రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి

రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి బహుగ్రంథకర్త. ఆయన ఆధ్యాత్మికాంశాలపై గ్రంథరచన చేశారు.

రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి
రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి
జననం
రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి

(1920-08-20) 1920 ఆగస్టు 20 (వయసు 103)
జన్మ స్థలము
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఇతర పేర్లు
విద్యవిద్యార్హత
వృత్తివృత్తి
పనిచేయు సంస్థ
తల్లిదండ్రులుతల్లి దండ్రుల పేర్లు
పురస్కారాలుసాధించిన పురస్కారాలు

జీవిత విశేషాలు మార్చు

ఆయన ఆగష్టు 20, 1920లో జన్మించారు. ఆయన కృష్ణ యజుర్వేదం (ఘనాంతం), తైతిరీయ శాఖ, శ్రౌతం (కల్ప శాస్త్రం) ఆపస్తంబ సూత్రం, లక్షణ శాస్త్రం, విద్యారణ్య భాష్యం, మీమాంస సూత్రములను అధ్యయనం చేసారు.[1] ఆయన రాజమండ్రి లోని శ్రీ గౌతమీ విద్యా పీఠం సంస్కృత కళాశాల యొక్క ప్రధానాచార్యుడుగా పదవీవిరమణ చేసారు.విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి వీరి శిష్యులు. సూర్యప్రకాశశాస్త్రి తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతికి అనేక సంవత్సరాలుగా సలహాదారుగా ఉన్నారు. రాజమండ్రి, కాకినాడ, హైదరాబాదు ల లోని అనేక వేద శాస్త్ర పరిషత్తులకు గౌరవ అధ్యక్షునిగా ఉన్నారు.

గౌరవాలు, గుర్తింపులు[2] మార్చు

 • 1961 : రాజమండ్రి వేద శాస్త్ర పరిషత్ చే "సాంగ వేదార్థ సమ్రాట్ " బిరుదు.
 • 1969 : విజయవాడ వేద శాస్త్ర పరిషత్ వారిచే "అభినవ విద్యారణ్య" బిరుదు.
 • 1970 : హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే "వేద భాష్య పండితుడు"గా గుర్తింపు.
 • 1978 : కేరళలో జరిగిన అఖిలభారత విద్వత్ సమ్మేళనంలో కంచికామకోటి పీఠాధిపతి శ్రీచంద్ర శేఖరేంద్ర సరస్వతి చే "శాస్త్ర రత్నాకర" బిరుదు.
 • 1985 : వారణాసి లోని శ్రీ పట్టాభిరామ శాస్త్రి వేదమీమాంసానుసంధాన కేంద్రం ద్వారా "వేదమీమాంస సార్వభౌమ" బిరుదు.
 • 1990 : రాష్ట్రపతి పురస్కారం ( వేదం, సంస్కృత పండిత పురస్కారం ఆర్.వెంకటరామన్, రాష్ట్రపతి ద్వారా)
 • 1996 : రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం (సెంట్రల్ విశ్వవిద్యాలయం), తిరుపతి వారిచే "మహామహోపాధ్యాయ" బిరుదు.
 • 1998 : మైసూరు లోని శ్రీ గణపతి సచ్చిదానంద వారిచే "వేదనిథి" బిరుదం.
 • 2002 : బెంగళూరు లోని శ్రీ భారతీయ విద్యాభవన్ వారిచే "వేదరత్న" బిరుదం.

ప్రచురణలు[3] మార్చు

 • వేదార్థోపన్యాసములు ( 700 పేజీల వేదార్థ ఉపన్యాసాలు)
 • సంస్కృతంలో "నిత్య కామ్య కర్మ మీమాంస"
 • "వేదార్థ జ్ఞాన దీపిక" తెలుగులో (2 సంపుటాలు)

మూలాలు మార్చు

 1. "eminent scholars". Archived from the original on 2016-03-04. Retrieved 2015-03-18.
 2. "ఆయనకు వచ్చిన అవార్డులు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-03-18.
 3. "ప్రచురణలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-03-18.

ఇతర లింకులు మార్చు