వి.వి.ఎస్.ఎస్.చౌదరి
వంకా వీర వెంకట సత్యనారాయణ చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆలమూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
వి.వి.ఎస్.ఎస్.చౌదరి | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1994 - 1999 1999- 2004 | |||
నియోజకవర్గం | ఆలమూరు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1938 మండపేట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
మరణం | 2021 డిసెంబర్ 28 హైదరాబాద్ | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ప్రజారాజ్యం పార్టీ | ||
తల్లిదండ్రులు | వంక సత్యం, సీతారత్నం | ||
జీవిత భాగస్వామి | సత్యవతి | ||
బంధువులు | వేగుళ్ల జోగేశ్వర రావు | ||
వృత్తి | పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చువీవీఎస్ఎస్ చౌదరి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆలమూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరెడ్డి సంగీత పై 36710 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1999లో టీడీపీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిక్కిన కృష్ణార్జున చౌదరి పై 14630 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
వీవీఎస్‌ఎస్ చౌదరి 2009లో నియోజకవర్గల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పాటైన మండపేట నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వేగుళ్ల జోగేశ్వర రావు చేతిలో ఓడిపోయాడు. ఆయన 2014లో వైసీపీకి మద్దతు తెలిపి తిరిగి 2015లో టీడీపీలో చేరాడు.
మరణం
మార్చువి.వి.ఎస్.ఎస్.చౌదరి 2021 డిసెంబర్ 28న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (29 December 2021). "ఆలమూరు మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్ చౌదరి మృతి". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
- ↑ Prajasakti (29 December 2021). "మాజీ ఎమ్మెల్యే చౌదరి మృతి". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
- ↑ Eenadu (29 December 2021). "మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్ చౌదరి మృతి". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.