వీజే సన్నీ
అరుణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. వీజే సన్నీ గా సూపరిచితుడైన ఆయన బిగ్ బాస్ 5 సీజన్ విజేతగా నిలిచాడు.[2][3]
వీజే సన్నీ | |
---|---|
జననం | అరుణ్ రెడ్డి [1] 17 ఆగష్టు 1989 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | నటుడు, విజే |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | బిగ్ బాస్ 5 విజేత |
తల్లిదండ్రులు | వెంకటేశ్వర్లు, కళావతి |
జననం, విద్యాభాస్యం
మార్చుఅరుణ్ రెడ్డి (వీజే సన్నీ) 17 ఆగష్టు 1989న తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలో జన్మించాడు. అయన ఖమ్మం నగరంలోనే స్కూల్, ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. [4][5]
కెరీర్
మార్చువిజే సన్నీ చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తితో చిన్న వయసులోనే ‘అల్లాద్దీన్’ నాటకంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన అనంతరం ఓ ఛానెల్ లో ‘జస్ట్ ఫర్ మెన్’ అనే టీవీ షోకి యాంకర్‌గా ఆ తరువాత న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా కొంతకాలం పని చేశాడు. విజే సన్నీ ఆ తర్వాత 'కళ్యాణ వైభోగం' అనే సీరియల్‌లో నటించి జయసూర్య అనే పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై తరువాత 'సకలగుణాభిరామ' సినిమాలో హీరోగా అవకాశం దక్కింది.[6] ఆయనకు బిగ్‌బాస్ 5వ సీజన్‌లో కంటెస్టెంట్ గా వెళ్లి బిగ్‌బాస్ 5 తెలుగు విజేతగా నిలిచాడు.[7] సన్నీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ తో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ, షాద్ నగర్ వెంచర్ సువర్ణ భూమిలో రూ.25 లక్షల విలువ చేసే స్థలం గెలుచుకున్నాడు.[8]
నటించిన సినిమాలు
మార్చు- సకల గుణాభి రామ [9][10]
- అన్‌స్టాపబుల్ (2023)
- Sound party - (2023)
వెబ్ సిరీస్
మార్చుమూలాలు
మార్చు- ↑ The Hans India (2 June 2019). "Pursuing a dream". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ Eenadu (20 December 2021). "బిగ్‌బాస్ సీజన్-5 విజేత వీజే సన్నీ". Archived from the original on 20 December 2021. Retrieved 20 December 2021.
- ↑ Namasthe Telangana (19 December 2021). "బిగ్ బాస్-5 విజేత వీజే సన్నీ". Namasthe Telangana. Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ NTV (20 December 2021). ""బిగ్ బాస్ 5" విన్నర్ సన్నీ గెలిచింది ఎంత ? చేతికొచ్చేది ఎంత?". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ TV9 Telugu, TV9 Telugu (6 September 2021). "అప్పుడే బిగ్‌బాస్ హౌస్‌లో డ్రీమ్ గళ్ను వెతుక్కునే పనిలో సన్నీ.. ఆ ఇద్దరితో." Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India (4 September 2021). "Bigg Boss Telugu 5 contestant VJ Sunny: All you need to know about the journalist-turned-actor - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ Sakshi (5 September 2021). "బిగ్‌బాస్ విజేత వీజే సన్నీ" (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ 10TV (20 December 2021). "బిగ్‌బాస్ విన్నర్ సన్నీ ఏమేమి గెలిచుకున్నాడో తెలుసా... | Bigg Boss Winner Sunny winning ifts" (in telugu). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Namasthe Telangana (16 August 2021). "సకల గుణాభి రాముడు". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ HMTV (13 December 2021). "విజేగా మొదలై 'బిగ్ బాస్' నుండి 'హీరో'గా రాబోతున్న సన్నీ గురించి మీకు తెలుసా..!!". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.