సైరా నరసింహారెడ్డి
సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఆగస్టు 16, 2017 బుధవారం ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.[3][4] ఈ సినిమా టీజర్ 2018 ఆగస్టు 20 న విడుదల అయ్యింది.[5]
సైరా నరసింహా రెడ్డి | |
---|---|
దర్శకత్వం | సురేందర్ రెడ్డి |
రచన | సాయి మాధవ్ బుర్రా (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | సురేందర్ రెడ్డి |
కథ | పరుచూరి సోదరులు |
నిర్మాత | రాం చరణ్ తేజ |
తారాగణం | చిరంజీవి అమితాబ్ బచ్చన్ (అతిథి పాత్ర జగపతి బాబు సుదీప్ విజయ్ సేతుపతి నయన తార అనుష్క శెట్టి తమన్నా రవి కిషన్ నీహారిక కొణిదెల |
ఛాయాగ్రహణం | ఆర్. రత్నవేలు |
కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | Songs: అమిత్ త్రివేది[1][2] Score: Julius Packiam |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | UV Creations (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ) Excel Entertainment AA Films (హిందీ డబ్బింగ్ వెర్షన్ ) |
విడుదల తేదీ | 2 అక్టోబరు 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నిర్మాణం
మార్చుచిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా సినిమా తీయాలని చాలా కాలంగా చర్చలు నడిచాయి. అయితే వివిధ నిర్మాతలతో జరిపిన చర్చలు విఫలం కావటంతో విసిగిపోయి చివరికి ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లుగా రాంచరణ్ జూలై 2017లో ప్రకటించాడు.[3]
"తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద సినిమాలలో ఇది కూడా ఒకటి అవుతుంది. దీనికి బడ్జెట్ ఇంత అని కేటాయించలేదు. నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో, అంతటినీ నేనే భరిస్తాను. ఎందుకంటే ఈ సినిమా, నాన్నగారి చిరకాల స్వప్నం" అని టీజర్ విడుదల తర్వాత ఒక ముఖాముఖిలో రాం చరణ్ తెలిపారు.[6]
"నీ రెండవ సినిమాలోనే నువ్వు యుద్ధవీరుని పాత్ర పోషించావు. 150 సినిమాలు చేసినా నాకు అలాంటి అవకాశం రాలేదు. " అని నాన్నగారు నాతో ఒక మారు అన్నారు. ఈ పాత్రపై ఆయనకు ఒకింత ఈర్ష్య కూడా కలిగింది. ఆ రోజు నుండే ఆయన కలను నిజం చేయటానికి ఇటువంటి చిత్రం నిర్మించాలని అనిపించేదని రాం చరణ్ తెలిపారు.
సురేందర్ రెడ్డి వంటి యువ దర్శకుడు ఇంత భారీ ప్రాజెక్టుకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టగలరా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ "ప్రతిభకు మాకు కొదవ లేదు. అన్ని రకాల సినిమాలు చేయాలి. సినిమా కోసం తాను చేసిన పరిశోధన, అందించిన పకడ్బందీ స్క్రిప్టుతో మేము అనుకొన్న దానికంటే సురేందర్ చాలా ఎక్కువగానే కష్టపడ్డాడు." అని రాం చరణ్ తెలిపారు.
సినిమా విజయవంతం అవుతుందా అనే ప్రశ్నకు "జయాపజయాల గురించి నేను పెద్దగా పట్టించుకోదలచుకోలేదు. ఫలితం ఏదయినా నేను సంతోషంగానే ఉంటాను ఎందుకంటే నాన్నగారి కలను నిజం చేయటానికి మేము శాయశక్తులుగా ప్రయత్నిస్తున్నాము. స్క్రిప్టుకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాము. వ్యక్తిగతంగా మాత్రం అన్ని రికార్డులను ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టాలని నేను కోరుకొంటున్నాను." అని తెలిపారు.
ఇదే ముఖాముఖిలో సురేందర్ రెడ్డి, "మేము చాలా పరిశోధించాం. బ్రిటీషు ప్రభుత్వం నరసింహారెడ్డికి విధించిన మరణ శిక్షలో అతని గురించి క్షుణ్ణంగా తెలిపింది. 10,000 మంది సైన్యంతో నరసింహారెడ్డి బ్రిటీషు ప్రభుత్వం పై విరుచుకుపడ్డాడు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చిరంజీవిగారి సినిమాలను మొదటి వరుసలో కూర్చొని చూసేవాడిని. ఇప్పుడు ఆయన సినిమాకే దర్శకత్వం వహించటం, పైగా అమితాబ్ వంటి వారు ఈ సినిమాలో ఉండటం నాకు నమ్మశక్యం కాకుండా ఉంది. అమితాబ్ గారైతే కేవలం చిరంజీవిగారి కోసమే ఈ సినిమాకు ఒప్పుకున్నారు. తర్వాత నేను కథ చెప్పటంతో అది ఆయనను ఆకట్టుకొంది. వారు సంతోషంగా సినిమా చేయటానికి అంగీకరించారు." అని తెలిపారు.
పారితోషికాన్ని నిరాకరించిన అమితాబ్
మార్చుచిరంజీవి గురువుగా కేవలం ఒక చిన్న పాత్ర పోషించటం, చిరంజీవితో ఉన్న అనుబంధంతో అమితాబ్ తన పాత్రకు గాను పారితోషికం తీసుకోవటానికి నిరాకరించారు. పారితోషికం స్వీకరించమని చిరంజీవి ఒత్తిడి చేసిననూ అమితాబ్ సున్నితంగా తిరస్కరించారు. అయితే చిరంజీవి అమితాబ్ కు మూడు కోట్ల విలువ గల నగలను బహూకరించారని సినీ పరిశ్రమ చెప్పుకొంటున్నట్లు హన్స్ ఇండియా పేర్కొంది.[7]
మోషన్ పోస్టర్ విడుదల
మార్చుచిరంజీవి 62వ పుట్టినరోజున తన అభిమానులకు కానుకగా రాం చరణ్ తేజ, 2017 ఆగస్టు 22న ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేశారు. బ్రిటీషు దుష్పరిపాలనను ఎదురించిన తొట్టతొలి వీరుడు, ప్రపంచానికి తెలియని యోధుని చరిత్ర, బ్రిటీషు నియంతృత్వాన్ని నిరసించిన తపస్వి, రేనాటి సూర్యుని వీరగాథ అనే ఉపశీర్షికలతో ఈ మోషన్ పోస్టర్ ప్రారంభమవుతుంది. దూరంగా ఉన్న ఒక కోటపై తగలబడుతోన్న బ్రిటీషు జెండా, కోట గోడలపై బ్రిటీషు వ్యతిరేక నినాదాలు చేస్తున్న భారతీయులు, కోట గోడ క్రింద యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల శవాల కుప్పలు, వీటన్నింటినీ ఒక ఎత్తైన ప్రదేశం నుండి చూస్తోన్న నరసింహారెడ్డి ఈ మోషన్ పోస్టర్ లో కనబడటం జరుగుతుంది. 18వ శతాబ్దపు ఆహార్యంలో ఉన్న చిరంజీవి విల్లంబులు ధరించటమే కాక ఒక ఖడ్గాన్ని కూడా చేతబూని ఉంటాడు. చిట్టచివరన సై రా నరసింహారెడ్డి అనే కేక వినబడగా, దానికి వంత పాడుతూ మరి కొందరు సై సై రా అని అరవటంతో మోషన్ పోస్టర్ అంతమౌతుంది.[8]
విడుదలైన 24 గంటలలోనే ఒక మిలియను వ్యూ లను నమోదు చేసుకొని ఈ మోషన్ పోస్టర్, తెలుగు సినీ పరిశ్రమలోనే రికార్డు నెలకొల్పినది.[9]
నటీ నటుల ఎంపిక
మార్చుఈ చిత్ర కథానాయికగా నయనతారను ఎంచుకోవాలని చిత్ర బృందం పరిశీలించింది.[4] మరో ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ను సంప్రదించారు.[10][11] కన్నడ నటుడు ఉపేంద్రని ప్రత్యర్థిగా ఎంపిక చేయాలని భావించారు.[3]
ఐతే 2017 ఆగస్టు 22 న కొణిదెల ప్రొడక్షన్స్ అధికారికంగా విడుదల చేసిన ఒక వీడియోలో ముఖ్య తారగణం, సాంకేతిక నిపుణులు ప్రకటించబడ్డారు. ఈ వీడియో ప్రకారం అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, నయనతార, విజయ్ సేతుపతిలు ముఖ్య తారాగణం.[12]
ఆహార్యం
మార్చుబాలీవుడ్ చారిత్రక కల్పితాలైన రాం లీలా, బాజీరావ్ మస్తానీ లకు పనిచేసిన డిజైనర్ అంజు మోదీని ఈ చిత్రంలో దుస్తులను, ఆభరణాలను కూర్చటానికి ఎంపిక చేసుకొన్నారు. అదివరకే పలు చిత్రాలలో చిరంజీవికి దుస్తులను కూర్చిన అతని పెద్ద కుమార్తె సుస్మిత అంజుకు సహాయంగా ఉన్నారు.[13]
కాస్ట్యూములు ఖరారు చేయటానికే ఏడాది పట్టినట్లు సుష్మిత తెలిపారు. "అప్పటి తరం వాడే నూలు, వాటి రంగులు వేరు. వాటిని యథాతథంగా చూపటానికి చేనేత నిపుణులను సంప్రదించవలసి వచ్చింది." అని తెలిపారు.
"ఇది కల్పిత కథ కాదు, ఒక చారిత్రక గాథ. ఆ తరం ఆహార్యాన్ని అర్థం చేసుకోవటానికి పలు పుస్తకాలను, ఇతర మూలాలను చదవవలసివచ్దింది. నరసింహా రెడ్డి ఛాయాచిత్రాలు లేవు. కేవలం ఒక చిత్రపటం మాత్రమే ఉంది. ఒకే ఒక చిత్రపటం చూసి ఒక సినిమానే చేసేయాలనుకోవటం కథకు అన్యాయం చేయటమే అవుతుంది. పాలెగాళ్ళ గురించి అప్పటి తరం ఇతర మనుషుల గురించి తెలుసుకోవలసి వచ్చింది. అప్పటి రవాణా, ఆయుధాలు, సరుకు-సరంజామా, ఇంటిలో వినియోగించబడే వస్తువులపై NIFT కు చెందిన విద్యార్థి బృందంతో కలిసి పరిశోధన చేయవలసి వచ్చింది. అంజు మోది నుండి వస్త్రాలు తెప్పించాం కానీ, మా సమిష్టి కృషి ఫలించలేదు. మా అవసరాలను తాను అర్థం చేసుకోలేకపోయేది. అందుకే నేను హైదరాబాదు మకాం మార్చా. కళ లో రాజీవన్, ఆహార్యం లో నేను పరిశోధనలు జరిపాం. మొదట కేవలం నాన్నగారి దుస్తులను మాత్రం డిజైన్ చేయాలనుకొన్నా. కానీ తర్వాత నయన్/తమన్నా ల దుస్తుల బాధ్యతలను కూడా తీసుకొన్నా. నాన్నగారికి ముదురు రంగుల దుస్తులను వాడాము. ఖద్దరు, ముల్ ములు, పట్టు వంటి వస్త్రాలను వాడాము. అప్పట్లో భారతదేశం లో చేనేతలకు లోటు లేదు." అని సుష్మిత తెలిపారు [14]
కళ
మార్చుఈ సినిమాకి కావలసిన సెట్టింగులను రాజస్థాన్, కేరళలోని పొల్లాచ్చిలలో వేసారు.[15]
కెమెరామెన్
మార్చు2017 సెప్టెంబరులో షూటింగు ప్రారంభం కావలసింది. అయితే ముందు తెలుపబడినట్లుగా కాకుండా కెమెరామెన్ రవి వర్మన్ బదులుగా రత్నవేలును తీసుకొనవలసి వచ్చింది. కానీ రత్నవేలు అప్పటికే రాం చరణ్ తేజ నటిస్తున్న రంగస్థలంకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు. దీనితో ఈ చిత్రం యొక్క షూటింగు ప్రారంభం ఆలస్యంగా మొదలయినది.[16]
షూటింగు ప్రారంభం
మార్చు2017, డిసెంబరు 6న హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లీ విట్టెకర్ దర్శకత్వంలో ఒక కీలక పోరాట సన్నివేశంతో చిత్రం షూటింగు మొదలైనది.[17]
షూటింగు లో ఇబ్బందులు
మార్చుఅప్పటి తరం దుస్తులు భారీగా ఉండటం యుద్ధ పరికరాలు ఇతర సామాగ్రి చాలా సమయం మోయటం వలన చిరంజీవికి సాయంత్రం కల్లా భుజం నెప్పి వేసేదని, తోలుతో చేసిన పాదరక్షలు చాలా సమయం వరకు వేసుకోవటం వలన అవి అతని పాదాలని కరిచేవని, అయినా చిరంజీవి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని సుష్మిత తెలిపింది. వీలైనన్ని సౌకర్యాలను చిరంజీవికి కల్పిస్తున్నామని, తాను ఈ ప్రాజెక్టుకు పనిచేయటం అతనికి కూడా గర్వకారణమేనని చెప్పుకొచ్చింది.
టీజర్ విడుదల
మార్చు2018 ఆగస్టు 20 న ఈ చిత్రం యొక్క టీజర్ విడుదలయ్యింది.[18]
భారతీయులను బానిసలుగా వాడుకొంటున్న సన్నివేశాల మధ్యలో, బ్రిటీషు రాజ్యాన్ని ఎదురించిన మొదటి సగటు భారతీయుడు, 18వ శతాబ్దానికి చెందిన, చరిత్ర మరచిన వీరుడి కథ అని ఉపశీర్షికలను చూపుతూ, సమ్మెట పోట్లకు గురవుతోన్న ఖడ్గాన్ని చూపించి, నల్లని దుస్తులలో పెద్ద కోటపై విప్లవ బావుటాను ఎగురవేస్తోన్న నరసింహారెడ్డిని పరిచయం చేస్తుంది ఈ టీజర్. "ఈ యుద్ధం ఎవరిది?" అని సామాన్య పౌరులను ప్రేరేపిస్తూ ప్రశ్నించిన నరసింహారెడ్డికి వారు, మనది అని సమాధానమివ్వటం టీజర్ లో చూడవచ్చు. ఆగ్రహంతో ఊగిపోతున్న ఒక తెల్లదొర, ఆంగ్ల యాసలో నా-ర-షి-మ్మా-రె-డ్డీ! అని అరవగా ఖడ్గాన్ని తిప్పుతూ గుర్రం పై పొదలమాటు నుండి ఆ పాత్రలో చిరంజీవి కెమెరా ముందుకు రావటం అభిమానులను ఉర్రూతలూగించింది. చివరగా "Happy Birthday to Mega Star Chiranjeeevi" అని 2019 లో విడుదల అనే ఉపశీర్షికలతో టీజర్ ముగుస్తుంది.
టీజర్ పై స్పందనలు
మార్చునరసింహారెడ్డిగా చిరంజీవిలో తీవ్రత కనబడిందని, చిత్ర వర్గం చాలా పరిశోధన చేసినట్టు అనిపించిందని, ఇటువంటి టీజర్ గురించి తమ పాఠకులకు తెలియజేయగలగటం తమకు గర్వకారణమని వార్తా పత్రికలు ప్రచురించాయి. అమితాబ్ నరసింహారెడ్డికి గురువు పాత్ర అని, విజయ్ సేతుపతి నరసింహారెడ్డికి నమ్మిన బంటు అయిన ఓబయ్య పాత్ర అని, నయన తారకి నరసింహారెడ్డి భార్య అయిన రాజకుమారి నయనా దేవి పాత్ర అని, తమన్నాకి తమిళ్ అనే యువతి పాత్ర అనీ ఇతర పాత్రలలో సుదీప్, జగపతి బాబు, హుమా కురేషీ, రవి కిషన్ లు ఉన్నారని తెలిపాయి.[19][20][21]
తమన్నా తన ట్వీటులో, "సాహసం, పట్టుదల, స్వాతంత్రాల పురాణ గాథను ఆస్వాదించండి. జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవిగారు, మీ ప్రతిభతో మమ్మల్ని ఎప్పటికీ ఇలానే రంజింపజేయాలని కోరుకొంటున్నాను!" అని పేర్కొన్నది.[22]
విడుదలైన 24 గంటలలోనే కోటి ఇరవై లక్షల వ్యూస్ సాధించినట్లు, తెలుగు సినీ చరిత్రలోనే ఇది రికార్డుగా చిత్ర యూనిట్ ప్రకటించారు [23].
ముగింపు చిత్రీకరణ
మార్చుచిత్రం ముగింపులో ఎనిమిది నిముషాల నిడివిగల పోరాట సన్నివేశం చిత్రీకరించటానికి 54 కోట్లు ఖర్చు అయ్యాయని ఇండియా టుడే ప్రచురించింది [24]. మొత్తం చిత్రం నిర్మించటానికి 200 కోట్లు ఖర్చు అవ్వవచ్చని ఒక లెక్క వేసింది. తాను ముందుగానే చెప్పినట్లు రాం చరణ్ నిర్మాణ వ్యయం విషయంలో వెనుకడుగు వేయనట్లు పేర్కొంది.
ఈ పోరాట సన్నివేశం జార్జియాలో చిత్రీకరించబడింది. చిత్ర యూనిట్ 150 మందిని హైదరాబాద్ నుండి జార్జియాకు తీసుకెళ్ళింది. వీరితో బాటు 600 మంది స్థానికులను కూడా సన్నివేశం కోసం సమకూర్చుకొంది. ఒక బహిరంగ మైదానంలో ఐదు వారాలుగా ఈ పోరాట సన్నివేశం చిత్రీకరించబడింది.
రెండు మార్లు అగ్నిప్రమాదానికి గురి అయిన సెట్స్
మార్చు2017 నవంబరులో అన్నపూర్ణ స్టూడియోస్లో 2 కోట్ల విలువ గల సెట్ సామాగ్రిని నాశనం చేస్తూ ఒక మారు, 2019 మేలో కోకాపేట్ లో 3 కోట్ల విలువ గల సెట్ సామాగ్రిని బూడిద చేస్తూ రెండవ మారు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి [25].
ద మేకింగ్ వీడియో
మార్చుస్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక రోజు ముందుగా మెగా అభిమానులకు ఒక "చిరు" కానుకతో ఆశ్చర్యంతో ముంచెత్తింది. షూటింగ్ ఎలా తీయబడిందో చూపిస్తూ ద మేకింగ్ అనే వీడియోను విడుదల చేసింది.[26]
అదివరకు విడుదలైన టీజర్ లో నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి కోట పై నిలబడి విప్లవ బావుటా ఎగురవేసే సన్నివేశం ఉంది. ఆ కోట నిర్మాణపు దృశ్యాలతో మేకింగ్ వీడియో ప్రారంభం అవుతుంది. కర్నూలు, కడప జిల్లాలతో బాటు మద్రాసు ప్రెసిడెన్సీ దక్షిణ భాగపు మ్యాపు, ఆ యుగంలో వినియోగించబడిన యుద్ధ సామాగ్రి దృశ్యాలతో మేకింగ్ వీడియో వీక్షకులను ఆకట్టుకొంది. కొన్ని పోరాట సన్నివేశాల తర్వాత లీ విట్టేకర్ స్వయానా కనిపించి ఆంగ్లంలో "మీరు మునుపెన్నడూ చూడని పోరాట సన్నివేశాలను చూస్తారు" అని తెలుపుతాడు. పొడవాటి నదిలో తెప్పలపై తరలి వెళుతోన్న సైనికులు, వాటికి దర్శకత్వం వహిస్తూ ఎత్తైన ప్రదేశం నుండి సురేందర్ రెడ్డి; తారాగణాన్ని ధ్రువపరుస్తూ చిత్రంలో వారి దృశ్యాలతో అప్పటి వరకు సినిమా ముందుకెళుతుందా అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చింది. నరసింహా రెడ్డి పాత్రలో చిరంజీవి పరుగులు, కత్తి-డాలులు చేతబూని ఉగ్రమైన అవతారంలో ఆంగ్లేయుల నరమేథం సృష్టించే సన్నివేశాలతో వీడియో అంతం అవుతుంది. టీజర్ 2019 ఆగస్టు 20 అని ఈ వీడియో ప్రకటించింది.[27]
అధికారిక టీజర్
మార్చు2019 ఆగస్టు 20 న చిత్రం యొక్క అధికారిక టీజర్ విడుదలైంది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద హిందు, Chiranjeevi roars like a lion in new ‘Sye Raa Narasimha Reddy’ teaser (చిరంజీవి సైరా నరసింహారెడ్డి టీజర్ లో సింహం లా గర్జించారు) అని పేర్కొంది.[28]. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో టీజర్ విడుదలైంది.
పవన్ కళ్యాణ్ నేపథ్య సంభాషణలతో అధికారిక టీజర్ ప్రారంభం కావటంతో మెగా అభిమానులలో పండగ వాతావరణం నెలకొంది. భారతదేశం ఇప్పటికీ జాతీయ వీరులను తలచుకొంటూనే ఉందని, కానీ దేశం మరచిన వీరులు కూడా కలరని, వారిలో రేనాటి సూర్యుడు నరసింహా రెడ్డి అని తెలిపే పవన్ సంభాషణలు ఆగిపోవటం, రౌద్రంతో రగిలిపోయే చిరంజీవి కళ్ళు కనబడటం ఒకే సారి జరుగుతాయి. చిరంజీవి గుర్రపు స్వారీ, కొన్ని పోరాట సన్నివేశాలతో పరిచయం అవుతాడు. తర్వాత రేనాటి ప్రజలకు ప్రేరణనిస్తూ చిరంజీవి సంభాషణ దృశ్యాలు కనబడతాయి. భారతదేశం మరచిన తొలి విప్లవ వీరుడిని కలవండి (Meet the first rebellion that India has forgotten) అనే వాక్యాలు, తెల్లదొరలను చీల్చి చెండాడుతున్న నరసింహారెడ్డి మరిన్ని పోరాట సన్నివేశాలు కనబడతాయి. చివరగా కత్తి పట్టి కదం త్రొక్కుతున్న చిరంజీవి దృశ్యంతో టీజర్ అంతం అవుతుంది. 02 అక్టోబరున తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలౌతోందని టీజర్ ఖరారు చేసింది [29].
తెలుగు టీజర్ లో పవన్ చేసిన సంభాషణలు, మలయాళంలో మోహన్ లాల్ చేశారు [30] .
కధ
మార్చుతారాగణం
మార్చు- ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి
- సిద్ధమ్మ (నరసింహారెడ్డి ధర్మపత్ని) - నయనతార [31]
- నరసింహా రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచే ఒక రాజు పాత్రలో రాం చరణ్ తేజ [32]
- ఓబయ్య - బ్రహ్మాజీ [33]
- గురువు గోసాయి వెంకన్న - అమితాబ్ బచ్చన్ [34]
- అవుకుకు చెందిన రాజు - సుదీప్ [35]
- శాన్వి మేఘన
పాటల జాబితా
మార్చు- ఓ సైరా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.సునీధి చౌహాన్ , శ్రేయా ఘోషల్
- శ్వాసలోన దేశమే , రచన: చంద్రబోస్, గానం.హరిచరన్
- జాగో నరసింహా జాగోరే , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. శంకర్ మహదేవన్, హరిచరన్, అనురాగ్ కులకర్ణి
- అందం అంకితం, రచన: అనంత్ శ్రీరామ్, గానం విజయ్ ప్రకాష్, శశా తిరుపతి.
సాంకేతిక విభాగం
మార్చు- విజువల్ ఎఫెక్ట్స్: ఆర్ సి కమల్ కన్నన్
- సినిమాటోగ్రఫీ: రత్నవేలు
- ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్ నంబియార్
- స్టంట్ డైరెక్టర్లు: గ్రెగ్ పోవెల్, లీ విట్టెకర్, రాం - లక్షణ
- ఆహార్యం: అంజు మోదీ, సుష్మిత కొణిదెల, ఉత్తర మేనన్
ప్రచారం
మార్చుఅమెజాన్ ఇండియా, ఈ చిత్రం తాలూకు ప్రచారానికి సంబంధించిన హక్కులను సొంతం చేసుకొనటానికి ఆసక్తి చూపింది. 192 దేశాలలో చలామణి అయ్యే అమెజాన్ ప్రైం వీడియోస్ లో ఈ చిత్రం యొక్క ప్రచార దృశ్యాల చోటుకు 30 కోట్ల బేరాన్ని తెలిపింది.[36]
బెస్ట్ డైలాగ్స్
మార్చు1. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం [37]
2. రేనాడు వీరులారా! చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి [38]
వివాదాలు
మార్చుపేరు
మార్చుఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి బదులుగా సైరా నరసింహారెడ్డి అని పేరు మార్చటం ఉయ్యాలవాడ స్థానికులకు నచ్చలేదు. ఇది ఒక స్వాతంత్ర్య సమరయోధుని జీవితగాథ అని, అతని పేరు మార్చటం సమంజసం కాదని, చిత్ర బృందానికి తమ అభిప్రాయభేదం తెలుపుతామని వారు తెలిపారు.[39]
సంగీతం
మార్చుమోషన్ పోస్టర్లో వినబడే నేపథ్య సంగీతం రెహమాన్ కూర్చినది కాదని, ఎస్ ఎస్ థమన్ కూర్చినది అని థమన్ ట్వీట్ చేయటంతో దుమారం రేగినది. అయితే మొదట దీనిని కేవలం ప్రాంతీయ చిత్రంగా రూపొందించాలనే ఆలోచనతో థమన్ ను సంగీతదర్శకుడిగా ఎంపిక చేయటం జరిగినదని, చివరి నిముషంలో ఇది ఒక అంతర్జాతీయ స్థాయి చలనచిత్రంగా నమోదు కావాలనే ఉద్దేశంతో రెహ్మాన్ ను ఎంపిక చేశామని సురేందర్ రెడ్డి తనతో చెప్పి తాను కూర్చిన సంగీతాన్నే మోషన్ పోస్టర్లో ఉపయోగిస్తామని తనకు ముందే తెలిపినట్లు కూడా థమన్ ట్వీట్లలో అంగీకరించాడు. కానీ మోషన్ పోస్టర్ లో ఎక్కడా తన పేరు కనబడకపోవటంతో నిరాశకు లోనయ్యాడని, అందుకే, తనకు తానే ఈ విషయాన్ని సాంఘిక మాధ్యమాల ద్వారా తెలుపదలచుకొన్నాడని థమన్ తెలిపారు.[40]
నటీనట, సాంకేతిక వర్గం నిష్క్రమణ
మార్చుఈ చిత్రంలో నటీనటులు/సాంకేతిక వర్గం సినిమా నుండి నిష్క్రమించారని పుకార్లు షికార్లు చేశాయి.[41][42][43] అయితే చిత్ర సన్నిహిత వర్గాలు వీటిని ఖండించాయి.[44]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Amit Trivedi replaces A.R Rahman in Sye Raa Narasimhareddy". India Today.
- ↑ "Amit Trivedi roped in for Chiranjeevi's Sye Raa Narasimha Reddy". Indian Express.
- ↑ 3.0 3.1 3.2 "Ram Charan is producing Chiranjeevi's 151st film 'Uyyalawada Narasimha Reddy' because he's tired of negotiating with producers?". timesofindia.indiatimes.com. TNN. Retrieved 16 August 2017.
- ↑ 4.0 4.1 "'ఉయ్యాలవాడ..' మొదలైంది". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 16 August 2017. Retrieved 16 August 2017.
- ↑ "Sye Raa Narasimha Reddy First Teaser or First Glimpse". Youtube.
- ↑ టీజర్ విడుదల తర్వాత రాం చరణ్ ముఖాముఖి (ఫస్ట్ పోస్ట్ - 23 ఆగష్టు 2018)
- ↑ పారితోషికాన్ని నిరాకరించిన అమితాబ్, రూ. 3 కోట్ల విలువగల నగలను బహూకరించిన చిరంజీవి (ద హన్స్ ఇండియా - 28 ఆగష్టు 2018)
- ↑ సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ (కొణిదెల ప్రొడక్షన్స్ అధికారిక యూట్యూబ్ లంకె)
- ↑ విడుదలైన 24 గంటలలోనే ఒక మిలియన్ వ్యూలను నమోదు చేసి, రికార్డు సృష్టించిన మోషన్ పోస్టర్[permanent dead link]
- ↑ "Amitabh Bachchan to star in Chiranjeevi's film on freedom fighter Uyyalawada Narsimha Reddy?". hindustantimes.com. హిందుస్తాన్ టైమ్స్. Retrieved 16 August 2017.
- ↑ "మెగాస్టార్ చిత్రంలో 'మెగాస్టార్'?". eenadu.net. ఈనాడు. Archived from the original on 17 August 2017. Retrieved 17 August 2017.
- ↑ ఖరారైన తారాగణాన్ని తెలుపిన మరో వీడియో (కొణిదెల ప్రొడక్షన్స్ అధికారిక యూట్యూబ్ లంకె)
- ↑ దుస్తులు, ఆభరణాలు కూర్చటానికి అంజు మోదీ ఎంపిక[permanent dead link]
- ↑ ఇతరులకు అర్థం కాకపోవటంతో దుస్తుల రూపకల్పన బాధ్యతలను తానే చేపట్టినట్లుగా తెలిపిన సుష్మిత (ద హిందు - 06-సెప్టెంబరు-2018)
- ↑ రాజస్థాన్, కేరళలలో సినిమాకు కావలసిన సెట్టింగులు
- ↑ రాం చరణ్ రంగస్థలం వలనే సైరా షూటింగు ప్రారంభం లో ఆలస్యం
- ↑ "షూటింగు ప్రారంభం". Archived from the original on 2017-12-12. Retrieved 2017-12-08.
- ↑ - యూట్యూబ్ పై టీజర్ యొక్క అధికారిక వీడియో
- ↑ చిరంజీవిలో తీవ్రత కనబడింది - ద ఇండియన్ ఎక్స్ప్రెస్
- ↑ చిత్ర వర్గం చాలా పరిశోధన చేసింది - టైంస్ ఆఫ్ ఇండియా
- ↑ - పాత్రలను ఖరారు చేసిన ఫస్ట్ పోస్ట్
- ↑ టీజర్ విడుదల సందర్భంగా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తమన్నా
- ↑ సైరా టీజర్ టాలీవుడ్ టాప్ (22 ఆగష్టు 2018)
- ↑ ముగింపు లో పోరాట సన్నివేశం చిత్రీకరణను ధృవీకరించిన ఇండియా టుడే (28 సెప్టెంబరు 2018)
- ↑ రెండు మార్లు అగ్నిప్రమాదానికి గురి అయిన సైరా సెట్లు - ఇండియన్ ఎక్స్ప్రెస్ (03 మే 2019)
- ↑ ద మేకింగ్ వీడియో విడుదల - ద హిందూ (14 ఆగస్టు 2018)
- ↑ ద మేకింగ్ వీడియో - కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ (14 ఆగస్టు 2018)
- ↑ టీజర్ లో చిరంజీవి సింహం లా గర్జించారు అని పేర్కొన్న ద హిందు (20 ఆగస్టు 2018)
- ↑ అధికారిక టీజర్ - కొణిదెల ప్రొడక్క్షన్ కంపెనీ (20 ఆగస్టు 2019)
- ↑ మలయాళం లో అధికారిక టీజర్ - కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ (20 ఆగస్టు 2019)
- ↑ సిద్ధమ్మ గా నయనతార (ఇండియా టుడే - 18 నవంబరు 2018)
- ↑ 'సై.. రా'లో రామ్ చరణ్ పాత్ర ఇదే! - సమయం న్యూస్
- ↑ విజయ్ సేతుపతి పాత్ర ని ధృవీకరించిన టైంస్ ఆఫ్ ఇండియా (11-అక్టోబరు-2018)
- ↑ అమితాబ్ పాత్ర ని ధృవీకరించిన హిందుస్తాన్ టైంస్ (11-అక్టోబరు-2018)
- ↑ కిచ్చ సుదీప్ పాత్రను ధృవీకరించిన ఇండియా టుడే (02-సెప్టెంబరు-2018)
- ↑ 'అమెజాన్ ప్రైం వీడియోస్ ద్వారా సైరా ప్రచారం
- ↑ సైరా నరసింహారెడ్డి బెస్ట్ డైలాగ్స్
- ↑ సైరా నరసింహారెడ్డి బెస్ట్ డైలాగ్స్
- ↑ పేరు మార్పు పై ఉయ్యాలవాడ వాసుల అసంతృప్తి
- ↑ మోషన్ పోస్టర్ నేపథ్య సంగీతం కూర్చినది రెహ్మాన్ కాదు, థమన్
- ↑ రెహమాన్ నిష్క్రమణ
- ↑ ఛాయాగ్రహకుడు రవి వర్మన్ విరమణ - అవకాశాన్ని అందిపుచ్చుకొన్న రత్నవేలు
- ↑ నయనతార నిష్క్రమణ
- ↑ చిత్రం నుండి ఎవరూ నిష్క్రమించలేదు: చిత్ర సన్నిహిత వర్గాలు[permanent dead link]