వినోద్ మెహతా సీనియర్ జర్నలిస్ట్, ఔట్‌లుక్ ఎడిటోరియల్ చైర్మన్.[1] సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పయనీర్ (డిల్లీ ఎడిషన్), ఔట్‌లుక్ లాంటి ఎన్నో పత్రికలను ప్రారంభించి, విజయపథంలో నడిపించిన ఘనత ఆయన సొంతం.[2] లక్నో విశ్వవిద్యాలయంలో బి.ఎ. పూర్తిచేసారు.

వినోద్ మెహతా
జననం31 మే 1942
మరణం2015 మార్చి 8 (aged 73)
జాతీయతభారతీయుడు
విద్యబి.ఎ
విద్యాసంస్థలక్నో విశ్వవిద్యాలయం
క్రియాశీల సంవత్సరాలు1995 నుండి 2012
ఉద్యోగంఅవుట్ లుక్ ఇండియా
సుపరిచితుడు/
సుపరిచితురాలు
జర్నలిస్టు,
జీవిత భాగస్వామిసుమితా పాల్

జీవిత విశేషాలు

మార్చు

ఆయన ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న రావల్పిండిలో 1942 మే 31న జన్మించారు.[3][4]

జర్నలిజం లో కురువృద్ధుడు

మార్చు

భారతీయ జర్నలిజంలో కురువృద్ధుడి లాంటి సీనియర్ ఎడిటర్ ఆయన. 40 ఏళ్ళ పాటు ఈ వృత్తిలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తి. ఎలాంటి ప్రత్యేక డిగ్రీ లేకున్నా భాషా పటిమ, విశ్లేషణా సామర్థ్యం, తెగింపులతో అవుట్ లుక్ అనే పత్రికు వ్యవస్థాపక ఎడిటర్ గా ఎదిగారు.

పత్రికలు మూతపడుతూ ప్రింట్ జర్నలిజం శకం ముగిసిందని అనుకుంటున్న సమయంలో మాగజీన్ జర్నలిజాన్ని నిబద్ధతతో నిర్వహించి కొత్తపుంతలు తొక్కించిన కలం యోధుడుగా వినోద్ మెహతా గుర్తింపు తెచ్చుకున్నారు. రహేజా గ్రూప్ తరఫున వినోద్ మెహతా అక్టోబర్ 1995లో అవుట్ లుక్ ను ఆరంభించి అద్భుతమైన వ్యాసాలు అందించారు. ఆరోగ్యం సహకరించక ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకుని 2012 నుంచి అవుట్ లుక్ కు ఎడిటోరియల్ ఛైర్మన్ గా వ్యవహరించారు.

అర్నబ్ గోస్వామి లాంటి ఎడిటర్లు సైతం ఆయనను 'జర్నలిజం దేవుడి' గా భావించి ఆరాధిస్తారు. ఆయనను జి.కె.రెడ్డి మెమోరియల్ జాతీయ అవార్డు వరించింది.

రచయితగా

మార్చు

బిఏ డిగ్రీ థర్డ్ క్లాస్ లో పాసయినట్లు చెప్పుకునే వినోద్ మెహతా మూడు పుస్తకాలు రాసారు. అందులో మూడు జీవిత చరిత్రలు, రెండు తన అనుభవాల సారం (లక్నో బాయ్, ఎడిటర్ అన్ ప్లగ్డ్), ఒకటి సంకలనం (మిస్టర్ ఎడిటర్, హౌ క్లోస్ అర్ యు టు ది పీఎం?).

ప్రముఖ బాలీవుడ్ నటి మీనాకుమారి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీల జీవిత చరిత్రలను వినోద్ మెహతా రాశారు. ఆయన రాసిన వ్యాసాలను మిస్టర్ ఎడిటర్, హౌ క్లోజ్ ఆర్‌యూ టూ ది పీఎం? అనే పేరుతో 2001లో సంకలనంగా విడుదల చేశారు. ఆ తరువాత ఎడిటర్ అన్‌ప్లగ్‌డ్ పుస్తకాన్ని ప్రచురించారు.

ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మెహతా 2015 మార్చి 8న న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య సేవల సంస్థలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు 73 సంవత్సరాలు. ఆయనకు భార్య సుమితా ఉన్నారు, పిల్లలు లేరు. తన పెంపుడు కుక్కకు 'ఎడిటర్' అని పేరు పెట్టుకున్నారు.

మూలాలు

మార్చు
  1. ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ మెహతా ఇకలేరు.[permanent dead link]
  2. "Eminent journalist and Editorial Chairman of Outlook Magazine Vinod Mehta dies". CNN-IBN. 8 March 2015. Archived from the original on 10 మార్చి 2015. Retrieved 9 March 2015.
  3. సీనియర్ జర్నలిస్టు వినోద్ మెహతా మృతి
  4. Singh, Kushwant (28 January 2012). "Of the grumbling Lucknow boy and John Keats". Hindustan Times. Archived from the original on 14 జూలై 2014. Retrieved 22 August 2014.

ఇతర లింకులు

మార్చు