వీర సేనాపతి 1964, ఏప్రిల్ 4న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. మలయాళభాషలో 1962లో వెలువడిన వేలుతంబి దళవ అనే సినిమా దీని మాతృక. ఎవర్ షైన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది.

వీర సేనాపతి
(1964 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.విశ్వనాథం
నిర్మాణ సంస్థ ఎవర్ షైన్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • కొట్టారక్కర శ్రీధరన్ నాయర్ - వేలుతంబి
  • తిక్కురిస్సి సుకుమారన్ నాయర్ - జయంతన్ నంబూద్రి
  • అదూర్ భాసి - మల్లన్ పిళ్ళై
  • జి.కె.పిళ్ళై - కుంజునీలన్ పిళ్ళై
  • సత్యపాల్ - మెకాలే
  • రాగిణి - జగదాంబిక
  • ప్రేమ్ నవాజ్ - ఉన్ని నంబూద్రి
  • అంబిక - సీతాలక్ష్మి
  • సుకుమారి - జానకి

సాంకేతికవర్గం మార్చు

కథ మార్చు

తిరువాన్కూరు మహారాజు బలరామవర్మ 18 యేళ్ళ యువకుడు. అతని తరఫున రాజ్యాన్ని పరిపాలిస్తున్న 'దళవాయి' జయంతన్ నంబూద్రి నిరంకుశ పాలనతో కథ ప్రారంభమవుతుంది. దేశం అన్ని స్థాయిల్లోనూ అవినీతి, నిర్వహణ లోపంతో సతమతమైంది. రాజసేవలో ఉన్న వేలుతంబి జయంతన్ నంబూద్రి దౌర్జన్యాన్ని బట్టబయలు చేయడంలో విజయం సాధించి సేనాపతి స్థానానికి ఎదిగాడు. శిక్షగా జయంతన్ నంబూద్రి చెవులు కోసి, దేశం నుండి బహిష్కరించబడ్డాడు.

వేలుతంబి రాజ్యంలో శాంతిభద్రతలను మెరుగుపరచడానికి కఠినమైన శిక్షలను అమలుపరిచాడు. అతని మితిమీరిన ప్రవర్తన అతని సహోద్యోగులలో ఆగ్రహాన్ని తెప్పించింది. అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారి మల్లన్ పిళ్లై శిక్షించబడ్డాడు. ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు. శక్తివంతమైన మరో అధికారి కుంజు నీలన్ పిళ్లై, అతని బృందం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మద్దతుదారులు. వారు దేశ రక్షణ రహస్యాలను రెసిడెంట్ బ్రిటిష్ ఆఫీసర్ మెకాలేకి అందజేస్తారు. వేలుతంబి అప్రమత్తంగా ఉండి, తన 'కుందర ప్రకటన'లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలను కోరాడు. ఇది పొరుగు రాజ్యాలైన కొచ్చిన్, కోళికోడ్‌లలో అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అతని పోరాటంలో వారు అతనికి తమ మద్దతును అందించారు.

ఆస్థాన నర్తకి జగదాంబిక వేలుతంబితో ప్రేమలో పడింది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అతని ప్రణాళికలలో అతనికి మద్దతు ఇచ్చింది. ఆమె మారువేషంలో మెకాలే బంగ్లాలోకి ప్రవేశించి, రక్షణ ఫైళ్లను తిరిగి పొందగలిగింది, కానీ కాల్చి చంపబడింది. చనిపోయే ముందు జగదాంబిక ఫైళ్లను వేలుతంబికి అందజేసింది. వేలుతంబి బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొడతానని శపథం చేస్తాడు.

తిరువనంతపురం చుట్టుపక్కల ఉన్న అనేక పట్టణాలు, గ్రామాలపై దండయాత్ర చేసి తమ ఆధీనంలోకి తీసుకురావడంలో బ్రిటిష్ వారు విజయం సాధించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు రైఫిల్స్‌తో సహా మరిన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని విడుదల చేయాలని వేలుతంబి రాజును అభ్యర్థించాడు. తిరువాన్కూరుకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారిని రెచ్చగొట్టింది వేలుతంబి అని కుంజు నీలన్ పిళ్లై రాజుకు నూరిపోస్తాడు. రాజు ఆ ఆరోపణను విశ్వసించాడు. వేలుతంబి దళవాయిగా తన పదవిని వదిలిపెడతాడు. తన మేనకోడలు సీతాలక్ష్మి, ఉన్ని నంబూద్రిల వివాహాన్ని నిర్వహించిన తరువాత, వేలుతంబి తన సోదరుడు పద్మనాభన్ తంబితో కలిసి మన్నాడి ఆలయ గర్భగుడిలో ఆశ్రయం పొందేందుకు బయలుదేరాడు. బ్రిటీష్ వారు ఆలయాన్ని చుట్టుముట్టారు, కానీ వారు ప్రవేశించకముందే వేలుతంబి ఆత్మహత్య చేసుకున్నాడు; పద్మనాభం వేలుతంబిని శిరచ్ఛేదం చేశాడు.

పాటలు మార్చు

క్ర.సం. పాట గాయకులు
1 అహాహా ఆగు ఇంత టెక్కాఅహా హా ఆడుతుంటే కె.రాణి, పి.బి.శ్రీనివాస్
2 ఆపదకాని ఇలనేలే హక్కులు అన్నీ ఎవరివయా
3 కాచుకొంటి నీకై పరదేవతా కనికరం వహించుమో కరుణా మయి ఎన్.రాజ్యలక్ష్మి
4 దాసి దయగోనరాదా గోపకుమారా సంకోచం తగదోయి ఎన్.రాజ్యలక్ష్మి
5 పూజారి వస్తాడే పూలను కోయ వస్తాడే ఎస్.జానకి
6 పేరోకటే లోపము వీర స్వరూపము లలిత, జె.వి.రాఘవులు
7 లేదెందు మొహం లేదెందు మొహం పి.సుశీల

మూలాలు మార్చు