విశ్వనగరం
ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక ఆశ్రమం
(విశ్వ నగరం నుండి దారిమార్పు చెందింది)
విశ్వనగరం (Viswa Nagar or Viswanagar) శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారిచే స్థాపించబడిన ఒక ఆశ్రమ ప్రాంతం. ఇది జాతీయ రహదారి 16 మీద గుంటూరు - చిలకలూరిపేట మధ్యగల చినకొండ్రుపాడు గ్రామ పరిధిలో ఉన్నది.[1] ఈ ఆశ్రమానికి రెండు ప్రవేశద్వారాలు కలవు: అవి అనసూయ ద్వారం, అత్రి ద్వారం. ప్రకృతిసిద్ధమైన ఈ ప్రాంతం 18 ఎకరాల సువిశాల ప్రాంతంలో విస్తరించి; ప్రపంచ శాంతికి చెందిన వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దీనికి పశ్చిమంగా విస్తరించిన కొండవీడు పర్వత సానువుల నుండి తూర్పువైపునకు నీరు ప్రవహించి ఆశ్రమ ప్రాంతాన్ని పవిత్రం చేస్తాయి.
ఆశ్రమంలోని విశేషాలు
మార్చు- విశ్వమానవ సమైక్యతా స్థూపం (Universal Integration pillar) : ఇది అష్టదళ పద్మాకారంలో సత్యం, శీలం, పవిత్రత, సమైక్యతలను చాటుతున్నది. ఈ మందిరం 98 అడుగుల ఎత్తు, 45 అడుగుల వ్యాసార్ధం కలిగి గోళాకారంలో ఎనిమిది ద్వారాలతో మహోన్నతంగా నిర్మించబడినది.[2] హిందూ, క్రైస్తవ, శిక్కు, బౌద్ధ, జైన, జోరాష్ట్రియన్, ఇస్లాం మతాలకు ప్రతీకలుగా ఏడు ద్వారాలతోబాటు హేతువాదాన్ని కూడా మతంగా గుర్తించి దానికి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేయడం విశేషం. శాంతికి ప్రతీకయైన చిత్రాన్ని లింగాకారంలో ఉన్న స్థూపపు శిఖరంపై ఉంచారు. దానిపైన పూర్ణకుంభం, త్రిశూలం దర్శనమిస్తాయి.
- విశ్వగురుపీఠం (Universal abode of Sri Viswamji) : ఇది స్వామీజీ వారి కార్యక్రమాలకు ప్రధాన కేంద్రం.
- దత్త పాదుకా మందిరం : ఇందులో శ్రీ శ్రీధర్ మహరాజ్, శ్రీ షిర్డి సాయినాథుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృశింహ సరస్వతి, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, శ్రీ మాణిక్య ప్రభువు, గజానన మహరాజు మున్నగు గురువుల స్వరూపాలు స్థాపించబడ్డాయి.
- అష్టసిద్ధి ఆడిటోరియం
- హోమశాల (Place of offering worship to celestial Gods through fire).
- విశ్వయోగి వైద్య ఆరోగ్య సంస్థ (Viswayogi Institute of Medical Sciences or VIMS)[3] దీనిని ఏప్రిల్ 3, 2008 తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిచే ప్రారంభించబడినది.
- సరస్వతీ దేవి విగ్రహం.
- శ్రీ కల్పవృక్ష వరసిద్ధి వినాయకుని దేవాలయం
- శ్రీ విశ్వ కుండలిని శ్రీనివాస సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం
- గోశాల : సుమారు 100 పైగా గోవుల సంరక్షణ ఆశ్రమ ప్రాంగణంలో చేపట్టబడ్డాయి.
- విశ్వంభరి : భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వసతిగృహాలు.
- శాకంబరి : భోజనశాల.
కార్యక్రమాలు
మార్చు- దత్తజయంతి
- గురుపౌర్ణమి
- విశ్వంజీ మహారాజ్ వారి జన్మదిన వేడుకలు : ప్రతి సంవత్సరం మార్చి 5వ తేదీన స్వామివారి జన్మదిన శుభసందర్భంగా వివిధ భక్తి, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
చిత్రమాలిక
మార్చు-
విశ్వమానవ సమైక్యతా స్తూపం
-
విశ్వమానవ సమైక్యతా స్తూపం
-
విశ్వమానవ సమైక్యతా స్తూపం
-
విశ్వమానవ సమైక్యతా స్తూపం
-
విశ్వమానవ సమైక్యతా స్తూపం
-
విశ్వమానవ సమైక్యతా స్తూపం
-
విశ్వమానవ సమైక్యతా స్తూపం
మూలాలు
మార్చు- ↑ "Viswa Nagar, Guntur| Viswa Nagar Photos and Timings". www.holidify.com. Retrieved 2023-03-16.
- ↑ విశ్వమానవ సమైక్యతా స్థూపము (విశ్వమందిరం). విశ్వగురు వైభవం. వి. రత్నమోహిని. p. 73.
- ↑ విశ్వగురు. "Viswayogi Institute of Medical Sciences" (in English). Retrieved 6 March 2017.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)