వికీపీడియా చర్చ:2023 వికీప్రాజెక్టు ప్రతిపాదనలు

తాజా వ్యాఖ్య: ప్రాజెక్టుల వ్యవధి ఎంత ఉండాలి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

ప్రాజెక్టుల నిర్వహణ

మార్చు

2023 సంవత్సరంలో మొదటి ప్రాజెక్టుగా వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీలో భాషలు ప్రాజెక్టును మొదలెడుకుందాం. ఇంకా ఏయే ప్రాజెక్టులు నిర్వహించుకోవాలో వాడుకరులు ఇక్కడ చర్చించగలరు.-అభిలాష్ మ్యాడం (చర్చ) 07:27, 10 డిసెంబరు 2022 (UTC)Reply

2023 ప్రాథమ్యాలు

మార్చు

80 వేల పేజీలు దాటేసి 2022 సంవత్సరాన్ని ముగించబోతున్నాం. ఈ ఏడు 6000 పేజీలకు పైబడి సృష్టించినట్టు. ఇంకో 20 వేలు సృష్టిస్తే లక్షకు చేరతాం. 2023 లో కొత్త పేజీల సృష్టిపై దృష్టి పెట్టి వీలైనంత త్వరగా ఈ సంఖ్యకు చేరాలని నా అభిప్రాయం. 2023 లో మనం పెట్టుకోబోయే కార్యక్రమాల్లో పేజీలను సృష్టించే ఎడిటథాన్‌లు ఎక్కువగా ఉండాలని నా అభిప్రాయం. __ చదువరి (చర్చరచనలు) 11:08, 10 డిసెంబరు 2022 (UTC)Reply

చదువరి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. NskJnv 14:07, 10 డిసెంబరు 2022 (UTC)Reply

ప్రాజెక్టుల వ్యవధి ఎంత ఉండాలి

మార్చు

మనం చేపడుతున్న వికీ ప్రాజెక్టుల్లో ఎడిటథాన్ అనేవి ఒక రకం. ఎడిటథాన్ అనేమాట ఎడిట్, మారథాన్ అనే రెండు మాటల నుండి వచ్చిన పోర్ట్‌మాంటో అని మనకు తెలుసు. సుదీర్ఘంగా జరిగే (మారథాన్) ఎడిటింగు అన్నమాట.

  • ఒకటి రెండు రోజుల పాటు జరిగే ఎడిటింగు జాతరలు పెట్టుకోవచ్చు. శనాది వారాలు రెండు రోజులు గాని, ఒక 24 గంటల ఎడిటింగు లాగా గానీ పెట్టుకోవచ్చు. ఇవి 100 మీటర్ల పరుగు పందేల లాంటివి. నెలకొకటి చొప్పున ఒక సంవత్సరంలో ఇవి 10 దాకా పెట్టుకోవచ్చు.
  • మరీ సుదీర్ఘంగా కాకుండా ఒకటి రెండు వారాల పాటు మాత్రమే సాగే మారథాన్లు బాగా ఎక్కువగా పెట్టుకోవడం ఒక పద్ధతి. సప్తాహాలు అన్నమాట. ఇవి 400 మీటర్ల పరుగుల్లాంటివి. ఈ పద్ధతిలో కూడా నెలకొకటి చొప్పున 10 దాకా ఎడిటథాన్లు పెట్టుకోవచ్చు.
  • ఒకటి నుండి మూడు నెలల పాటు జరిగే ప్రాజెక్టు. నిజమైన మారథాన్ ఎడిటింగు ఇది. మొలకల విస్తరణ, ఫొటోల చేర్పు లాంటి మూణ్ణెల్ల ప్రాజెక్టులను విజయవంతం గానే నడిపినప్పటికీ, అన్ని రోజుల పాటు మనం ఆసక్తిని నిలిపి ఉంచుకోవడం కొంత కష్టమని నాకు అనిపించింది. (ప్రాజెక్టు అంటే మొదలుపెట్టి వదిలెయ్యడం కాదు గదా.. దాన్ని ముందుండి నడిపించాలి, అందరూ చురుగ్గా పాల్గొని కృషి చేస్తే తప్ప అవి విజయవంతం కావు.) అంచేత వ్యక్తిగతంగా నేను వీటికి వ్యతిరేకం (గతంలో మూణ్ణెల్ల ప్రాజెక్టులను నడిపినప్పటికీ). ఒకవేళ పెట్టుకున్నా గరిష్ఠంగా ఒక నెలకు మించి ఉండకూడదని నా అభిప్రాయం. ఇవి సంవత్సరానికి ఒక రెండు పెట్టుకోవచ్చు.

మొత్తమ్మీద అన్ని రకాలూ కలిపి 20-22 సమష్టి కృషి కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 05:56, 11 డిసెంబరు 2022 (UTC)Reply

యర్రా రామారావు అభిప్రాయం
పై అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.మిగతా ప్రాజెక్టులు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు కాలపరిమితి కొనసాగించాలి.ఏ ప్రాజెక్టు అయినా గరిష్ఠంగా 15 రోజులకు మించి ఉండకూడదనేది నా అభిప్రాయం.విసుగు లేకుండా ఉంటుంది.అవసరమైతే వాటిని మళ్లీ తరువాత సంవత్సరంలో కొనసాగిద్దాం. యర్రా రామారావు (చర్చ) 07:25, 11 డిసెంబరు 2022 (UTC)Reply

ఏమేం పనుల కోసం ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు

మార్చు

ఎడిటథాన్లు, జాతరలు, పండగలూ చేసుకుంటాం. కానీ ఆయా ప్రాజెక్టుల్లో చెయ్యదగ్గ పనులు ఏమేం ఉన్నాయి అని ఆలోచిస్తే నాకు కింది పనులు తోచాయి. ప్రాధాన్యతలు, ప్రాథమ్యాలను పక్కనబెట్టి, ఒక జాబితాగా ఇది రాస్తున్నాను.

లక్ష్యాలు జాతరలు

(1-2 రోజులు)

సప్తాహాలు

(వారం-రెండు వారాలు)

నెల రోజుల ప్రాజెక్టు
1 కొత్త వ్యాసాల సృష్టి 5,000 వ్యాసాల సృష్టి 3 6 1
2 మొలకలను విస్తరించడం 2,000 మొలకల విస్తరణ 2 1
3 వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు వర్గంలో ఉన్న వ్యాసాలను విస్తరించడం, శుద్ధి చెయ్యడం, సకల హంగులను సమకూర్చడం వంటి పనులు చేసి వాటిని ఈ వారం వ్యాసంగా ప్రదర్శించేందుకు సిద్ధం చెయ్యడం. 250 పేజీలు 1
4 అనాథ వ్యాసాల సంస్కరణ 1
5 అయోమయ నివృత్తి పేజీలకు ఉన్న లింకులను తీసెయ్యడం 1
6 వర్గం:అనువదించ వలసిన పేజీలు లో ఉన్న పేజీలను అనువదించడం 150 పేజీలు 1
7 వర్గం:శుద్ధి చేయవలసిన వ్యాసాలు లో ఉన్న పేజీలను సంస్కరించడం 150 పేజీలు 1
8 ఇతరాలు 2 1 1

చదువరి (చర్చరచనలు) 07:10, 11 డిసెంబరు 2022 (UTC)Reply

సూచనామాత్రంగా 2023 కు ఒక షెడ్యూలు

మార్చు
వారాలు
2023 1 2 3 4
జనవరి
ఫిబ్రవరి
మార్చి
ఏప్రిల్
మే
జూన్
జూలై
ఆగస్టు
సెప్టెంబరు
అక్టోబరు
నవంబరు
డిసెంబరు
సూచిక
1-2 రోజుల ప్రాజెక్టు
1-2 వారాల ప్రాజెక్టు
నెల ప్రాజెక్టు

చదువరి (చర్చరచనలు) 07:16, 11 డిసెంబరు 2022 (UTC)Reply

Return to the project page "2023 వికీప్రాజెక్టు ప్రతిపాదనలు".