వికీపీడియా చర్చ:WikiProject/భారతదేశం

తాజా వ్యాఖ్య: ఉప ప్రాజెక్టులు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep

ఉప ప్రాజెక్టులు మార్చు

  • వర్గం:భారత దేశము దర్శనీయ స్థలాలులో ఒకే వ్యాసం ఉంది. ఒకవేళ ఇలాంటిది వేరే వర్గము ఏమైనా ఉన్నదా? ఉంటే వాటిని విలీనం చేయగలరా?
  • మూస:వికిప్రాజెక్టు భారతదేశంలో చిన్న స్పెల్లింగు సవరణ చేయగలరు - "వికీపీడియాలో భారదేశానికి" ని ""వికీపీడియాలో భారతదేశానికి" అని మార్చాలి. ఇది మూస గనుక అన్నిచోట్లా వస్తున్నది. (స్పెల్లింగుకు తెలుగుపదం ఉన్నదా? అసలు తెలుగులో స్పెల్లింగులుండవుగదా!)
  • భారతదేశం ప్రాజెక్టులో ఇంకొన్ని ఉపభాగాలు చేర్చడం అవుసరమనిపిస్తున్నది. అవి - మందిరాలు, (చూడవలసిన) స్థలాలు, నాయకులు, సంస్థలు, విశిష్టవ్యక్తులు, వివాదాలు, సమస్యలు, విజయాలు - ఎందుకంటే వీటిపై ఇప్పటికే కొన్ని వ్యాసాలున్నాయి. ఇది నాకు తోచినది. సాధ్యాసాధ్యాలను పరిశీలించగోరుతున్నాను.

(తరువాత ఈ సందేశాన్ని ప్రాజెక్టు చర్చాపేజీకి మార్చవచ్చుననుకొంటాను) కాసుబాబు 11:28, 13 జనవరి 2007 (UTC)Reply

  • మూస:వికిప్రాజెక్టు భారతదేశంలో స్పెల్లింగుని సవరించాను. మీ పరిశీలన అమోగం. స్పెలింగుకి మనం ఇక్కడ భాషా దోషం అని పిలవచ్చేమో!!
  • మీరన్నట్లు మందిరాలు, స్థలాలు, వివాదాలు, సమస్యలు లంటివాటికి ఉప ప్రాజెక్టులు మొదలుపెట్టవచ్చు. కానీ వాటిని భారతదేశం మూసలో పెట్టాలా వద్దా అని అలోచిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాటిని బౌగోలిక వ్యాసాలుగా పరిగణించి ఆయా రాష్ట్రాల ప్రాజెక్టులలో చేర్చేయవచ్చు, అని నా ఉద్దేశం. లేదా వీటికి ప్రత్యేక జెండాలు(మూసలు) తయారు చేయవలసి ఉంటుంది.
  • నాయకులు, విశిష్టవ్యక్తులకు మనం "భారతదేశం జీవితచరిత్రలు" అనే ప్రాజెక్టును మొదలు పెట్టవచ్చు.
  • వికీప్రాజెక్టుల ద్వారా మనం చర్చాపేజీలలో చేర్చే మూసలన్నిటికీ "వికీప్రాజెక్టు" అనే పదంతోనే మొదలవ్వాలి. అలా చేయటం వలన వ్యాసాలకు మనం ఇచ్చే వర్గాలతో కలవకుండా ఉంటాయి. అంటే చర్చా పేజీలను వికీప్రాజెక్టు వర్గాలలో చేరుస్తుంటే వ్యాసాల పేజీలను మమూలు వర్గాలలో చేర్చవచ్చు.

__మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 13:39, 13 జనవరి 2007 (UTC)Reply

Return to the project page "WikiProject/భారతదేశం".