విక్టోరియా మెమోరియల్ హోం

విక్టోరియా మెమోరియల్ హోం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్‌నగర్‌ లో ఉన్న భవనం.[1][2] ఈ భవనంలో ప్రస్తుతం అనాథ పిల్లలకోసం విక్టోరియా మెమోరియల్ స్కూల్ నడుపుతూ, వారందరికి ఉచిత విద్యను అందిస్తున్నారు.[3]

విక్టోరియా మెమోరియల్ హోం
సాధారణ సమాచారం
రకంఅనాథ బాలబాలికల హోం
నిర్మాణ శైలిహైదరాబాదు దక్కన్
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది1901
ప్రారంభం1 జనవరి, 1903

చరిత్ర మార్చు

ఆరవ నిజాం ప్రభువైన మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ తన కుటుంబానికి వేట విడిదిగా, వేసవి విడిదిగానూ ఉపయోగించేందుకు 1901వ సంవత్సరంలో 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించాడు.[4] కానీ ఈ భవనం తనకు కలిసిరాకపోవడంతో దాని నిర్మాణ పనులు నిలిపివేశాడు. బ్రిటన్ రాణి విక్టోరియా చనిపోయిన తొలి రోజుల్లో హైదరాబాదులో ఒక స్మారకంగా ఒక అనాథ శరణాలయం ఏర్పాటుచేయాలని అప్పటి బ్రిటీషు రెసిడెంటు, సర్ డేవిడ్ బార్ నిర్ణయించుకొని, ఆ భవనాన్ని తమకు ఇవ్వాలని నిజాంను కోరారు. వారి కోరికని అంగీకరించిన నిజాం భవన నిర్మాణం పూర్తిచేసి వారికి అందించాడు.[5]

1902-03 మధ్యకాలంలో విక్టోరియా మెమోరియల్ హోం ఫర్ ది ఆర్ఫన్స్ పేరుతో అనాథ ఆశ్రమ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. అప్పటివరకు 54మంది విద్యార్థులతో వరంగల్లు ఉన్న అనాథాశరమాన్ని హైదరాబాదుకు మార్చి, కొంతకాలం చాదర్ ఘాట్ లోని ప్రైవేటు భవనాల్లో తాత్కాలికంగా నిర్వహించబడింది. భవన నిర్మాణం జరిగాక 1905, జనవరి 1వ తేదీన విక్టోరియా మెమోరియల్ హోం ప్రారంభించబడింది.[6]

నెహ్రూ సందర్శన మార్చు

1953, జనవరి 19న జవహార్ లాల్ నెహ్రూ ఈ హోంను సందర్శించాడు. ఆ సందర్భంగా విక్టోరియా మెమోరియల్ హోం ఫర్ ది ఆర్ఫన్స్ అనే పేరులో ఆర్ఫన్స్ అనే పదాన్ని తొలగించాలని నెహ్రూ సూచించడంతో విక్టోరియా మెమోరియల్ హోం అండ్ ఇండస్ట్రియల్ స్కూల్ గా మార్చబడింది.[7]

ఇతర వివరాలు మార్చు

తెలుగు, హిందీ, ఇతర భాషా సినిమాల్లో విలన్లకు సంబంధించిన డెన్ గా ఈ భవనం ఉపయోగించబడింది. ఇక్కడ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను ఉంది.

మూలాలు మార్చు

  1. TNN 24 Feb 2013, 02.17AM IST (24 February 2013). "Manmohan Singh in Hyderabad today – Times Of India". The Times of India. Archived from the original on 20 October 2013. Retrieved 12 April 2019.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Special Correspondent (23 February 2013). "Manmohan to visit Hyderabad blast site today". The Hindu. Retrieved 12 April 2019.
  3. విక్టోరియా మెమోరియల్ హోం, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 15
  4. Deccan Chronicle, Lifestyle-Travel (26 September 2016). "Celebrating 425 years of Hyderabad: Places to explore in city". Archived from the original on 12 April 2019. Retrieved 12 April 2019.
  5. Times of India, Hyderabad (25 September 2018). "Heritage vantage point from Metro". Archived from the original on 12 April 2019. Retrieved 12 April 2019.
  6. విక్టోరియా మెమోరియల్ హోం, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 16
  7. విక్టోరియా మెమోరియల్ హోం, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 17