విశ్వరూపం (2013 సినిమా)
విశ్వరూపం 2013 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. దీనిని కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అయితే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో, కన్నడ సినిమా కర్ణాటకలో విడుదల అయిననూ, తమిళ చిత్రం మాత్రం తమిళనాడులో ఆలస్యంగా , ఫిబ్రవరి 7 న విడుదలవనున్నది.[4]
విశ్వరూపం | |
---|---|
దర్శకత్వం | కమల్ హాసన్ |
రచన | కమల్ హాసన్ అతుల్ తివారి |
నిర్మాత | కమల్ హాసన్, చంద్రహాసన్ |
తారాగణం | కమల్ హాసన్ పూజా కుమార్ ఆండ్రియా రాహుల్ బోస్ జైదీప్ అహ్లావత్ జరీనా వహాబ్ |
ఛాయాగ్రహణం | సాను వర్ఘీస్ |
కూర్పు | మహేశ్ నారాయణన్ |
సంగీతం | శంకర్-ఎహసాన్-లాయ్ |
పంపిణీదార్లు | పి.వి.పి ఫిలింస్ |
విడుదల తేదీs | 25 జనవరి 2013 (తెలుగు, హిందీ), 7 ఫిబ్రవరి 2013, (తమిళం) |
సినిమా నిడివి | 147 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాషలు | తమిళ్, హిందీ |
బడ్జెట్ | ₹95 crore (US$12 million)[2][3] |
నటీనటులు
మార్చు- కమల్ హాసన్
- రాహుల్ బోస్
- పూజా కుమార్
- ఆండ్రియా జర్మియా
- సమ్రాట్ చక్రవర్తి
- జైదీప్ అహ్లావత్
- నాజర్
- శేఖర్ కపూర్
కథ
మార్చువిశ్వనాధ్ (కమల్ హాసన్) న్యూయార్క్ లో ఉండే క్లాసికల్ డాన్స్ టీచర్. ఆయన భార్య డాక్టర్ నిరుపమ (పూజా కుమార్) విశ్వనాధ్ మీద అనుమానంతో ఒక డిటెక్టివ్ ఏజెంట్ సహాయం కోరుతుంది. ఆ డిటెక్టివ్ ఏజెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం విశ్వనాధ్ హిందూ కాదని ముస్లిం అని తెలుస్తుంది. విశ్వనాధ్ పట్టుకునే క్రమంలో డిటెక్టివ్ ఏజెంట్ ముస్లిం టెర్రరిస్ట్ ఒమర్ (రాహుల్ బోస్) కి దొరికిపోతాడు. ఆ క్రమంలో విశ్వనాధ్ ఎవరు అని కనుక్కునే ప్రయత్నంలో విశ్వనాధ్ గురించి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అసలు విశ్వనాధ్ ఎవరు? అతనికి టెర్రరిస్టులకి సంబంధం ఏంటి? ఇంతకు విశ్వనాధ్ మంచి వాడా? చెడ్డవాడా? ఇది విశ్వరూపం యొక్క కథ.
స్పందనలు
మార్చు- పాటలకు పెద్దగా ఆస్కారం లేని ఈ సినిమాలో నేపథ్య సంగీతానిదే పైచేయి. శంకర్, ఎహ్సాన్, లాయ్ త్రయం చక్కని సంగీతాన్ని అందించింది. అలానే సినిమాకు హైలైట్ గా నిలిచింది శాను వర్గీస్ కెమెరా పనితనం. ఆఫ్గనిస్తాన్ నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్న భావన కలుగుతుంది. అయితే మహేశ్ నారాయణ్ ఎడిటింగ్ పేలవంగా ఉన్న కారణంగా….సినిమా కొన్ని సన్నివేశాలలో మందగమనంతో సాగింది. కమల్ స్క్రీన్ ప్లే అత్యద్భుతం. నాట్యాచార్యుడు విశ్వనాథ్ ఒక్కసారిగా జూలు విదిల్చిన సింహంలా ప్రత్యర్థుల మీద దాడి చేసిన సన్నివేశాన్ని థియేటర్లలోని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత సినిమా అంతా కథానుగుణంగా సాగటంతో సాధారణ ప్రేక్షకుడికి కాస్త విసుగు కలగడం సహజం. [5] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్, ఫిల్మ్ జర్నలిస్ట్
మూలాలు
మార్చు- ↑ "VISHWAROOPAM (12A)". British Board of Film Classification. Retrieved 11 January 2013.
- ↑ Sangeetha Kandavel (2012-12-28). "Kamal Haasan firms up DTH plans for 'Vishwaroopam'". The Economic Times. Archived from the original on 2013-02-16. Retrieved 2013-01-07.
- ↑ The Hindu (12 January 2013), Is the big screen enough? SUDHISH KAMATH
- ↑ http://www.indiaglitz.com/channels/telugu/article/90606.html
- ↑ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్. "కమల్ హసన్ 'విశ్వరూప' విన్యాసం!". ఓంప్రకాశ్ రాతలు గీతలు. Retrieved 15 February 2024.