వైవిధ్యభరితమైన ప్రక్రియల్లో, విస్తారమైన విషయాలపై విశ్వనాథ సత్యనారాయణ సృజించిన సాహిత్యంలోని లోతుపాతులను, విశేషాలను వెలికితీస్తూ రచించిన విమర్శరచనల సంపుటి ఇది. ఈ గ్రంథానికి సుప్రసిద్ధులైన విమర్శకులు, సాహిత్యవేత్తలు పలువురు వ్యాసాలను అందించారు.

విశ్వనాథ శారద
కృతికర్త: మల్లంపల్లి శరభయ్య శర్మ, కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య, తదితరులు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: సాహిత్య విమర్శ
ప్రచురణ:
విడుదల: 1983

నేపథ్యం

మార్చు

విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవలలు, కథలు, ఖండకావ్యాలు, మహాకావ్యాలు, విమర్శ రచనలు, నాటకాలు ఆదిగాగల విస్తృత సాహిత్యంపై రచించిన వ్యాసాల సంపుటి ఇది. మల్లంపల్లి శరభయ్య శర్మ, కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య మొదలైన పలువురు విమర్శకులు, ఆలంకారికులు ఈ గ్రంథంలోని వ్యాసాలను రచించారు. ఈ వ్యాసాల్లో విశ్వనాథ సత్యనారాయణ జీవితం, సాహిత్యం, వ్యక్తిత్వం వెల్లడయ్యే వీలుంది. 1982లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ గ్రంథం ప్రచురింపబడింది.[1]

విషయం

మార్చు

తెలుగు సాహిత్యంలో అత్యంత వైవిధ్యభరితమైన రచయితగా విశ్వనాథ సత్యనారాయణ సుప్రసిద్ధుడు. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్టు లక్షపద్యాలు రాసివుంటారు, దానిలో 50వేలు వెలుగుచూడకుండా ఆయనే చింపివేశారు.[2]. సైద్ధాంతికంగా ఆయనను సంప్రదాయవాదిగా అభివర్ణించారు. బ్రిటీష్ సాంస్కృతిక సామ్రాజ్యవాదపు అన్ని రూపాలనూ ఆయన వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. వేయిపడగలు, రామాయణ కల్పవృక్షం మొదలైన పద్య, గద్య రచనల ద్వారా ఆంధ్రదేశమంతా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు.[2] ఈ గ్రంథంలోని వివిధ వ్యాసాల్లో ఆయన రచనలను విమర్శ పద్ధతుల్లో రచనలు చేశారు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 విశ్వనాథ శారద:పలువురు రచయితలు:1982
  2. 2.0 2.1 తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు