విజయ్ సూర్య (జననం 1990 సెప్టెంబర్ 7) భారతీయ నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. ఆయన కలర్స్ కన్నడలో ప్రసారమైన అగ్నిసాక్షి టెలివిజన్ ధారావాహికతో ఖ్యాతిని పొందాడు.[1]

విజయ్ సూర్య
ఇష్టకామ్య సినిమా' ప్రమోషన్ సమయంలో విజయ్ సూర్య
జననం
విజయ్ సూర్య

(1990-09-07) 1990 సెప్టెంబరు 7 (వయసు 34)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, మోడల్, యాంకర్
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామిచైత్ర (m.2019)
పిల్లలు1

ప్రారంభ జీవితం

మార్చు

ఆయన తన పాఠశాల విద్యను బెంగుళూరులోని క్లారెన్స్ పబ్లిక్ స్కూల్‌లో, ఇంటర్ విద్యను క్రైస్ట్ యూనివర్శిటీలో చదివాడు. ఆయన ముంబైలోని విస్లింగ్ వుడ్స్ అకాడమీలో తన నటనా డిగ్రీని అభ్యసించాడు. ఆయనకు ఒక అన్నయ్య ఉన్నాడు. విజయ్ సూర్య 2019 ఫిబ్రవరి 14న కుటుంబ స్నేహితురాలు, ఐటి ప్రొఫెషనల్ చైత్రని వివాహం చేసుకున్నాడు

2012లో, క్రేజీ లోక చిత్రంతో హర్షిక పూనాచాతో కలిసి ఆయన రంగప్రవేశం చేశాడు.[2] ఈ చిత్రానికి కవితా లంకేష్ దర్శకత్వం వహించాడు. 2014లో, కలర్స్ కన్నడలో ప్రసారమయిన డైలీ సీరియల్ అగ్నిసాక్షిలో తన నటనతో కీర్తిని పొందాడు. ఆయన మే 2016లో డాక్టర్ నాగతిహళ్లి చంద్రశేకర్ దర్శకత్వంలో విడుదలైన ఇష్టకామ్యలో నటించి మెప్పించాడు. కార్తీక్ జయరామ్, సంయుక్త హోర్నాడ్‌లతో ఆయన నటించిన "స" చిత్రం ఆగష్టు 2016లో విడుదలైంది. 2019లో, "కద్దు ముచ్చి" పేరుతో ఆయన సినిమా విడుదలైంది. సృజన్ లోకేష్, రచితా రామ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన కామెడీ షో "కామెడీ టాకీస్"కి కూడా ఆయన హోస్ట్‌గా వ్యవహరించాడు. అలాగే జూలై 2019, అక్టోబర్ 2020 ల మధ్య ఆయన "ప్రేమలోక" కి వ్యవహరించాడు. ఆయన ప్రస్తుతం వీరపుత్రలో నటిస్తున్నాడు.

ఫిల్మోగ్రఫీ

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2012 క్రేజీ లోక అభయ్ ఉత్తమ అరంగేట్ర పురుషుడిగా సైమా అవార్డు - నామినేట్ చేయబడింది
2016 ఇష్టకామ్య డా. ఆకర్ష్
2016
2019 కద్దు ముచ్చి సిద్ధార్థ్
2022 గాలిపాట 2 రేవంత అతిధి పాత్ర
TBA పోస్ట్ ప్రొడక్షన్
TBA వీరపుత్ర చిత్రీకరణలో ఉంది

టెలివిజన్

మార్చు
సంవత్సరం కార్యక్రమం పాత్ర నోట్స్
2004 ఉత్తరాయణ
2013 లక్ష్మీ బారమ్మ సిద్ధార్థ్
2013 – 2019 అగ్నిసాక్షి సిద్ధార్థ్
2014 థక ధీమి తా డ్యాన్సింగ్ స్టార్ పోటీదారు 4వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు
2018 కామెడీ టాకీస్ హోస్ట్
2019-2020 ప్రేమలోక సూర్య
2020- 2021 జోతే జోతేయాలి సూర్య అతిధి పాత్ర
2023- ప్రస్తుతం నమ్మ లచ్చి సంగం
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ తెలుగు అరంగేట్రం

అవార్డులు

మార్చు

ఆయనకు అనుబంధ లో నటనకుగాను..

  • వైష్ణవితో పాటు ఉత్తమ జంటగా అవార్డు
  • 2014-15లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు
  • 2016-17లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు
  • 2017-18లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు
  • 2018-19లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు

మూలాలు

మార్చు
  1. "Kannada TV gets a new face: Vijay Suriya". The Times of India.
  2. S., Girish (25 September 2012). "Meet the Band of boys of Kannada films". Rediff.com.