వీర సామ్రాజ్యం
వీర సామ్రాజ్యం తమిళం నుండి డబ్బింగ్ అయిన తెలుగు సినిమా. కల్కి కృష్ణమూర్తి తమిళంలో వ్రాసిన చారిత్రక నవల పార్తీబన్ కనవు ఆధారంగా ఈ సినిమా తీయబడింది. ఈ జానపద/చారిత్రాత్మక చిత్రం 1961, ఫిబ్రవరి 18న విడుదలయ్యింది. పగవాని కుమారునికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసిన విశాలహృదయుడు పల్లవ చక్రవర్తి నరసింహ వర్మ కథ ఇది. ఈ సినిమాను మహాబలిపురంలో చిత్రీకరించారు[1]. ఈ సినిమా తమిళంలో పార్తీబన్ కనవు పేరుతో విడుదలై రజతోత్సవం జరుపుకొనడమే కాక 1960 వ సంవత్సరానికి గాను ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.
వీర సామ్రాజ్యం (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.యోగానంద్ |
---|---|
నిర్మాణం | చెరుకూరి ప్రకాశరావు |
తారాగణం | జెమినీ గణేశన్, వైజయంతిమాల, ఎస్.వి.రంగారావు |
సంగీతం | పామర్తి |
సంభాషణలు | మల్లాది రామకృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | నరసరాజు కంపెనీ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- జెమినీ గణేశన్
- వైజయంతిమాల
- ఎస్.వి.రంగారావు
- బి.సరోజాదేవి
- టి.ఎస్.బాలయ్య
- రాగిణి
- కమలా లక్ష్మణన్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం : డి.యోగానంద్
- కథ: కల్కి కృష్ణమూర్తి
- మాటలు : మల్లాది రామకృష్ణశాస్త్రి
- పాటలు : మల్లాది రామకృష్ణశాస్త్రి
- సంగీతం : పామర్తి
- ఛాయాగ్రహణం: సెల్వరాజ్
పాటలు
మార్చు- అట్టిమాటలు విన్నవిక్రముడాగ్రహమున చూచి రాజుని -
- కలలో నా కలలో కలలో కనిపించాడే చెలియా రమ్మని పిలిచాడే -
- నల్ల నల్లని మబ్బులవిగో వ్యాపించి తళాతళా తళ మెరిసి -
- రావోయి రావోయి రతనాల వర్తకుడా వెలలేని రతనమురా -
- వచ్చినావు శివయోగి రక్షణకు ( సంవాద పద్యాలు ) -
- వీర సామ్రాజ్యం ( బుర్రకధ) -
- సామీ విక్రముడేడి చూపుడీ సారికి మ్రోక్కెదన్ -
మూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (26 February 1961). "రూపవాణి - వీరసామ్రాజ్యం". ఆంధ్రప్రభ దినపత్రిక. No. సంపుటి 26 సంచిక 55. Retrieved 16 February 2018.[permanent dead link]
బయటిలింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)