విశాఖ శ్రీ శారద పీఠం
విశాఖపట్నంలోని చిన్నముసివాడలో ఉన్న హిందూ మత సంస్థ.
విశాఖ శ్రీ శారద పీఠం (శారద పీఠం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని చిన్నముసివాడలో ఉన్న హిందూ మత సంస్థ. దేవత రాజా శ్యామల దేవి, శ్రీ శారదలకు ఈ పీఠం అంకితం చేయబడింది.[1]
విశాఖ శ్రీ శారద పీఠం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 17°48′31″N 83°12′05″E / 17.808504°N 83.201384°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రదేశం | చిన్నముసిడివాడ, విశాఖపట్నం |
సంస్కృతి | |
దైవం | శ్రీ శారద, రాజా శ్యామల దేవి |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 1997 |
సృష్టికర్త | స్వరూపానందేంద్ర సరస్వతి |
గురించి
మార్చు1997లో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ పీఠంను ప్రారంభించాడు. ఈ పీఠం లోపల అనేక దేవాలయాలు ఉన్నాయి.[2] రాజా శ్యామల దేవికి భారతదేశంలో ఉన్న ఏకైక దేవాలయం ఇది, రాజా శ్యామల దేవి దేవత కిరీటానికి చిహ్నంగా భావిస్తారు.[3]
- రాజా శ్యామల దేవి
- శ్రీ మేధా దక్షిణామూర్తి
- శ్రీ శారదాదేవి
- గణపతి
- ఆది శంకర
- శ్రీ వనదుర్గ
- శ్రీ వల్లి దేవసేన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి
- శ్రీ దాస ఆంజనేయస్వామి
- శ్రీ కృష్ణ
- శ్రీ దత్తాత్రేయ
- శ్రీ కాలభైరవ
- జమ్మివృక్షం
- నాగదేవత
- తండవమూర్తి
ప్రధాన అనుచరులు
మార్చుఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శారదా పీఠం ప్రభావం ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పీఠంను అనుసరిస్తున్నారు.[4]
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి)[5]
- కల్వకుంట్ల చంద్రశేఖరరావు (తెలంగాణ ముఖ్యమంత్రి)
- రామ్ మాధవ్ (రాజకీయనాయకుడు, రచయిత, జర్నలిస్టు)
- టి. సుబ్బరామి రెడ్డి (రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త)
- సుమన్ (సినీ నటుడు)
మూలాలు
మార్చు- ↑ Uttara Peethadhipathi for Sarada Peeth[permanent dead link], the Hans India (December 28, 2016)
- ↑ in Sarada Peeth, ssp (March 21, 2018)
- ↑ "AP CM offers prayers at Shyamala Devi temple in Vizag". Business Standard. 4 June 2019. Retrieved 20 May 2021.
- ↑ Chandrasekhar Rao takes seer’s blessings on TRS foundation day[permanent dead link], Deccan Chronicle (April 28, 2019)
- ↑ "Jagan Reddy meets PM Modi, discusses special category status for Andhra". Hindustan Times. 26 May 2019. Retrieved 20 May 2021.