విక్రమ్‌ సింహ (జననం డిసెంబర్ 27, 1943) మహారాష్ట్రకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు, [2] , 1983 నుండి 2014 వరకు ఐదు పర్యాయాలు పటాన్ (మహారాష్ట్ర శాసన సభ నియోజకవర్గం) నుండి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు.., 1985, 1990, 1995, 1999 2009 ఎన్నికలలో విక్రమ్ సింహ గెలిచాడు. [3] విక్రమ్ సింహ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. [4]

విక్రమ్ సింహ
శరద్ పవార్ (ఎడమ) విక్రమ్ సింహ (కుడి)
మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
In office
1999–2004
ముఖ్యమంత్రివిలాస్ రావ్ దేశ్ ముఖ్
మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
In office
2004 జులై – 2004 నవంబర్
ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే
వ్యక్తిగత వివరాలు
జననం (1943-12-27) 1943 డిసెంబరు 27 (వయసు 80)[1]
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (1999−ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్ ( 1990)భారత జాతీయ కాంగ్రెస్ (1990−1999)
సంతానంసత్యజిత్
కళాశాలబరోడా విశ్వవిద్యాలయం

విక్రమ్ సింహ [5] 2004 జులై నుండి 2004 సెప్టెంబర్ వరకు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వంలో [6] ప్రజా పనుల మంత్రిగా పనిచేశాడు [7] 2004లో, సుశీల్‌కుమార్ షిండే మంత్రివర్గంలో విక్రమ్ సింహ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశాడు.. [8]

వ్యక్తిగత జీవితం

మార్చు

విక్రమ్ సింహ ఒక్కరాజ కుటుంబంలో జన్మించాడు. [9] విక్రమ్ సింహ 1962లో బరోడా విశ్వవిద్యాలయం నుండి వాణిజ్య శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు [10]

రాజకీయ జీవితం

మార్చు

విక్రమ్ సింహ మొదటిసారిగా 1983లో పటాన్ నియోజకవర్గం నుండి ఉప ఎన్నికలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు., [11] 19 85లో అదే నియోజకవర్గం నుండి సోషలిస్ట్ పార్టీ తరఫున రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. విక్రమ్ సింహ1990లో, భారత జాతీయ కాంగ్రెస్‌ తరుపున 62647 ఓట్లతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు . [3] విక్రమ్ సింహ 1995 ఎన్నికల్లో ప్రత్యర్థి శంభురాజ్ దేశాయ్‌ని ఓడించి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1999లో, విక్రమ్ సింహ శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి పోటీ చేసి ఐదోసారి గెలిచాడు . [3]

1999లో ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మంత్రివర్గంలో విక్రమ్ సింహ రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశాడు.[5] 2002లో, విక్రమ్ సింహ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా పనిచేశాడు. విక్రమ్ సింహ జూలై 2004 నుండి నవంబర్ 2004 వరకు సుశీల్ కుమార్ షిండే ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశాడు. [8]

సతారా జిల్లాలో ప్రారంభమైన కొత్త మహాబలేశ్వర్ ప్రాజెక్ట్‌ రూపకల్పనలో విక్రమ్ సింహ ప్రధాన పాత్ర పోషించారు. [12] విక్రమ్ సింహ మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. [13]

2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విక్రమ్ సింహ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. [3] 2009లో పటాన్ నియోజకవర్గం నుండి విక్రమ్ సింహ ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. [14]

మూలాలు

మార్చు
  1. "विक्रमसिंह पाटणकर यांचा आज नागरी सत्कार" (in Marathi). Pudhari. December 26, 2017. Archived from the original on 2019-12-19. Retrieved 2024-01-18.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. "विक्रमसिंह पाटणकरांवर लोकांची मोठी प्रेमभावना : शरद पवार" (in Marathi). Lokmat. December 25, 2018.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. 3.0 3.1 3.2 3.3 "Sitting and previous MLAs from Patan Assembly Constituency". Elections.in. Retrieved December 19, 2019.
  4. Joshi, Yogesh (November 9, 2009). "Senior NCP leaders unhappy at being left out of Cabinet". Hindustan Times.
  5. 5.0 5.1 "The Maharashtra Council of Ministers". Rediff.com. October 31, 1999.
  6. "28 take oath as ministers in Maharashtra". Tribune India. October 19, 1999.
  7. Ashraf, Syed Firdaus (January 25, 2003). "Shivajirao Patil-Nilangekar, Adik in Maharashtra ministry". Rediff.com.
  8. 8.0 8.1 "Shinde keeps revenue, gives energy to Kshirsagar". Zee News. July 13, 2004.
  9. "पाटणकर घराण्याचा इतिहास अलौकिक – बाबासाहेब पुरंदरे" (in Marathi). Loksatta. April 10, 2014.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  10. "Patankar Vikramsinha Ranjitsinha (Winner) - Election Result 2009". Myneta. Retrieved December 19, 2019.
  11. "पाटण तालुक्याला परिस सापडला" (in Marathi). Archived from the original on August 1, 2016.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  12. "नवीन महाबळेश्वर प्रकल्प साकारणारच : पाटणकर" (in Marathi). Dainik Prabhat. September 20, 2019.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  13. "Ex-DCP takes charge of expressway security". The Times of India. October 9, 2002.
  14. "Patan Election Result 2014". News18. December 5, 2019.