విజేత విక్రమ్ 1987 లో వచ్చిన చిత్రం. ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వంలో టి. తిరుపతి రెడ్డి నిర్మించాడు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రంలో వెంకటేష్, ఫరా ప్రధాన పాత్రల్లో నటించారు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పాలైంది .[2]

విజేత విక్రం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎస్.రవిచంద్ర
నిర్మాణం టి తిరుపతిరెడ్డి
చిత్రానువాదం ఎస్.ఎస్.రవిచంద్ర
తారాగణం వెంకటేష్
ఫరా
రావు గోపాలరావు
నూతన్ ప్రసాద్
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం మహీందర్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ సంయుక్త మూవీస్
భాష తెలుగు

కథ మార్చు

ఒక ఎస్టేట్ నియంత రుద్ర భూపతి ( రావు గోపాలరావు ) (58) గ్రామస్థులను బానిసలుగా చూస్తూంటాడు. విక్రమ్ ( వెంకటేష్ ) (23), యువకూ, చలాకీ వ్యక్తి ఎస్టేట్‌లోకి ప్రవేశిస్తాడు. అతను రుద్ర భూపతి దుష్టత్వానికి వ్యతిరేకంగా ఎదుర్కొంటాడు. గ్రామస్థులకు దగ్గరవుతాడు. రుద్ర భూపతి ఏకైక కుమార్తె ఉష ( ఫరా ) కూడా విక్రమ్ వైఖరిని ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఒక పిచ్చి మహిళ భారతి ( సుమిత్రా ) తనను తాను గుర్తించకుండా ఎస్టేట్ అంతా తిరుగుతూంటుంది. ఒక రోజు విక్రమ్ పిచ్చి మహిళ తన తల్లి అని తెలుసుకుంటాడు. ఆమె పిచ్చికి రుద్ర భూపతికి మధ్య కొంత అనుమానాస్పద సంబంధం ఉందని కూడా తెలుసుకుంటాడు. ఇంతలో, ప్రక్కనే ఉన్న ఎస్టేట్ యజమాని మనవడు శిశుపాల్ ( సుధాకర్ ) (26) విదేశాల నుండి వచ్చి అతను ఉషను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. శిశుపాల్ విక్రమ్ ను తన మార్గం నుండి తొలగించాలనుకుంటాడు. అతను విక్రమ్ పై దాడిని ప్లాన్ చేస్తాడు; ఆ గొడవలో భారతి గాయపడి ఆమె జ్ఞాపకశక్తిని తిరిగి పొందుతుంది. విక్రమ్ తన తల్లిని అసలు ఏమి జరిగిందో అడుగుతాడు. అప్పుడు ఆమె వారి గతాన్ని వెల్లడిస్తుంది.

విక్రమ్ తండ్రి ప్రతాప్ రావు ( రంగనాథ్ ) ఒక అటవీ అధికారి. రుద్రభూపతి ఎస్టేట్‌లో చేసే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డుకుంటూంటాడు. అందుకని అతన్ని చంపుతాడు. భారతి విక్రమ్‌లను కూడా చంపడానికి ప్రయత్నించాడు. ఆ దాడిలో, భారతి విక్రమ్‌ను సేఫ్ జోన్‌లో ఉంచి తాను గాయపడుతుంది.ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఇవన్నీ వింటూ, ఇప్పుడు విక్రమ్ రుద్ర భూపతిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. విక్రం తన పగను ఎలా తీర్చుకుంటాడనేది మిగతా కథ

తారాగణం మార్చు

పాటలు మార్చు

సం. పాట పేరు గాయకులు సాహిత్యం పొడవు
1 "ప్రేమలో పడ్డావుగా" ఎస్పీ బాలు, పి.సుశీల వేటూరి సుందరరామమూర్తి 4:34
2 "ఎట్టు ఎట్టు ఎట్టు" ఎస్పీ బాలు, పి.సుశీల వేటూరి సుందరరామమూర్తి 4:43
3 "కాశీపట్నం చూద్దామంటే" ఎస్పీ బాలు, పి.సుశీల వేటూరి సుందరరామమూర్తి 4:42
4 "నా కేసి చూడు" ఎస్పీ బాలు, ఎస్.జానకి వేటూరి సుందరరామమూర్తి 4:32
5 "గోరింటా పొద్దుల్లో" ఎస్పీ బాలు, పి.సుశీల వెన్నెలకంటి 3:57

మూలాలు మార్చు

  1. "Vijetha VikramCrew". entertainment.oneindia.in. 8 September 2003. Retrieved 17 February 2013.[permanent dead link]
  2. "Success and centers list – Venkatesh". idlebrain.com. Retrieved 30 October 2014.