విశాల హృదయాలు

(విశాలహృదయాలు నుండి దారిమార్పు చెందింది)

విశాల హృదయాలు 1965, సెప్టెంబరు 9న విడుదలైన తెలుగు సినిమా. బి. ఎస్.నారాయణ దర్శకత్వంలో, నందమూరి తారకరామారావు ,కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం టి. వి. రాజు అందించారు.

విశాల హృదయాలు
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.నారాయణ
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ గోకుల్ ఆర్ట్ ధియేటర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు
  • ఎన్.టి.రామారావు - శంకర్
  • కృష్ణకుమారి - పార్వతి
  • గుమ్మడి - విశ్వనాథం
  • రేలంగి - రామదాసు
  • చిత్తూరు నాగయ్య - భద్రయ్య
  • నాగభూషణం - పట్టాభి
  • చలం - మనోహర్
  • చదలవాడ కుటుంబరావు
  • హేమలత - జానకమ్మ
  • గిరిజ - శాంత
  • చంద్రకళ - ఇందిర
  • రాధాకుమారి -

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు టి.వి.రాజు సంగీతం సమకూర్చాడు.

క్ర.సం. పాట గేయ రచయిత గాయకులు నిడివి
1 "కలిసిన కన్నులు ఏమన్నవి" దాశరథి ఘంటసాల, పి.సుశీల 3:48
2 "ఒక్క మాట" రాజశ్రీ మాధవపెద్ది, కె.రాణి 3:07
3 "ఓ చిన్నోడ" రాజశ్రీ ఎస్.జానకి 3:31
4 "రండి రండి చేయి కలపండి" నార్ల చిరంజీవి ఘంటసాల 3:53
5 "ఏమంటున్నది నీ హృదయం" రాజశ్రీ పిఠాపురం, ఎస్.జానకి 2:54

6.కన్నుల విందు కమ్మని శోభ చూడగా, రచన: రాజశ్రీ, గానం.ఎస్.జానకి బృందం

7.తీపి తీపి పాలు మన తెలుగు గడ్డ పాలు , రచన:కొసరాజు , గానం.ఘంటసాల

8 జయా జయా నటరాజ నాథ ప్రియా , రచన: రాజశ్రీ, గానం.పి.లీల .

లక్ష్మీపతి అండ్ సన్స్ కంపెనీ మేనేజరు విశ్వనాథం. ఆయన భార్య సుశీల కొడుకుని కని చనిపోయింది. లక్ష్మీపతి తన ఏకైక పుత్రికారత్నాన్ని విశ్వనాథానికి రెండో భార్యగా ఇచ్చాడు. అయితే తన కుమార్తెతో జరిగిన ఈ పెళ్ళి గురించి కానీ, విశ్వనాథానికి కొడుకు ఉన్నాడని కానీ ఎవరికీ ఎప్పటికీ తెలియకూడదని షరతు విధించాడు. విశ్వనాథం కొడుకు శంకరం భద్రయ్య తాత వద్ద పెరుగుతున్నాడు. కొడుకు కాలేజీ చదువుకు విశ్వనాథం రహస్యంగా డబ్బు పంపుతూ తన స్నేహితుడు పట్టాభి ఇంట్లో బస ఏర్పాటు చేశాడు. పట్టాభికి ఇద్దరు కుమార్తెలు. పెద్దపిల్ల పార్వతిని విశ్వనాథం రెండో భార్యకొడుకు మనోహరానికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. కానీ శంకరం, పార్వతి ప్రేమించుకున్నట్లు తెలుసుకుని వారికి పెళ్ళి చేసి ఇంటినుండి వెళ్ళగొడతాడు. ఆస్తిపాస్తులు లేని శంకరం భార్య నగలు అమ్మి పాడి పశువులతోను, కూరపాదులు పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. భద్రయ్య మొదట వీరి పెళ్ళి గురించి ఆగ్రహించినా తరువాత చేరదీసి, ఆ తరువాత మరణిస్తాడు. పార్వతీ శంకరంలు తమకు కలిగిన బిడ్డకు తాతగారి పేరే పెట్టుకుంటారు. పట్టాభి రెండో కూతురు ఇందిరకు విశ్వనాథం రెండో కొడుకు మనోహరంతో వివాహం నిశ్చయమై పార్వతికి శుభలేఖ వస్తుంది. శంకరం పార్వతిని తీసుకుని పెళ్ళికి వెళతాడు. కానీ అందరూ వారి దారిద్ర్యాన్ని వేలెత్తి చూపుతారు. ఒక నగ శంకరం కొడుకుపై నింద మోపుతారు. మీరు నా కాళ్ళముందుకు వచ్చేవరకు మీ గడప తొక్కనని ప్రమాణం చేసి శంకరం పార్వతిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పార్వతిని అవమానించినందుకు తల్లి జానకమ్మ మంచం పట్టింది. పట్టాభి కాంట్రాక్టరుగా కట్టిన ఇళ్లు కూలిపోయి ప్రభుత్వం కేసు పెడుతుంది. పార్వతిని చూడనిదే జానకమ్మ బ్రతకదని డాక్టరు తేల్చి చెబుతాడు. పట్టాభికి తన తప్పు తెలిసివస్తుంది. ఆస్తి పాస్తులకంటే బాంధవ్యాలే ముఖ్యమని తెలుసుకుంటాడు. శంకరానికి, పార్వతికి క్షమాపణలు చెప్పి తిరిగి ఇంటికి తెచ్చుకుంటాడు. చివరలో విశ్వనాథం కూడా శంకరం తన కొడుకు అనే నిజాన్ని అందరికీ తెలియజేస్తాడు. కథ సుఖాంతమవుతుంది.[1]

విశేషాలు

మార్చు
  • ఈ చిత్రం ద్వారా చంద్రకళ నటిగా తొలిసారి పరిచయమయ్యింది.

మూలాలు

మార్చు
  1. ఎం.ఎస్.ఎం. (12 September 1965). "చిత్ర సమీక్ష: విశాల హృదయాలు" (PDF). ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original (PDF) on 22 డిసెంబరు 2022. Retrieved 11 August 2020.

బయటిలింకులు

మార్చు