విచారణ 2019లో విడుదలైన తెలుగు సినిమా. 2015లో తమిళనాడుకు చెందిన చంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ రాసిన నవల ఆధారంగా తమిళంలో 2019లో విశారణై పేరుతో నిర్మించి, విడుదల చేసిన ఈ సినిమాను తెలుగులో కల్పనా చిత్ర బ్యాన‌ర్‌పై కోనేరు కల్పన నిర్మించాడు.[1] దినేష్, ఆనంది, కిషోర్, సముద్రఖని, అజయ్ ఘోష్, ఆదుకాలం మురుగదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించగా, 08 ఫిబ్రవరి 2019న విడుదలైంది.[2]

విచారణ
దర్శకత్వంవెట్రిమారన్
నిర్మాతకోనేరు కల్పన
నటవర్గందినేష్
ఆనంది
అజయ్ ఘోష్
సముద్రఖని
ఛాయాగ్రహణంఎస్. రామలింగం
కూర్పుకిషోర్
నిర్మాణ
సంస్థ
కల్పనా చిత్ర
విడుదల తేదీలు
2019 ఆగస్టు 8 (2019-08-08)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

గుంటూరులో పాండు (దినేష్ రవి) కూలి పని చేస్తూ ఉంటాడు. ఒక రోజు పోలీసులు పాండుతోపాటు ఆనంది, కిషోర్, మురుగదాస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. ఒక హత్య కేసును ఒప్పుకోమని బలవంత పెట్టి, చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఈ క్రమంలో పాండుకు పోలీస్ స్టేషన్ లోనే ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి (సముద్రఖని) పరిచయమవుతాడు. ఆ తరువాత వారి జీవితం ఏమైంది? వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులుసవరించు

  • దినేష్ రవి
  • ఆనంది
  • కిషోర్
  • ఆదుకాలం మురుగదాస్
  • సముద్రఖని
  • అజయ్ ఘోష్
  • ఇ. రామ్ దాస్
  • సిలంబరసన్ రత్నసామి
  • ప్రదీష్ రాజ్
  • మిషా ఘోషల్
  • శరవణ సుబ్బయ్య
  • హల్వా వాసు
  • మున్నార్ రమేష్
  • దయా సెంథిల్
  • ముత్తుకుమార్
  • చేరన్ రాజ్
  • సూపర్ గుడ్ సుబ్రమణి

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: కల్పనా చిత్ర
  • నిర్మాత: కోనేరు కల్పన
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెట్రిమారన్
  • సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: ఎస్.రామలింగం

మూలాలుసవరించు

  1. HuffPost (8 September 2015). "A 53-Year-Old Auto Driver's Novel Is The Inspiration For 'Visaranai', Premiering At Venice" (in ఇంగ్లీష్). Archived from the original on 12 నవంబరు 2021. Retrieved 12 November 2021.
  2. The News Minute (9 February 2019). "'Visaranai' to be released as 'Vicharana' in Telugu" (in ఇంగ్లీష్). Archived from the original on 12 నవంబరు 2021. Retrieved 12 November 2021.
  3. 123 Telugu (8 February 2019). "Vicharana Movie Review in Telugu |". Archived from the original on 12 నవంబరు 2021. Retrieved 12 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=విచారణ&oldid=3799256" నుండి వెలికితీశారు