విడదల రజిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోంది.[1] ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.[2][3]

విడదల రజిని
విడదల రజిని


ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖ మంత్రి
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు పత్తిపాటి పుల్లారావు
నియోజకవర్గం చిలకలూరిపేట

వ్యక్తిగత వివరాలు

జననం 24 జూన్ 1990
కొండాపూర్, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి కుమారస్వామి
సంతానం ఇద్దరు పిల్లలు
వెబ్‌సైటు https://vidadalarajini.com/

రజిని తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో జన్మించింది.[4][5]

రజిని 2011లో హైదరాబాదు మల్కాజ్‌గిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి. పూర్తి చేసింది. అనంతరం ఐ.టి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేసింది.[6]

సామజిక సేవ మార్చు

విడదల రజిని తన పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికా నుండి తిరిగి వచ్చి తన భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో చిలకలూరిపేట కేంద్రంగా విఆర్ ఫౌండేషన్ స్థాపించి, అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది.

రాజకీయ ప్రస్థానం మార్చు

విడదల రజిని 2014లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చింది. విఆర్ ఫౌండేషన్ స్థాపించి నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది.

2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించింది, టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో 2018లో వైసీపీలో చేరింది. ఆమె 2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.[7][8][9]

2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[10][11]

మూలాలు మార్చు

  1. BBC News తెలుగు (24 May 2019). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే". BBC News తెలుగు. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
  2. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  3. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Eenadu (13 April 2022). "ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి తెలంగాణ బిడ్డ". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  5. Namasthe Telangana (14 April 2022). "ఏపీ మంత్రి రజని తెలంగాణ బిడ్డే". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
  6. Sakshi (10 April 2022). "ఆమె ఒక సంచలనం... ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ." Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  7. The Financial Express (23 May 2019). "Andhra Pradesh Assembly election result: Full list of winners". Archived from the original on 23 April 2021. Retrieved 23 April 2021.
  8. News18. "Chilakaluripet Assembly Election Results 2019 Live: Chilakaluripet Constituency (Seat) Election Results, Live News". Archived from the original on 23 April 2021. Retrieved 23 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. The Times of India, Samdani MN / TNN / (26 March 2019). "History has it that women from Guntur make most of their chances". Archived from the original on 23 April 2021. Retrieved 23 April 2021.
  10. Sakshi (11 April 2022). "ఏపీ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసింది వీరే." Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  11. Andhra Jyothy (11 April 2022). "కొత్త మంత్రులు.. విశేషాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.

బయటి లింకులు మార్చు