వి. ఎస్. శ్రీనివాస శాస్త్రి
వలంగైమాన్ శంకరనారాయణ శ్రీనివాస శాస్త్రి, సిహెచ్ పీసీ (22 సెప్టెంబర్ 1869-17 ఏప్రిల్ 1946) భారతీయ రాజకీయవేత్త, నిర్వాహకుడు, విద్యావేత్త, వక్త, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. ఆయన ప్రసంగధోరణి, ఆంగ్లభాషా ప్రావీణ్యం చాలా సుప్రసిద్ధి చెందింది.[1][2] శ్రీనివాస శాస్త్రి భారతదేశంలోని కుంభకోణం సమీపంలోని వలంగైమాన్ గ్రామంలో ఒక పేద ఆలయ పూజారికి జన్మించాడు. ఆయన కుంభకోణంలో తన విద్యను పూర్తి చేసి, పాఠశాల ఉపాధ్యాయుడిగా, తరువాత మద్రాసు ట్రిప్లికేన్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. శాస్త్రి 1908 నుండి 1922 వరకు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా పనిచేశాడు, కానీ, తరువాత సహాయ నిరాకరణ ఉద్యమానికి నిరసనగా రాజీనామా చేశారు. ఇండియన్ లిబరల్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో శాస్త్రి ఒకరు. తన చివరిరోజుల్లో, అతను భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు.[3]
వలంగైమాన్ శంకరనారాయణ శ్రీనివాస శాస్త్రి | |
---|---|
దక్షిణాఫ్రికా యూనియన్ కి భారతీయ ఏజెంటు | |
In office 1927 జూన్ – 1929 జనవరి | |
చక్రవర్తి | ఐదవ జార్జి |
గవర్నర్ జనరల్ | ఎడ్వర్డ్ వుడ్ |
అంతకు ముందు వారు | ఎవరూ లేరు |
తరువాత వారు | కూర్మా వెంకట రెడ్డి నాయుడు |
కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యుడు | |
In office 1920–1925 | |
చక్రవర్తి | ఐదవ జార్జి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | వలంగైమాన్, తంజావూరు జిల్లా | 1869 సెప్టెంబరు 22
మరణం | 1946 ఏప్రిల్ 17 మైలాపూర్, మద్రాసు | (వయసు 76)
జాతీయత | బ్రిటిష్ ఇండియా |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1908–1922), ఇండియన్ లిబరల్ పార్టీ (1922–1946) |
జీవిత భాగస్వామి | పార్వతి |
కళాశాల | నేటివ్ హైస్కూలు, కుంబకోణం ప్రభుత్వ కళాశాల, కుంబకోణం |
వృత్తి | హెడ్మాస్టర్ |
నైపుణ్యం | విద్యావేత్త, ప్రసంగకర్త, రచయిత, రాజకీయ నాయకుడు, దౌత్యవేత్త |
శ్రీనివాస శాస్త్రి 1913 నుండి 1916 వరకు మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోనూ, 1916 నుండి 1919 వరకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోనూ, 1920 నుండి 1925 వరకు కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యుడిగానూ పనిచేశాడు. శాస్త్రి లీగ్ ఆఫ్ నేషన్స్ భారత ప్రతినిధిగానూ, యునైటెడ్ కింగ్డమ్ లోని ప్రైవీ కౌన్సిల్ సభ్యుడిగానూ, యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏజెంట్‌గానూ కూడా పనిచేశాడు.[4][5][6]
ఆంగ్ల భాషలో నైపుణ్యానికి శాస్త్రి ప్రపంచవ్యాప్తంగా కీర్తిని పొందాడు. అతను రాజకీయాల్లో గోపాల కృష్ణ గోఖలేకి సన్నిహిత సహచరుడు. శాస్త్రి మహాత్మా గాంధీ సన్నిహిత మిత్రుడు, సహచరుడు కూడా, గాంధీ తన రచనలలో శాస్త్రిని తన "అన్నయ్య" గా సంబోధించాడు. శాస్త్రి 1930లో ఆర్డర్ ఆఫ్ ది కంపానియన్స్ ఆఫ్ ఆనర్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. 1921లో ఫ్రీడమ్ ఆఫ్ లండన్ అన్న గౌరవాన్ని ఆయనకు ప్రదానం చేశారు, 1931లో ఫ్రీడమ్ ఆఫ్ ఎడిన్బర్గ్ అన్న గౌరవాన్నీ అందుకున్నాడు.[7]
అయితే, నెహ్రూ వంటి భారత స్వాతంత్ర్యోద్యమ నాయకులు కొంతమంది శాస్త్రికి బ్రిటిష్ పాలకుల పట్ల సానుభూతి బాగా ఎక్కువనీ, వారితో చాలా ఎక్కువగా సహకరిస్తున్నాడనీ భావించారు. ఇది ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశాలలో స్పష్టంగా కనిపించింది, ఇక్కడ శాస్త్రి, తన పార్టీ సభ్యునితో సహా బ్రిటిష్ వారి అన్యాయమైన ప్రతిపాదనలను అంగీకరించాడు.[8]
మూలాలు
మార్చు- ↑ CHAPTER XIII: V.S.Srinlvasa Sastrl (1869 - 1946) (PDF). pp. 250–290.
- ↑ "V.S.Srinivasa Shastri | Prekshaa". www.prekshaa.in. Retrieved 2020-03-13.
- ↑ The Houghton Mifflin Dictionary of Biography. Houghton Mifflin Harcourt. 2003. p. 1350. ISBN 978-0-618-25210-7.
- ↑ "Second Session of the Assembly". League of Nations Photo Archive. University of Indiana.
- ↑ Mohan Lal (2006). Encyclopaedia of Indian Literature, Volume 5. Sahitya Akademi. p. 4175. ISBN 978-81-260-1221-3.
- ↑ "South African History Timelines – 1920s". South African History Online (SAHO). Archived from the original on 14 October 2009. Retrieved 18 October 2009.
- ↑ "Freedom of the city of Edinburgh". Archived from the original on 2 September 2012.
- ↑ Jawaharlal Nehru (1945). An Autobiography (1 ed.). Calcutta: Bodell.