విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి

విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి సంస్కృత పండితుడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.[1]

జీవిత విశేషాలుసవరించు

ఆయన జూన్ 16 1949 న సాంప్రదాయక వైదిక కుటుంబంలో జన్మించారు. ఆయన తన తండ్రి విశ్వనాథ జగన్నాధ ఘనపాఠీ గారివద్ద ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1969లో వ్యాకరణ విద్యాప్రవీణ ఉత్తీర్ణులయ్యారు. 1976లో ఎం.ఎ (న్యాయ ప్రవీణ) ను ఉత్తీర్ణులయ్యారు. తరువాత గురుకుల విద్యావిధానంలో తర్క, వ్యాకరణ, వేదాంత శాస్త్రాలను ప్రముఖ పండితుడు అయిన గోడ సుబ్రహ్మణ్యశాస్త్రి, రామచంద్రుల కోటేశ్వరశర్మ, లంక నరసింహశాస్త్రి, పేరి వెంకటేశ్వరశాస్త్రి, పేరి సూర్యనారాయణ శాస్త్రి, రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి లవద్ద అభ్యసించారు.[2]

సత్కారాలు, బిరుదులుసవరించు

 • శాస్త్రనిధి
 • శాస్త్ర రత్నాకర
 • శాస్త్ర మహాదధి
 • శాస్త్ర భూషణ
 • పండిత రత్న
 • శాస్త్ర విద్వాన్ మణి
 • విద్యా వాచస్పతి
 • శ్రీ రాఘవేంద్రస్వామి అనుగ్రహ పురస్కారం[1]
 • దర్శన అలంకార బిరుదు - శ్ర్ంగేరి పీఠాదిపతిచే.[1]

ఆయనకు అనేక సంస్థలు వివిధ సందర్భాలలో సత్కరించాయి. తిరుపతి లోని రాష్ట్రీయ విద్యా పీఠ్ వారు మహామహోపాధ్యాయ బిరుదును యిచ్చి సత్కరించారు.ఆయన రాజమండ్రిలో శాస్త్రపోషక సభ నిర్వహించినందుకుగానూ శృంగేరి మహాస్వామి ఆయనకు "సంచాలకత్వం" బిరుదును యిచ్చారు.[2]

ఆయన అనేక వేదసదస్సులలో పాల్గొని సంస్కృత సాహితీ జ్ఞానాన్ని అందిస్తుంటారు.[3]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 "Famous Educators in Rajahmundry". http://hellogodavari.com/. Archived from the original on 17 ఆగస్టు 2016. Retrieved 17 January 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help); External link in |website= (help)
 2. 2.0 2.1 "EMINENT SCHOLARS". http://srivgvp.org/. Retrieved 17 January 2016. {{cite web}}: External link in |website= (help)
 3. "TTD's Srinivasa Veda Sadassu tomorrow". STAFF REPORTER. The HIndu RAJAHMUNDRY. January 14, 2013. Retrieved 17 January 2016.

ఇతర లింకులుసవరించు