వీటో

నిర్ణయాలు లేదా శాసనాలను ఆపడానికి ప్రత్యేక అధికారం

వీటో, (నిర్ణయ నిరోధ హక్కు) అనేది ఏదైనా ఒక సమితి లేదా సదస్సులో తీసుకున్న నిర్ణయాలను లేదా శాసనాలను ఆపడానికి కలిగిన ప్రత్యేక అధికారం. మామూలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకున్న నిర్ణయాలను కూడ కొందరు సభ్యులు ఈ ప్రత్యేక హక్కులతో నిరాకరించ గలుగుతారు. ఇది పాత రోమన్ సామ్రాజ్యం వాడుక నుంచి తీసుకున్న పదం.

వీటో బిల్ పై సంతక చేస్తున్న రోనాల్డ్ రీగన్

ఉదాహరణకి అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి ఆ దేశ శాసన సభలు తీసుకున్న నిర్ణయాలను అమలుచేయకుండా నిరోధించే అర్హత (వీటో) ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లో శాశ్వత సభ్యులైన ఐదు దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా లకు ఆ సమితి నిర్ణయాలను "వీటో" చేసి, తీర్మానాలుగా మారకుండా ఆపగలిగే అధికారం ఉంది.[1]

మూలాలు మార్చు

  1. "వీటో చేస్తే సమాధానమివాల్సిందే". EENADU. Retrieved 2022-06-02.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=వీటో&oldid=3687640" నుండి వెలికితీశారు