వి. తులసీరామ్

వి. తులసీరామ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ ఎంపీ. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దపల్లి & నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

వి. తులసీరామ్
మాజీ లోక్‌సభ సభ్యుడు
In office
1985 - 1989
Preceded byఏ.ఆర్.మల్లు
Succeeded byఏ.ఆర్.మల్లు
Constituencyపెద్దపల్లి నియోజకవర్గం & నాగర్‌కర్నూల్ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం2 అక్టోబర్ 1938
శివరాంపల్లి , రంగారెడ్డి జిల్లా
మరణం16 ఏప్రిల్ 2020
శివరాంపల్లి , రంగారెడ్డి జిల్లా
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
కాంగ్రెస్ పార్టీ , తెలంగాణ ప్రజా సమితి
జీవిత భాగస్వామిభారతి దేవి
సంతానం3 కుమార్తెలు, 2 కుమారులు
తల్లిదండ్రులునారాయణస్వామి

జననంసవరించు

వి. తులసీరామ్ 2 అక్టోబర్ 1938లో తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా , శివరాంపల్లి గ్రామంలో జన్మించాడు.

రాజకీయ ప్రస్థానంసవరించు

వి. తులసీరామ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1959 నుంచి 1971 వరకు కాటేదాన్ సర్పంచ్‌గా, రాజేంద్రనగర్ పంచాయితీ సమితి ప్రెసిడెంట్‌గా పని చేశాడు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి తరపున పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంటుకు తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.

వి. తులసీరామ్ 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఎన్‌టీ రామారావు 1982లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో చేరి 1985లో టీడీపీ తరపున నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ఆయన తరువాత రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా పని చేశాడు.

మరణంసవరించు

వి. తులసీరామ్ అనారోగ్యంతో బాధపడుతూ 16 ఏప్రిల్ 2021న రంగారెడ్డి జిల్లా, శివరాంపల్లి లోని తన స్వగృహంలో మరణించాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.[1][2][3]

మూలాలుసవరించు

  1. Nava Telangana (16 April 2020). "మాజీ ఎంపీ వి.తులసీరామ్ మృతి". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021. Check date values in: |archivedate= (help)
  2. Andrajyothy (16 April 2020). "మాజీ ఎంపీ తులసీరామ్ సేవలను గుర్తు చేసుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021. Check date values in: |archivedate= (help)
  3. The New Indian Express (16 April 2020). "Former MP Tulasiram passes away". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021. Check date values in: |archivedate= (help)