వికీపీడియా చర్చ:విషయ అనువాద ఉపకరణం

తాజా వ్యాఖ్య: ఈ పేజీలో అవసరమైన మార్పుచేర్పులు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

ఈ పేజీలో అవసరమైన మార్పుచేర్పులు

మార్చు

ఈ పేజీ, ఈ కూర్పుకు సంబంధించి నేను గమనించిన అంశాలివి:

  1. అనువాద పరికరం గురించి ప్రాథమికంగా చెప్పాల్సిన అంశాలను ఈ పేజీలో చెప్పలేదు. ఉదాహరణకు కొన్ని ఇక్కడ:
    1. వికీలింకులను ఎలా చూపిస్తుంది? ఒక్కోసారి ఎందుకు చూపించదు?
    2. సమాచారపెట్టెలను కొన్ని సందర్భాల్లో చూపిస్తూ కొన్నిసార్లు చూపించదెందుకు?
    3. అలా చూపించనపుడు సమాచారపెట్టెలను ఏం చెయ్యాలి?
    4. ప్రస్తుతం అందులో ఉన్న సమస్యలేంటో రాయాలి. ఉదాహరణకు-
      1. అనువాదం చేస్తోంటే పేజీ అస్తమానూ కిందకి జరుగుతోందేంటి? ఈ ఇబ్బందిని ఎలా ఎదుర్కొనాలి?
      2. ఒక్కోసారి ప్రచురించకుండా ఫలానా ఎర్రరును చూపిస్తోంది కదా.. అప్పుడేం చెయ్యాలి?
      3. మామూలుగా మూలాలు బానే వస్తున్నై గానీ, కొన్ని సార్లు రావడం లేదు కదా.. మరి అప్పుడేం చెయ్యాలి?
      4. అనువాదం అంతా బాగానే చేస్తూనే, ఒక పేరాను మాత్రం అనువాదం చెయ్యకుండా ఇంగ్లీషు పాఠ్యాన్నే ఉన్నదున్నట్టుగా చూపిస్తోందే.. అలా ఎందుకు జరుగుతోంది? అప్పుడు ఏం చెయ్యాలి?
    5. పేజీని అనువాదం కోసం తెరిచినపుడు కుడివైపున పట్టీలో ఉన్న లింకులేంటి? ఏ సందర్భంలో ఏ పద్ధతిని వాడాలి?
  2. వ్యాసంలో ఉపకరణం అనే మాటను పది సార్లకు మించే వాడారు. పరికరం అని కూడా 3 చోట్ల వాడారు. సందర్భాన్ని బట్టి అవసరమైతే తప్ప, ఈ రెంటిలో ఏదో ఒకటే వాడితే బాగుంటుంది.
  3. పేజీ పేరు మార్చాలి. వ్యాసంలో ఎక్కడా టూల్ అని వాడలేదు. ఉపకరణం అని వాడారు. శీర్షికలో కూడా ఉపకరణమనే వాడొచ్చు.. కానీ టూల్ అని ఎందుకు వాడారో తెలియదు.
  4. "వ్యాసాల ఎంపిక" విభాగంలో రాసినది మొదట్లో బానే ఉంది. కానీ "..చదువరులకు ఆసక్తి లేని .." అంటూ రాసిన భాగాన్ని మార్చాలి. వాడుకరి తనకు ఆసక్తి ఉన్న వ్యాసంపై పనిచేస్తారు గానీ, ఇతరులకు ఆసక్తి ఉన్న పేజీలపై కాదు. చదువరులకు ఆసక్తి ఉండేది రాయండి అనడం సరైనది కాదు. ఆ వాక్యాన్ని తీసెయ్యాలి లేదా మార్చాలి.
  5. "ఇంగ్లీషు నుండి తెలుగు అనువాదానికి ముఖ్యమైనవి" విభాగం: ఈ విభాగం పేరు సరిపోలేదు. అసలు ఈ విభాగం, "శైలి" వ్యాసంలో ఉంటే బాగుంటుంది. దాదాపుగా ఇవే తప్పులను వాడుకరి నేరుగా చేసిన కొన్ని అనువాదాల్లో కూడా చూసాను. ఈ ఉపకరణం వాడకుండా వేరే పద్ధతుల్లో (ఉదా: నేరుగా గూగుల్ ట్రాన్స్‌లేట్ యంత్రం) యాంత్రికానువాదం చేసిన వ్యాసాల్లో ఈ తప్పులన్నీ కనబడ్డై. అంచేత ఈ సమాచారాన్ని శైలికి తరలించి ఆ లింకు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఉపకరణం గురించి చెప్పేందుకే పరిమితమవ్వాలి. అప్పుడు పాఠకుడికి ఈ పేజీ ఫోకస్ ఏంటో తెలుస్తుంది.
  6. "సమాచార పెట్టెల అనువాదాలు" అనే విభాగంలో రాసినది నాకు అర్థం కాలేదు. సమాచారపెట్టెలను అనువదించిన వ్యాసాల్లో ప్రచురించాక నాకైతే ఏ సమస్యా కనబళ్ళేదు. సమస్యను సరిగ్గా వివరిస్తూ తెరపట్టులు పెడితే బాగుంటుంది, దేని గురించి మాట్టాడుతున్నారో తేలిగ్గా అర్థమౌతుంది.
  7. "మరియు, యొక్కలు సవరించడం": ఈ విభాగంలో అసలు చెప్పాల్సిన సమాచారాన్ని చెప్పలేదు. జనరిక్‌గా చెప్పాల్సిన సంగతులను మాత్రం చెప్పారు. CTRL+F వాడి మార్చడం, ఇక్కడ కాకుండా ప్రచురించాక సవరణలు చెయ్యడం లాంటివి జనరిక్‌గా జరిగేవి. "మరియు", "యొక్క" ల ప్రత్యేకత ఏంటి? ఆ సంగతి చెప్పాలి.
  8. "వికీపీడియా" పేరుబరిలో రాసే వ్యాసం ఒక విధానాన్నో, ఒక మార్గదర్శకాన్నో, ఒక పని పద్ధతినో వివరిస్తూంటాయి. విషయం గురించి తెలుసుకోవాలనుకునే వాడుకరులను ఈ పేజీల్లోని సమాచారం సరైన దారిలో నడిపించాలి. "ప్రచురించునపుడు సమస్యలు" అనే విభాగం అలా లేదు. ఈ విభాగంలో రాసినది అప్రామాణికం, తప్పుడు పద్ధతి, చుట్టుతిరుగుడు పద్ధతి, ఎక్కువ సమయంపట్టే పని, వాడుకరులకు ఎక్కువ శ్రమపెట్టే పని. హైదరాబాదు నుండి విజయవాడ వెళ్ళాలంటే నేరుగా 300 కి.మీ. మార్గంలో వెళ్ళాలి. అంతేగానీ, ముందు బెంగళూరు వెళ్ళి, హైదరాబాదు లోనే చేసుకోవాల్సిన పనులన్నిటినీ బెంగళూరులో పూర్తి చేసుకుని, అక్కడి నుండి విజయవాడ వెళ్ళమని చెబుతున్నారు. మొత్తం 1200 కి.మీ. ప్రయాణం! ఒక అసంబద్ధమైన ఉపాయాన్ని ప్రామాణికమైనదిగా చూపించే ప్రయత్నం జరిగిందిక్కడ. అంచేత ఈ విభాగంలో ఉన్న అనుచితమైన పాఠ్యాన్ని తొలగించాలి.

ఇంకా ఇతర విషయాలను కూడా ఏమైనా ఉంటే గమనించి అవసరమైన, ఆవశ్యకమైన విషయాలను చేర్చి, అసంబద్ధమైన, అసందర్భమైన విషయాలను తీసేస్తే, ఈ పేజీ వలన ఉపయోగం ఉంటుంది. __చదువరి (చర్చరచనలు) 05:19, 13 ఫిబ్రవరి 2021 (UTC)Reply

చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. కొన్ని మార్పులు చేశాను. మీరు చిట్కా వాడటాన్ని స్వాగతించారు అన్న విషయం మరిచినట్లున్నారు. వాడుకరిపేరుబరిలో ప్రచురించడం వలన ఇతర ఉపయోగాలుకూడా వున్నాయి. వాటిని చేర్చాను. 'ప్రచురించినపుడు సమస్యలు' విభాగంలో తొలగించవలసినవేమి లేవు. వీలైతే ఇతరత్రా వ్యాసాన్ని అభివృద్ధి పరచడానికి తోడ్పడండి. --అర్జున (చర్చ) 00:58, 14 ఫిబ్రవరి 2021 (UTC)Reply
అర్జున గారూ, చిట్కా వాడడాన్ని స్వాగతించానా!? పైగా ఆ సంగతిని మరచిపోయానా? రెండు మూడు సార్లు ప్రయత్నించి కూడా దాని పట్ల నా అభిప్రాయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానని నాకు తెలిసిపోయింది. చివరిసారిగా మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తాను. ఈ సారి వివరంగా కాకుండా క్రక్సు మాత్రమే చెబుతాను: రచ్చబండలో ప్రదర్శించిన చిట్కా ఎందుకూ పనికిరానిది - వికీపీడియాకు పనికొచ్చేది కాదు, వాడుకరులకూ పనికొచ్చేది కాదు. ఇక ఇంతకంటే వివరంగా దాని గురించి మాట్టాడలేను. నమస్కారం! __చదువరి (చర్చరచనలు) 09:37, 15 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Return to the project page "విషయ అనువాద ఉపకరణం".