు సూచించినట్టుగా వాటికి సంబంధించి కూడా ఒక పాఠాన్ని రూపొందిస్తాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:14, 19 ఏప్రిల్ 2022 (UTC)Reply
చదువరి గారూ, పేజీలోని వీడియో పాఠ్యం విభాగంలో వీడియో తయారీకోసం పాఠాన్ని రాశాను. ఒకసారి పరిశీలించి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే తెలియజేయగలరు.--Pranayraj1985 (చర్చ) 19:30, 21 అక్టోబరు 2022 (UTC)Reply
Pranayraj1985 వికీ పేజీ ఆకృతి గురించి మరింత వివరంగా ఒక పద్ధతిలో వివరించాలి - ఒకదాని లోపల ఒకటి ఉండే మూడు దీర్ఘ చతురస్రాకారపు ఫ్రేములుగా (html ఫ్రేములు కాదు) వికీపేజీని భావించవచ్చు.
  1. అన్నిటి కంటే బయటి ఫ్రేము వికీలోని సమస్త పేరుబరుల్లోనీ సమస్త పేజీలకూ సాధారణంగా ఉండేది. ఇందులో, పేజీలో పైన ఉండే వాడుకరికి సంబంధించిన లింకులు, ఎడమ వైపున ఉండే పరస్పర క్రియ, పరికరాల పట్టి మొదలైనవి ఉంటాయి.
  2. రెండో ఫ్రేము మొదటి దాని లోపల ఉంటుంది, పేఝీ లోని కంటెంటును చుట్టుముట్టి ఉంటుంది. ఇందులో పేజీ కంటెంటుకు సంబంధించిన లింకులు ట్యాబుల రూపంలో ఉంటాయి. వ్యాసం/చర్చ అనే రెండు ట్యాబులు ఒక పక్క ఉండగా వాటికి సంబంధించిన ఉప ట్యాబులు - చదువు, సవరించు/మూలపాఠ్యాన్ని సవరించు/చరిత్ర/ వగైరాలుంటాయి. అదనపు ట్యాబులు కూడా ఉండవచ్చు. పేజీ పేరుబరిని బట్టి ఈ ఫ్రేము లోని లింకులు మారుతూంటాయి. ప్రత్యేక పేరుబరి లోని పేజీలకు ఈ లింకులుండవు. చర్చ పేజీలకు ప్రస్తుతానికైతే "సవరించు" ఉండదు.
  3. ఇక మూడో ఫ్రేము కంటెంటు ఉండేది. ఇందులో వ్యాసం, చర్చ, ప్రాజెక్టు వ్యాసం, మూస, వర్గం వగైరాలు ఆయా ఆకృతుల్లో ఉంటాయి.
ఇలా పేజీని విడగొట్టి చూపిస్తే కొత్తవారికి అయోమయం తగ్గి, స్పష్టత ఏర్పడుతుందని నా ఉద్దేశం.
మూడో ఫ్రేము గురించి రాసేటపుడు పై రెండు ఫ్రేముల గురించి రాయకూడదు. ఇక్కడ ఈ పేజీలో చూస్తే రెండో ఫ్రేములో ఉండే ట్యాబుల గురించి కూడా ఇందులో ఉంది. అలా కాకుండా దేనికదే ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 01:53, 22 అక్టోబరు 2022 (UTC)Reply
అలాగేనండీ @చదువరి గారు. వికీ పేజీ ఆకృతి గురించి సులభంగా అర్థమయ్యేలా టాపిక్స్ ని విడివిడిగా రాస్తాను. ధన్యవాదాలు.-- Pranayraj1985 (చర్చ) 17:59, 24 అక్టోబరు 2022 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/వ్యాస వివరాల పరిచయం".