వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ (నవంబరు 30, 1957 - జనవరి 5, 2021) తెలుగు సినిమా మాటల, పాటల రచయిత. ఈయన ఇంటి పేరు వెన్నెలకంటి గానే సుప్రసిద్ధుడు.[1][2][3][4][5]
వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ | |
---|---|
జననం | నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1957 నవంబరు 30
మరణం | 2021 జనవరి 5 చెన్నై, తమిళనాడు | (వయసు 63)
మరణ కారణం | గుండెపోటు |
నివాస ప్రాంతం | చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | వెన్నెలకంటి |
వృత్తి | 1979 లో స్టేట్ బ్యాంకు - చంద్రగిరి లో ఉద్యోగం |
ప్రసిద్ధి | సినిమా మాటల, పాటల రచయిత |
మతం | హిందూ |
భార్య / భర్త | ప్రమీలాకుమారి |
పిల్లలు | శశాంక్ వెన్నెలకంటి, రాకేందు మౌళి |
తల్లి | పద్మావతమ్మ |
జీవిత విషయాలు
మార్చువెన్నెలకంటి 1957, నవంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో జన్మించాడు.[6] విద్యాభ్యాసం కూడా నెల్లూరులోనే జరిగింది. హరికథలు, అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్టపడేవాడు. కళాశాల రోజుల్లో "రసవినోదిని" రేడియో ప్రసంగాలు వినేవాడు. 11 ఏళ్ళకే కవితలు, పద్యాలూ రాశాడు. ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని, ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’’ కూడా రాశాడు.[7] 1975లో విజయవాడ రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యాయి. జంధ్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో నటించాడు.
సినిమారంగం
మార్చు1986లో నటుడు, నిర్మాత డా. ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలముతో శ్రీరామచంద్రుడు సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు పాట వ్రాసాడు. అదే గీత రచయితగా తొలి పరిచయం. అటు తరువాత 1987లో నేపథ్య గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో అన్నా చెల్లెలు సినిమాలో ‘‘అందాలు ఆవురావురన్నాయి’’ అనే పాట రాశాడు. నాయకుడు సినిమాతో అనువాదంలో ప్రవేశించాడు. ప్రేమాగ్ని సినిమాకు తెలుగులో మాటలు వ్రాసాడు. కమల్ హాసన్ నటించిన సత్యభామ సినిమాకు డబ్బింగు వ్రాసాడు. సుమారు 2000 పాటలు వ్రాసాడు.
ఇతని కుమారులు శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగాను, రాకేందు మౌళి సినిమా గీతరచయితగాను ఎదుగుతున్నారు.[8]
సినిమాలు
మార్చు- బిరియాని (2013)
- ఆవారా (2010)
- ఆకాశమంత (2009)
- ఒక్క మగాడు (2007)
- కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను (2005)
- చంద్రముఖి (2005)
- పల్నాటి బ్రహ్మనాయుడు (2003)
- టక్కరి దొంగ (2002)
- నరసింహ నాయుడు (2001)
- టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్ (2001)
- అన్నయ్య (2000)
- సమరసింహా రెడ్డి (1999)
- శీను (1999)
- తూర్పు పడమర (1998)
- అప్పాజి (1996)
- దెయ్యం (1996)
- శ్రీకృష్ణార్జున విజయం (1996)
- కుర్రాడు బాబోయ్ (1995)
- శాస్త్రి (1995)
- భైరవ ద్వీపం (1994)
- ముగ్గురు మొనగాళ్ళు (1994)
- వన్ బై టూ (1993)
- అల్లరి ప్రియుడు (1993)
- స్వాతి కిరణం (1992)
- ఆదిత్య 369 (1991)
- ఏప్రిల్ 1 విడుదల (1991)
- తేనెటీగ (1991)
- భార్గవ్ (1991)
- శ్రీరామచంద్రుడు (1989)
- చెట్టుకింద ప్లీడరు (1989)
- మహర్షి (1988)
- ఇదా ప్రపంచం (1987)
మరణం
మార్చువెన్నెలకంటి చెన్నైలోని తన నివాసంలో 2021, జనవరి 5న గుండెపోటుతో మరణించాడు.[9][10]
మూలాలు
మార్చు- ↑ Students showcase talent at youth fest - The Hindu
- ↑ "All movies of Vennelakanti Rajeswara Prasad | Cinveda - Indian Movies - Hindi, Tamil, Telugu". Archived from the original on 2014-02-22. Retrieved 2015-11-30.
- ↑ A literary treat at Ugadi festivities - The Hindu
- ↑ Karthee's upbeat - The Hindu
- ↑ Raaga - Telugu - Lyricist - Vennalakanti
- ↑ సాక్షి, సినిమా (5 January 2021). "ప్రముఖ పాటల రచయిత కన్నుమూత". Sakshi. Archived from the original on 5 January 2021. Retrieved 5 January 2021.
- ↑ ఈనాడు, సినిమా (5 January 2021). "ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 5 January 2021. Retrieved 5 January 2021.
- ↑ వై.సునీతా, చౌదరి (8 July 2012). "Chip off the old block". ది హిందూ. Retrieved 30 November 2017.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (5 January 2021). "పాటల, మాటల రచయిత వెన్నెలకంటి ఇక లేరు". www.andhrajyothy.com. Archived from the original on 5 January 2021. Retrieved 5 January 2021.
- ↑ Namasthe Telangana (27 March 2021). "గత పదేళ్లలో దూరమైన సినీ ప్రముఖులు". Archived from the original on 2021-03-27. Retrieved 30 November 2021.
ఇతర లింకులు
మార్చు- https://web.archive.org/web/20160304235055/http://movies.dosthana.com/profile/vennelakanti
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ పేజీ