విరించి వర్మ ఒక తెలుగు సినీ దర్శకుడు.[1] ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తరువాత నాని కథానాయకుడిగా మజ్ను చిత్రానికి దర్శకత్వం వహించాడు.

విరించి వర్మ
జననం
గుంటూరి విరించి వర్మ

విద్యబీకాం
విద్యాసంస్థన్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, హైదరాబాదు
వృత్తిదర్శకుడు, రచయిత
జీవిత భాగస్వామిసుందరి
తల్లిదండ్రులు
  • సూరపు రాజు (తండ్రి)
  • సుబ్బలక్ష్మి (తల్లి)

వ్యక్తిగత వివరాలు మార్చు

విరించి వర్మ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలుకు సమీపంలోని పెండ్యాల. తండ్రి సూరపు రాజు, తల్లి సుబ్బలక్ష్మి. వారిది వ్యవసాయ కుటుంబం.[1] ఆకివీడు సమీపంలోని వాళ్ళ అమ్మమ్మ ఊరైన సిద్ధాపురం లో పెరిగాడు. దిబ్బగూడెంలో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. హైదరాబాదు లోని లక్డీ కాపుల్ లో గల న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లో బీకామ్ చదివాడు. చిన్నప్పటి నుంచి కథల పుస్తకాలు, నవలలు చదివే అలవాటు ఉండేది కానీ సినిమాలు మాత్రం అంతగా చూసేవాడు కాదు.

సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు కూడా హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి అక్కడే ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉయ్యాల జంపాల సినిమాకు ముందే సుందరి తో పెళ్ళైంది.

కెరీర్ మార్చు

డిగ్రీ పూర్తయిన తర్వాత తనకు డిజైనింగ్ లో ప్రవేశం ఉండటంతో సినిమా ప్రచార చిత్రాలు డిజైన్ చేసే ఒక సంస్థలో సహాయక డిజైనరు గా చేరాడు. అక్కడ పనిచేస్తూనే సహాయ దర్శకుడు కావడానికి ప్రయత్నించాడు. మూడేళ్ళ తరువాత దర్శకుడు మదన్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన దగ్గర పెళ్లైనకొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు సినిమాలకు పనిచేశాడు.

సహాయ దర్శకుడిగా మూడేళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత ఉయ్యాల జంపాల కథను సిద్ధం చేసుకుని ఆరేడు మంది నిర్మాతలను సంప్రదించినా వారు ఆ పల్లెటూరి కథను ఒప్పుకోలేదు. తరువాత నిర్మాత రామ్మోహన్ ను సంప్రదించడంతో ముందుగా ఆయన ఇతని నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఇరవై వేలు ఇచ్చి ఒక లఘు చిత్రాన్ని రూపొందించి చూపించమన్నాడు.[2] దాంతో నిన్నటి వెన్నెల అనే లఘు చిత్రాన్ని రూపొందించి చూపించాడు. దాంతో ఆయనకు నమ్మకం కలిగి సినిమా తీయడానికి అంగీకరించాడు. తరువాత అక్కినేని నాగార్జున కూడా నిర్మాతగా జత కలిశాడు. ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది.

దీని తరువాత ఓ యాక్షన్ సినిమాకు కథ రాసుకున్నాడు కానీ సన్నిహితులు మళ్ళీ భావోద్వేగాల నేపథ్యంలోనే సినిమా తీయమని సలహా ఇవ్వడంతో మజ్ను కథను రాసుకుని నాని తో సినిమా తీశాడు.[3]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "నా తొలిప్రేమ వాటిపైనే..." ఈనాడు. 9 October 2016. Archived from the original on 10 October 2016. Retrieved 14 October 2016. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 11 అక్టోబరు 2016 suggested (help)
  2. GV. "Choosing Uyyala Jampala director Virinchi Varma". idlebrain.com. GV. Retrieved 14 October 2016.
  3. ప్రణీత, జొన్నలగడ్డ. "Nani to play assistant director in Virinchi Varma's next". timesofindia.indiatimes.com. టైంస్ న్యూన్ నెట్వర్క్. Retrieved 14 October 2016.

బయటి లింకులు మార్చు