ప్రధాన మెనూను తెరువు

విలయనూర్ సుబ్రమణ్యన్ రామచంద్రన్ (ఆంగ్లం: Vilayanur S. Ramachandran) (జననం 1951) ప్రాథమికంగా బిహేవియరల్ న్యూరోలజీ, విజువల్ సైకోఫిజిక్స్ రంగాల్లో ప్రఖ్యాతుడైన న్యూరోసైంటిస్ట్. శాన్ డియాగో లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో శరీరశాస్త్ర విభాగంలో, న్యూరోసైన్సెస్ యొక్క గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలోనూ ఆచార్యునిగా పనిచేస్తున్నారు. యుసి శాన్ డియాగో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజియాలజీలోని మెదడు మరియు జ్ఞానశక్తి యొక్క (అధ్యయన) కేంద్రానికి (సెంటర్ ఫర్ బ్రెయిన్ అండ్ కాగ్నిషన్) డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు..[1]

విలయనూర్ ఎస్. రామచంద్రన్
Vilayanur S. Ramachandran
Ramachandran at the 2011 Time 100 gala
జననం1951 (age 67–68)
తమిళనాడు, India
నివాసంశాన్ డియాగో, కాలిఫోర్నియా
రంగములు
విద్యాసంస్థలుCenter for Brain and Cognition,
University of California, San Diego
పూర్వ విద్యార్థి
ప్రసిద్ధిResearch in neurology, visual perception, phantom limbs, synesthesia, autism, body integrity identity disorder
ముఖ్యమైన అవార్డులుAriens-Kappers medal (1999), పద్మభూషణ్ (2007), Honorary Fellow, Royal College of Physicians (2014)

న్యూరోఇమేజింగ్ వంటి సంక్లిష్టమైన పరిశోధన పద్ధతులను అతితక్కువగా వినియోగిస్తూ చేసే అతని పరిశోధన విధానాలకు రామచంద్రన్ పేరొందారు. తేలికైన, సంక్లిష్టం కాని పద్ధతిలో ప్రయోగాలు నిర్వహించినా, మెదడును గురించి వినూత్నమైన విషయాలను కనిపెట్టారు.[2] విస్తృత ప్రజాదరణ పొందిన ఫాంటమ్స్ ఇన్ ది బ్రెయిన్ (1999) మరియుద టెల్-టేల్ బ్రెయిన్ (2010) వంటి పుస్తకాలను రామచంద్రన్ రచించారు

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసంసవరించు

విలయనూర్ సుబ్రమణ్యన్ రామచంద్రన్ (తమిళ కుటుంబాలు, పేర్ల సంప్రదాయాల ప్రకారం, ఆయన వంశమూలాలున్న విలయనూర్ గ్రామం పేరులో ప్రథమంగా వస్తుంది) 1951లో తమిళనాట, ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.[3][4] ఆయన తండ్రి వి.ఎం.సుబ్రమణ్యన్ ఒక ఇంజనీరు, ఆయన ఐక్యరాజ్య సమితి పారిశ్రామికాభివృద్ధి సంస్థలో పనిచేశారు, బాంకాక్ మరియు థాయ్‌లాండ్ దేశాల్లో దౌత్యవేత్తగా వ్యవహరించారు.[5] రామచంద్రన్ తన చిన్నతనం, యవ్వనాలను భారతదేశంలోనూ, ఆగ్నేయాసియా దేశాల్లోనూ వేర్వేరు ప్రదేశాల్లోకి మారుతూ గడిపారు.[3][6] చిన్నతనంలో మద్రాసులోని పాఠశాలల్లోనూ, బాంకాక్ లోని బ్రిటష్ పాఠశాలల్లోనూ చదువుకున్నారు.[7] నత్తగుల్లలతో సహా వేర్వేరు ఆసక్తికరమైన అంశాలను శాస్త్రీయంగా చిన్ననాటి నుంచే పరిశీలించేవారు.[6] మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి రామచంద్రన్ ఎం.బి.బి.యస్ పట్టా పొందారు., [8] తర్వాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో చేసిన అధ్యయనానికి పీ.హెచ్.డి. పొందారు. రామచంద్రన్ విజువల్ న్యూరాలజీ గురించి భారతదేశంలో ఉండగానే  చేసిన అధ్యయనాన్ని ఓ అంతర్జాతీయ సైన్స్ జర్నల్లో ప్రచురించగా, దాని ద్వారా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసే అవకాశం లభించింది.జాక్ పెట్టిగ్రూ వద్ద రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తూ కల్టెక్ లో రెండేళ్ళు గడిపారు. శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 1983లో మనోవిజ్ఞానశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు స్వీకరించారు, 1988 నుంచి పూర్తిస్థాయి ప్రొఫెసర్ అయ్యారు.

రామచంద్రన్ మద్రాసు అడ్వకేట్ జనరల్ గా, భారత రాజ్యాంగ రూపశిల్పిగా ప్రఖ్యాతులైన అల్లాడి రామస్వామి మనవడు.[3][9] డయానే రోజర్స్ ను రామచంద్రన్ వివాహం చేసుకున్నారు, వారి సంతానం మణి, జయ అనే పేర్లుగల ఇద్దరు అబ్బాయిలు.[6]

సైంటిఫిక్ కెరీర్సవరించు

రామచంద్రన్ మొదట్లో సైకోఫిజికల్ పద్ధతుల ద్వారా మానవ దృశ్యజ్ఞానంపై పరిశోధనలు చేస్తూ చూడడం అనే ప్రక్రియ వెనుక మెదడు పనిచేసే పద్ధతిని స్పష్టంగా ఆకళింపు చేసుకునే విషయాలను పరిశోధించారు. అనేక కొత్త విజువల్ ఎఫెక్టులు, భ్రమలు కనిపెట్టిన ఘనత రామచంద్రన్ కు దక్కింది. మరీముఖ్యంగా, ఈక్విలూమినెన్స్ వద్ద దృశ్యీకరణ వేగం మందగించే తీరును గ్రహించడం (ఎరుపు, ఆకుపచ్చ రంగులు సమానమైన ప్రకాశంతో ఉన్నప్పుడు), భ్రమాజనిత ఆకృతులను వినియోగించి స్టీరియోస్కోపిక్ గా పట్టుకోగలగడం వంటివాటిలో ఆయన కృషి ప్రాచుర్యం తెచ్చిపెట్టింది. 1990ల్లో రామచంద్రన్ ఫాంటమ్ లింబ్స్ (తెగిపోయిన శరీర భాగాలు ఉన్నట్టు, నొప్పికలుగుతున్నట్టు అనిపించే వ్యాధి), శరీర సమగ్రతను గుర్తించడంలో ఏర్పడే సమస్యలు, కాప్గ్రస్ డిల్యూజన్ వంటి నరాల వ్యాధుల (న్యూరోలాజికల్ సిండ్రోమ్స్) పై దృష్టిసారించారు. వినికిడి వల్ల దృశ్యం చూసిన అనుభూతి, వాసన వల్ల రుచి అనుభూతి వంటివి ఏర్పడే సింథేసియాను అర్థం చేసుకోవడానికి పనికివచ్చే పరిశోధనను ఆయన అందించారు.[6][10] అద్దాలపెట్టె అనే పరికరం అందించి ఫాంటమ్ లింబ్స్ తో బాధపడే రోగులకు ఉపశమనం కలిగించారు.

రామచంద్రన్ రాసిన దాదాపు 180 పరిశోధన పత్రాలను వివిధ సైంటిఫిక్ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. వీటిలో 20 నేచర్ పత్రికలో ప్రచురితం కాగా మిగిలినవి సైన్స్, నేచర్ న్యూరోసైన్స్, పర్సెప్షన్ మరియు విజన్ రీసెర్చ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మెడికల్ హైపోథసెస్ పత్రిక సంపాదకమండలిలో ఆయన ఒకరు [11] ఎన్సైక్లోపీడియా ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ కి సంపాదకులు (2002).

రామచంద్రన్ సెంటర్ ఆఫ్ బ్రెయిన్ అండ్ కాగ్నిషన్ (సిబిసి) కి డైరెక్టర్. సిబిసి అనధికారికంగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, మిగిలిన విద్యాసంస్థల్లోని సంబంధిత పరిశోధకులు, విద్యార్థులను కలిపే నెట్వర్క్. విశ్వవిద్యాలయంలోని పరిశోధక వ్యవహారాల కార్యాలయంలో అధికారిక పరిశోధక కేంద్రంగా గుర్తింపు లేకున్నా, ఫిజియాలజీ డిపార్ట్ మెంటు ఈ సంస్థను అనుబంధ పరిశోధన బృందంగా జాబితా చేసింది. న్యూరో సైన్స్ కి సంబంధించిన విస్తృతమైన పరిధిలోని పలు విషయాలపై రామచంద్రన్, ఇతర సభ్యులు పరిశోధక వ్యాసాలు ప్రచురించారు.[1][12]

బిహేవియరల్ న్యూరాలజీలో రామచంద్రన్ చేసిన కృషి ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమైంది. ఆయనపై డాక్యుమెంటరీలు, వార్తలు వెలువడ్డాయి. బిబిసి, ది సైన్స్ ఛానల్, న్యూస్ వీక్, రేడియో ల్యాబ్, అమెరికన్ లైఫ్, టెడ్ టాక్స్ మరియు చార్లీ రోజ్ వంటివాటిలో ఆయన కనిపించారు. బ్రిటన్ కు చెందిన చానల్-4లో  రెండు భాగాలుగా ప్రసారమైన సీరీస్ కు, అమెరికాలో పిబిఎస్ ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన పుస్తకం ఫాంటమ్స్ ఇన్ ద బ్రెయిన్ ఆధారం.

రామచంద్రన్ ని "న్యూరోసైన్స్ యొక్క మార్కోపోలో"గా రిచర్డ్ డాకిన్స్,  "ఆధునిక పాల్ బ్రోకా"గా ఎరిక్ కండెల్ సంబోధించారు.[13] 1997లో న్యూస్ వీక్ 21వ శతాబ్దంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తులలో ఒకడిగా సెంచరీ క్లబ్ లో సభ్యునిగా పేర్కొంది.[14] 2011లో, టైమ్ మేగజైన్ "ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల"లో ఒకరిగా ప్రఖ్యాత టైమ్ 100 జాబితాలో చేర్చింది.[10][15]

రామచంద్రన్ పలువురు న్యూరోసైంటిస్టుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇర్విన్ లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కాగ్నిటివ్ సైన్సెస్ ప్రొఫెసర్ గా పనిచేస్తు్న గ్రెగ్ హికాక్ విమర్శిస్తూ రామచంద్రన్ కచ్చితమైన వాస్తవాల విశ్లేషణతో సమర్థించని విస్తృతమైన ఊహాగానాలనే ప్రతిపాదిస్తారని అభిప్రాయపడ్డారు. హికాక్ మాట్లాడుతూ "ప్రశ్నేమిటంటే ఇంతకీ ఈ చెప్పే సైన్స్ సక్రమమైన, అదే కచ్చితమైన వాస్తవాల విశ్లేషణ ద్వారా నిర్ధారించినదా?(అప్పుడే బెంచ్ సైంటిస్టులు దాన్ని సీరియస్ గా తీసుకోగలరు) లేదా కేవలం ఊహాగానాలను మంచి కథ కింద అల్లారా అన్నది." అన్నారు[16] 2012లో, జ్యూరిచ్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలోని నాడీవైద్యుడు పీటర్ బ్రగర్ రామచంద్రన్ రాసిన ద టెల్-టేల్ బ్రెయిన్ పుస్తకాన్ని పైద్ద ప్రశ్నలకు బలహీనమైన సమాధానలతో కూడిన పాప్-న్యూరోసైన్స్ అంటూ కొట్టిపారేశారు..[17] రామచంద్రన్ ప్రతిస్పందిస్తూ "మంచికో చెడ్డకో నేను విజువల్ పెర్సెప్షన్, స్టీరోప్సిస్, ఫాంటమ్ లింబ్స్, పక్షవాతాన్ని అంగీకరించకపోవడం, కాప్గ్రస్ సిండ్రోమ్, సైనేస్థెసియా మరియు మరెన్నో అంశాలకు చెందిన ప్రదేశాలన్నీ కలయదిరిగాను." అన్నారు.[18]

ఫాంటమ్ లింబ్స్సవరించు

ఒక చేయి లేదా కాలు తీసేసినప్పుడు, రోగులు తరచుగా తమ కాలుచేతులు ఉన్నట్టు బలమైన అనుభూతి చెందుతూంటారు, దీన్నే "ఫాంటమ్ లింబ్" అని పిలుస్తుంటారు. రోనాల్డ్ మెల్జాక్ (మెక్గిల్ విశ్వవిద్యాలయం) మరియు తిమోతి పోన్స్ (NIMH) చేసిన కృషిని అనుసరించి రామచంద్రన్ వయోజన మానవుని మెదడులో న్యూరల్ ప్లాస్టిసిటీకి, ఫాంటమ్ అవయవాలకు సంబంధించిన విషయానికి మధ్య సంబంధం ఉన్నట్టు సిద్ధాంతీకరించారు. ముఖ్యంగా, అతను స్పర్శజ్ఞాన కార్టెక్స్ లోని శరీర చిత్రపటం (body picture map), ఒక అంగము విచ్ఛేదనం చెందాకా తిరిగి పునర్నిర్వచించబడుతుందని సిద్ధాంతీకరించారు. 1993 లో, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వద్ద MEG పరిశోధనలు చేసిన TT యాంగ్ తో పనిచేస్తున్నప్పుడు, [19] రామచంద్రన్ అంగచ్ఛేదనమైన వారి స్పర్శజ్ఞాన కార్టెక్స్ (సొమాటో సెన్సరీ కార్టెక్స్) లో లెక్కించదగ్గ మార్పులు వస్తున్నట్టు నిరూపించారు.[20][21] ఎం.ఇ.జి పటంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న కార్టెక్స్ పునర్వ్యవస్థీకరణకు, ఇతర సబ్జెక్ట్స్ (పరిశోధనలోని వ్యక్తుల) లోని సంబంధిత అనుభూతులకు సంబంధం ఉందని సిద్ధాంతీకరించారు.[22] రామచంద్రన్ అతను పరిశీలించాడు కాని బాధాకరమైన సూచిస్తారు అనుభూతులను కంటి పునర్వ్యవస్థీకరణలో "జ్ఞాన సహసంబంధం" అని నమ్మేవారు. అయితే ఐరోపాలో నాడీ పరిశోధన MEG చిత్రాలు చూసిన కంటి పునర్వ్యవస్థీకరణ నొప్పి కాకుండా కాని బాధాకరమైన సూచిస్తారు అనుభూతులను సంబంధించిన చెబుతోంది. తను గమనించిన బాధతో సంబంధం సంబంధం లేని ఆ అనుభూతులు కార్టికల్ పునర్వ్యవస్థీకరణకు సంబంధివచినవని నమ్మారు; ఏదేమైనా ఐరోపాకు చెందిన న్యూరోసైంటిస్టులు ఎంఈజీ పటాల్లోని కార్టికల్ రీఆర్గనైజేషన్ బాధారహిత అనుభూతి కన్నా బాధ కలిగించే అనుభూతులతోనే సంబంధం వున్నదని నిరూపించగలిగారు.[23] ఏ నాడీ విధానంతో బాధకలగని ఫాంటమ్ లింబ్ అనుభూతులు సంబంధం కలిగివున్నాయన్న ప్రశ్నకు ఇంకా సమాధానం లభించలేదు.

మిర్రర్ విజువల్ ఫీడ్ బాక్సవరించు

 
మొట్టమొదటి అద్దపు పెట్టె (మిర్రర్ బాక్స్) పక్కన నిల్చున్న రామచంద్రన్

మిర్రర్ బాక్స్ (అద్దపు పెట్టె) ను కనుగొనడం, మిర్రర్ విజువల్ ఫీడ్ బాక్ విధానాన్ని ఫాంటమ్ లింబ్ పక్షవాతానికి చికిత్సగా పరిచయం చేయడం వంటివాటి క్రెడిట్ రామచంద్రన్ కు దక్కుతుంది. రామచంద్రన్ పక్షవాతం పొందిన ఫాంటమ్ లింబ్ యొక్క కదలికను తిరిగి తెప్పించడం వల్ల నొప్పిని కూడా తగ్గించవచ్చని కనిపెట్టారు.[24] చిన్నస్థాయి పరిశోధనలల్లో ఫాంటమ్ లింబ్ నొప్పిని, సంక్లిష్టమైన రీజనల్ పెయిన్ సిండ్రోమ్ ని తగ్గించేందుకు మిర్రర్ థెరఫీని వాడడం మంచి ఫలితాలను ఇచ్చింది.[25] కానీ ప్రస్తుతం మిర్రర్ థెరఫీ ద్వారా నొప్పి తగ్గించడంపై ఏకాభిప్రాయం లేదు.[26][27] మిర్రర్ థెరఫీని వినియోగించడం ఇంకా ప్రయోగాత్మకమైన దశలోనే ఉంది.[28]

Referencesసవరించు

 1. 1.0 1.1 http://cbc.ucsd.edu/research.html
 2. Anthony, VS Ramachandran: The Marco Polo of neuroscience, The Observer, January 29, 2011.
 3. 3.0 3.1 3.2 Andrew Anthony (January 30, 2011). "VS Ramachandran: The Marco Polo of neuroscience". guardian.co.uk. Retrieved December 11, 2014. Cite web requires |website= (help)
 4. Brain Games
 5. The Science Studio Interview, June 10, 2006, transcript
 6. 6.0 6.1 6.2 6.3 Colapinto, J (May 11, 2009). "Brain Games; The Marco Polo of Neuroscience". The New Yorker. Retrieved March 11, 2011.
 7. Ramachandran V.
 8. Caltech Catalog,1987-1988, page 325
 9. Ravi, Y.V. (2003-09-23). "Legal luminary". The Hindu. Retrieved 2011-04-21.
 10. 10.0 10.1 "V.S. Ramachandran - Time 100". April 21, 2011. Retrieved April 21, 2011. Cite web requires |website= (help)
 11. ScienceInsider, March 8, 2010
 12. Office of Research Affairs,UCSD
 13. A Brief Tour of Human Consciousness, 2004, Back Cover
 14. "The Century Club". Newsweek. April 21, 1997. Retrieved February 16, 2011. Cite web requires |website= (help)
 15. In public polling of the people included in the 2011 list, Ramachandran ranked 97 out of 100.
 16. "Talking Brains Blog site, August 14 2012
 17. Brugger, Peter, Book Review, Cognitive Neuropsychiatry, Vol. 17, Issue 4, 2012
 18. Ramachandran,V.
 19. Yang, UCSD Faculty web page
 20. Yang TT, Gallen CC, Ramachandran VS, Cobb S, Schwartz BJ, Bloom FE (February 1994). "Noninvasive detection of cerebral plasticity in adult human somatosensory cortex". NeuroReport. 5 (6): 701–4. doi:10.1097/00001756-199402000-00010. PMID 8199341.CS1 maint: multiple names: authors list (link)
 21. For a competing view, see: Flor et al., Nature Reviews, Vol 7, November 2006 [1]
 22. Ramachandran, Rogers-Ramachandran, Stewart, Perceptual correlates of massive cortical reorganization, Science, 1992, Nov 13, 1159-1160
 23. Reprogramming the cerebral cortex: plasticity following central and peripheral lesions, Oxford, 2006, Edited by Stephen Lomber, pages 334
 24. Ramachandran VS, Rogers-Ramachandran D (April 1996). "Synaesthesia in phantom limbs induced with mirrors". Proceedings of the Royal Society B. 263 (1369): 377–86. doi:10.1098/rspb.1996.0058. PMID 8637922. Retrieved 2008-09-23.
 25. Chan, B; Witt, R; Charrow, A; Magee, A; Howard, R; Pasquina, P. Mirror Therapy for Phantom Limb Pain, N Engl J Med 2007; 357:2206–2207November 22, 2007.
 26. Flor,H, Maladaptive plasticity, memory for pain and phantom limb pain: review and suggestions for new therapies, Expert Reviews, Neurotherapeutics,8(5) 2008,[2]
 27. Moseley, L; Flor, H. Targeting Cortical Representations in the Treatment of Chronic Pain: A Review, Neurorehabilitation & Neural Repair, XX(X) 1–7, 2012.
 28. Subedi, Bishnu; Grossberg, George. Phantom Limb Pain: Mechanisms and Treatment Approaches, Pain Research and Treatment, Vol 2011, Article ID 864605.