విక్రమ్ మార్వా
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
విక్రమ్ మార్వా (1925-2013) - ఒక భారతీయ ఆర్థోపెడిక్ సర్జన్, [1][2] గాంధేయవాది, [3] సామాజిక కార్యకర్త.[4] మాతృ సేవా సంఘ్ - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వర్క్ (1921లో నాగ్‌పూర్ కేంద్రంగా స్థాపించబడిన లాభాపేక్ష రహిత సంస్థ) ఆధ్వర్యంలో వికలాంగ పిల్లల పునరావాస కేంద్రం (HCRC), చిల్డ్రన్స్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ (COH), మాతృభు అంతర్గత్ సంస్కార్[5] అనే పిల్లల పత్రిక వ్యవస్థాపకుడు.[6][7][8] డా. బి. సి. రాయ్ అవార్డు గ్రహీత. 2002లో భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.[9]
డాక్టర్ విక్రమ్ మార్వా | |
---|---|
జననం | శివాని, నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం | 1925 జూన్ 4
మరణం | 2013 నవంబరు 6 నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 88)
సమాధి స్థలం | మోక్షధాం |
వృత్తి | ఆర్థోపెడిక్ సర్జన్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | వైద్య సేవ, సామాజిక సేవ |
జీవిత భాగస్వామి | మోహినీ మార్వా |
పిల్లలు | 2; డా. ప్రగతి మార్వా వైద్ (అనస్థీషియాలజిస్ట్); డా. సంజయ్ మార్వా (ఆర్థ్రోస్కోపీ సర్జన్) |
పురస్కారాలు | పద్మశ్రీ డా. బి. సి. రాయ్ అవార్డు ఎ. ఎ. మెహతా గోల్డ్ మెడల్ సర్ ఆర్థర్ ఐర్ బ్రూక్ అవార్డు |
జీవిత చరిత్ర
మార్చు1925 జూన్ 4న మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని శివ్ని గ్రామంలో విక్రమ్ మార్వా జన్మించాడు.[10][11] అతను 1948లో కలకత్తా మెడికల్ కాలేజీ నుండి మెడిసిన్ (MBBS) లో పట్టభద్రుడయ్యాడు. బెంగాల్‌లోని కరవు ప్రభావిత ప్రాంతాల బాధితులకు, స్వాతంత్ర్య ఉద్యమంలోని శరణార్థులకు సేవ చేసే వైద్య వాలంటీర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత, తన ఉన్నత విద్యను అభ్యసిస్తూ 1956లో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (FRCS) ఫెలోషిప్ పొందాడు. 1961లో భారతదేశానికి తిరిగి వచ్చి, ఔరంగాబాద్‌లో సర్జరీ ప్రొఫెసర్‌గా 1971 వరకు పనిచేసాడు. ఈ కాలంలో ఆర్థోపెడిక్స్, పారాప్లేజియా విభాగాలను అభివృద్ధిపరిచాడు.[12] 1971లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), కామన్వెల్త్ ఫెలోషిప్ నుండి స్కాలర్‌షిప్ పొందాడు. 1980లో నాగ్‌పూర్‌కు వెళ్లి, ప్రభుత్వ వైద్య కళాశాలలో పదవీ విరమణ అయ్యే వరకు డీన్‌గా పనిచేశాడు.[13][14][15]
విక్రమ్ మార్వా పదవీ విరమణ తర్వాత 1981లో వికలాంగ పిల్లల పునరావాస కేంద్రం, చిల్డ్రన్స్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌ను స్థాపించాడు. ఇవి పోలియో బాధిత, శారీరకంగా వికలాంగులైన పిల్లలకు చికిత్స చేయడానికి మాతృ సేవా సంఘ్, సీతాబుల్దికి అనుబంధంగా నెలకొల్పాడు. వాటిలో 20 సంవత్సరాల పాటు సేవ అందించాడు. అతను పిల్లల కోసం మాతృభూ అంతర్గత్ సంస్కార్ అనే పత్రికను కూడా స్థాపించాడు. హిందీ భాషపై ఉన్న మమకారంతో ఆయన ఉపాధ్యక్షుడిగా హిందీ రాష్ట్ర భాషా ప్రచార సమితి, విదర్భ సేవా సమితిలలో పనిచేశారు. భారతి కృష్ణ విద్యా విహార్ స్కూల్ స్థాపన, అనేక శస్త్ర చికిత్సలు, రక్తదాన శిబిరాల నిర్వహణ.. ఇలా అన్నింటినీ ముందుండి నడిపించారు.[13][14][15]
జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ విషయాల్లో 22 వైద్య పత్రాలతో ఘనత పొందిన ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎగ్జామినర్ గా ఆమోదించపడ్డారు. ఇండియన్ ఆర్థోపెడిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. విదర్భ ఆర్థోపెడిక్ సొసైటీ సహ వ్యవస్థాపకుడు. అతను జాన్సన్ అండ్ జాన్సన్, స్మిత్ అండ్ నెఫ్యూ ల ఫెలోషిప్ గా కూడా వ్యవహరించారు. అతను ఎ. ఎ. మెహతా గోల్డ్ మెడల్, సర్ ఆర్థర్ ఐర్ బ్రూక్ అవార్డు గ్రహీత. 1979లో డాక్టర్ బి. సి. రాయ్ అవార్డు - మెడికల్ టీచర్, వైద్య విభాగంలో అత్యున్నత భారతీయ పురస్కారం అందుకున్నాడు. భారత ప్రభుత్వం 2002లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. విక్రమ్ మార్వా 88 సంవత్సరాల వయస్సులో 2013 నవంబరు 6న వృద్ధాప్య వ్యాధులతో కన్నుమూసాడు.[13][14][15]
మూలాలు
మార్చు- ↑ "Obituary" (PDF). Archived from the original (PDF) on 2021-01-28.
- ↑ "Golden Bharat". Golden Bharat. 2014. Archived from the original on 25 సెప్టెంబరు 2016. Retrieved 21 January 2015.
- ↑ "Homage" (PDF). BKVVNGP. 2014. Archived from the original (PDF) on 17 జూలై 2016. Retrieved 21 January 2015.
- ↑ "BKVVNGP". BKVVNGP. 2014. Retrieved 21 January 2015.
- ↑ "Yatedo". Yatedo. 2014. Archived from the original on 21 జనవరి 2015. Retrieved 21 January 2015.
- ↑ Wasudeo M Gadegone (February 2014). "Indian J Orthopedics". Indian J Orthop. 48 (1): 115. PMC 3931146.
- ↑ "Dr Vikram Marwah: A great human being". Newspaper article. Bennett, Coleman & Co. 8 November 2013. ISSN 0971-8257. Retrieved 21 January 2015.
- ↑ "Times of India". Times of India. 8 November 2013. Retrieved 21 January 2015.
- ↑ "Padma Awards" (PDF). Padma Awards. 2014. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 11 November 2014.
- ↑ "Nagpur Today". Nagpur Today. 7 November 2013. Retrieved 21 January 2015.
- ↑ Wasudeo M Gadegone (February 2014). "Indian J Orthopedics". Indian J Orthop. 48 (1): 115. PMC 3931146.
- ↑ Wasudeo M Gadegone (February 2014). "Indian J Orthopedics". Indian J Orthop. 48 (1): 115. PMC 3931146.
- ↑ 13.0 13.1 13.2 "Times of India". Times of India. 8 November 2013. Retrieved 21 January 2015.
- ↑ 14.0 14.1 14.2 Wasudeo M Gadegone (February 2014). "Indian J Orthopedics". Indian J Orthop. 48 (1): 115. PMC 3931146.
- ↑ 15.0 15.1 15.2 "Nagpur Today". Nagpur Today. 7 November 2013. Retrieved 21 January 2015.