విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్
విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (మర్చి 27,1845 - 1923 ఫిబ్రవరి 10) జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు (రేడియోగ్రఫీ), రోగ నిర్మూలనకు (రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త. ఈయన కనుగొన్న ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనే కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి. 1895 నవంబరు 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1901 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్ బహుమతి పొందాడు.[1] ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియమ్ అనిపేరు పెట్టి గౌరవించారు.
విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ | |
---|---|
జననం | విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ 1845 మార్చి 27 లెన్నెప్, రైనీ ప్రొవెన్స్, జర్మనీ |
మరణం | 1923 ఫిబ్రవరి 10 మునిచ్, జర్మనీ | (వయసు 77)
జాతీయత | జర్మన్ |
రంగములు | భౌతిక శాస్త్రము X-కిరణాల ఆవిష్కరణ |
వృత్తిసంస్థలు | |
చదువుకున్న సంస్థలు | జూరిచ్ యూనివర్సిటీ |
పరిశోధనా సలహాదారుడు(లు) | August Kundt |
డాక్టొరల్ విద్యార్థులు | |
ప్రసిద్ధి | X-కిరణములు |
ముఖ్యమైన పురస్కారాలు | భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత (1901) |
సంతకం |
జీవితం
మార్చురాంట్జన్ 1845 మార్చి 27 న జర్మనీలోని లెన్నెస్ లో జన్మించాడు. ఈయన తండ్రి ఒక రైతు. తల్లి ఒక డచ్ మహిళ. హాలెండ్ లో విద్యాభ్యాసం జరిగింది. 1865 లో యుట్రెచ్ యూనివర్సిటీ లో చేరుటకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కాని జూరిచ్ లో గల ఫెడెరల్ పాలిటెక్నిక్ సంస్థ లో చేరి పరీక్షలను ఉత్తీర్ణుడయ్యాడు. అక్కడ మెకానికల్ ఇంజనీరుగా చేరాడు. 1869 లో తత్వశాస్త్రములో జూరిచ్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టాను పొందాడు. ఆ విశ్వవిద్యాలయంలో ప్రముఖ ప్రొపెసర్ అయిన ఆగస్టు కుండ్త్ యొక్క ప్రియమైన శిష్యుడయ్యాడు.[2]
విజయాలు
మార్చు1874 లో స్టాన్ ఫర్డు విశ్వవిద్యాలయంలో అద్యాపకునిగా నియమించబడ్డాడు. 1875 లో హోహెనీం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా నియమించబడ్డాడు. తర్వాత 1876 లో స్టాన్ ఫర్డు విశ్వవిద్యలయంలో మరల అద్యాపకునిగా చేరాదు. 1888 లో గీసన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరాడు. తర్వాత వుర్జ్ బర్గ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో చేరారు. 1900 లో ప్రభుత్వ అభ్యర్థ మేరకు మంచ్ యూనివర్సిటీలో చేరాడు. ఆయన కుటుంబం యు.ఎస్.ఎకు వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అపుడు న్యూయార్క్ లో కొలంబియా యూనివర్సిటీ వారు అవకాశం యిచ్చినప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా తన శేషజీవితాన్ని మునిచ్ నందే గడిపారు. 1895 వరకు ఉత్సర్గనాళ ప్రయోగాలలో హెర్ట్జ్,జాన్ హిటార్ఫ్,విలియం క్రూక్స్,టెస్లా, లీనార్డో లతో పనిచేశారు.[3]
X-కిరణాలు ఆవిష్కరణ
మార్చుఎక్స్ కిరణాలను రాయింట్ జన్ కిరణాలని అంటారు. కాని రాయింట్ జనే స్వయంగా వాటిని ఎక్జ్ కిరణాలని పిలిచాడు. ఈ కిరణాలను కనుగొని లోకానికి పరోపకారం చేసినందుకు కృతజ్ఞతగా ఈయనకు 1901 లో భౌతిక శాస్త్రం తరపున నోబెల్ బహుమతి లభ్యమయింది. ఈ ఎక్స్ రే వెనుక ఎంతో ఆసక్తి కరమైన కథ ఉంది.
రాయింట్ జన్ కేథోడ్ రే ట్యూబ్ (శూన్య గాజు నాళం) తో పరిశోధనలు చేసేవాడు. గది అంతా చీకటిగా ఉన్నప్పుడు యీ ట్యూబ్ గుండా కాంతి కిరణాలను పంపడం జరిగింది. పైగా ట్యూబ్ చుట్టూ నల్లని కాగితాన్ని కాంతి కిరణాలు ఏ కొంచెం కూడా వెలువడకుండా కప్పి ఉంచాడు. ఇలా చేసినప్పటికి కాథోడ్ ట్యూబ్ కు సమీపంలో ఉన్న బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం వింత మెరుపులతో ప్రకాశించ సాగింది. నల్లటి కాగితాన్ని కప్పి ఉంచినప్పటికీ కాథోడ్ ట్యూబ్ నుంచి ఏవో అజ్ఞాత కిరణాలు వెలువడి బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం మీద పడి అది మెరిసేటట్లు చేసిందని యీయన ఊహించగలిగాడు.[4]
ఈ కిరణాలను కాగితం గుండా, చెక్క గుండా, లోహపు పలకల గుండా ప్రయాణం చేయగలవని యీయన కనుగొన్నాడు. ఈ కిరణాలు కూడా ఓ రకమైన కాంతి కిరణాలే అని అయితే వీటి తరంగ దైర్ఘ్యం చాలా తక్కువ కావటం వల్ల మనుషుల కళ్ళకు కనిపించవని రాయింట్జన్ వెల్లడించాడు. మామూలు కాంతి కిరణాలే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ల మీద ప్రభావం చూపుతూ ఉండగా, యీ కిరణాలు మాత్రం చూపకుండా ఉంటాయా అనే ఆలోచన రాయింట్ జెన్ కి రావటం - శాస్త్ర ప్రపంలో ఒక సరికొత్త అధ్యాయానికే కారణభూతమైనది.
ప్రయోగం చేయటం కోసం రాయింట్ జన్ ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద తన భార్య చేతిని ఉంచి యీ కిరణాలను ప్రసారం చేసి ఫోటోను డెవలప్ చేసి చూసి ఆశ్చర్యపోయాడు. చేతి ఎముకలు ఉంగరంతో సహా ఆ ఫోటో లో వచ్చింది. చుట్టూ మాంసం ఉన్నట్లు మసక మసకగా ఉంది. అంటే సజీవంగా ఉన్న మనిషి కంకాళాన్ని ఈ కిరణాల ద్వారా ఫోటో తీయవచ్చని స్పష్టంగా తేలింది.
ప్రమాదం
మార్చుదురదృష్ట వశాత్తు రాయింట్ జన్, ఆయనతో కలిసి పనిచేసిన మరో ఇద్దరు పరిశోధకులు యీ ఎక్స్ కిరణాల తాకిడికే క్రమ క్రమంగా మరణించారు. ఈ ఎక్స్-కిరణాల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతున్నప్పటికీ వాటిని మితిమీరి వాడితే మాత్రం ప్రమాదం తప్పదు. యీ కారణంగానే ఎక్స్-కిరణాలను నిరంతరం గురి కాబట్టే రాయింట్ జన్ ఆ కిరణాల ప్రభావంగానే చనిపోయాడని తెలుస్తోంది.
వ్యక్తిగత జీవితం
మార్చురాంట్ జెన్ అన్నా బెర్తా లుడ్వింగ్ (m. 1872, d. 1919) ను వివాహం చేసుకున్నాడు.అతడు 1887 లో 6 సంవత్సరాల జోసెఫిన్ బెర్తా లుడ్వింగ్ ను దత్తత తీసుకున్నాడు. ఈ పాప ఆయన భార్య అన్న యొక్క సోదరుని కుమార్తె.[5] రాయింట్ జెన్ ఫిబ్రవరి 10, 1923 లో చిన్నప్రేవులలో కురుపు కారణంగా మరిణించాడు.[6] ఈ వ్యాధి కూడా ఆయన చేస్తున్న రేడియో ధార్మికత ప్రయోగాల వల్ల అని విశ్వసించేవాడు కాదు. ఎందుకంటె ఈయన ఈ రంగంలో రేడియోధార్మికత నుండి రక్షించుకొనుటకు సీసపు కవచాలు వాడే కొద్దిమంది మార్గ నిర్దేశకులో ఒకరు.[4]
రాంత్ జెన్ ఆయన చేసిన ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు కూడా తీసుకోలేదు. నోబెల్ బహుమతిగా వచ్చిన ధనమును వర్జ్ బర్గ్ విశ్వవిధ్యాలయమునకు విరాళంగా యిచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల యేర్పడే ద్రవ్యోల్బణం వల్ల రాంట్ జెన్ దివాళా తీశాడు. తన శేష జీతితాన్ని మునిచ్కి సమీపంలో గల విల్ హెల్మ్ లో గల యింటిలో గడిపాడు.[7] ఆయన కోరిక ప్రకారం ఆయన వ్యక్తిగత, శాస్త్రమునకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆయన మరణం తర్వాత నాశనం చేయటం జరిగింది.[4]
సన్మానాలు-పురస్కారాలు
మార్చు1901 లో రాంట్ జెన్ కు మొదటి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ బహుమతి ఆయన ఎక్స్ కిరణాలు కనుగొని విశేష సేవలందించినందుకు గాను యివ్వబడింది. కాని రాంట్ జెన్ ఆ బహుమతికి వచ్చిన ఆర్థిక ప్రతిఫలాన్ని తన విశ్వవిద్యాలయమునకు దానమిచ్చాడు. పియరీ క్యూరీ వలే రాంట్ జన్ తన పరిశోధనకు పేటెంట్ హక్కులను తిరస్కరించాడు.ఎందువలనంటే మానవాళికి తన పరిశోధన యొక్క ఫలితాలు ఉపయోగకరంగా ఉండాలని.ఈ కిరణాలకు తన పేరు కూడా పెట్టరాదని కోరుకున్నాడు.
- రమ్ ఫోర్డ్ మెడల్ (1896)
- మాటెక్కీ మెడల్ (1896)
- ఎలియట్ క్రెస్సన్ మెడల్ (1897)
- భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి (1901)
- నవంబరు 2004 లో పరమాణు సంఖ్య 111 గా గల మూలకానికి ఆయన పై గౌరవార్థం రాంట్జెనీయం (Rg) అని IUPAC సంస్థ నామకరణం చేసింది. IUPAP కూడా ఈ పేరును నవంబరు 2011 లో దత్తత తీసుకుంది.
మూలాలు
మార్చు- ↑ Novelline, Robert. Squire's Fundamentals of Radiology. Harvard University Press. 5th edition. 1997. ISBN 0-674-83339-2 p. 1.
- ↑ Trevert, Edward (1988). Something About X-Rays for Everybody. Madison, WI: Medical Physics Publishing Corporation. p. 4. ISBN 0-944838-05-7.
- ↑ Agar, Jon (2012). Science in the Twentieth Century and Beyond. Cambridge: Polity Press. p. 18. ISBN 978-0-7456-3469-2.
- ↑ 4.0 4.1 4.2 Landwehr, Gottfried (1997). Hasse, A (ed.). Röntgen centennial: X-rays in Natural and Life Sciences. Singapore: World Scientific. pp. 7–8. ISBN 981-02-3085-0.
- ↑ Glasser (1933: 63)
- ↑ Glasser, Otto (1933). Wilhelm Conrad Röntgen and the Early History of the Roentgen Rays. London: John Bale, Sons and Danielsson, Ltd. p. 305. OCLC 220696336.
- ↑ Nitske, Robert W., The Life of W. C. Röntgen, Discoverer of the X-Ray, University of Arizona Press, 1971.