తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహిం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం వీ హబ్ (ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ హబ్‌). దీనిని 2018, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంన హైదరాబాదు అంబేద్కర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.[1][2][3][4]

వీ హబ్‌
WeHub Logo.jpg
Community space for start-ups, investors, incubators and accelerators in India.
స్థాపనమార్చి 8, 2018
కేంద్రీకరణస్టార్టప్ ఇంక్యుబేటర్
కార్యస్థానం
నాయకుడుహైదరాబాద్, తెలంగాణ
జాలగూడువీ హబ్‌ వెబ్సైట్
వీ హబ్‌ ప్రారంభోత్సవం

ప్రారంభంసవరించు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2018, మార్చి 8న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.[5][6][7] ఈ ప్రారంభ కార్యక్రమంలో మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన డీఆర్‌డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ టెస్సీ థామస్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, సీఐఐ చైర్మన్ వీ రాజన్న, కలారీ క్యాపిటల్ సంస్థ ఎండీ వాణి కోలా, వీహబ్ సీఈవో దీప్తి రావుల, ఫిక్కి మహిళా విభాగం, కోవె సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.[8][9]

ఉద్దేశ్యంసవరించు

 1. మహిళల్లో ఉన్న సృజనాత్మక శక్తికి ప్రోత్సాహం అందించి వారి ప్రతిభ వెలుగులోకి తీసుకురావడం
 2. జూనియర్ కాలేజీ విద్యార్థులకు పరిశోధన చేయడానికి కావాల్సిన అవకాశం కల్పించడం

లక్ష్యాలుసవరించు

 1. మార్కులకోసమే చదువు అన్నట్టు కాకుండా చిన్నతనం నుంచే ఆవిష్కరణలను కుడా పాఠ్యాంశంలో భాగం చేయడం
 2. మెరుగైన కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి తీసుకురావడం
 3. ప్రతి మహిళను విజయవంతమైన పారిశ్రామికవేత్తగా తయారుచేయడం

ఒప్పంద సంస్థలుసవరించు

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ, సీఐఐ-ఇండియా ఉమెన్ నెట్‌వర్క్, సేల్స్‌ఫోర్స్, ఐఐఎం బెంగళూరు, ఎన్‌ఐడియా, పీడబ్ల్యూఎల్ మొదలైన ఆరు సంస్థల ప్రతినిధులు వీ హబ్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.[10][11][12]

చిత్రమాలికసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలుసవరించు

 1. 10టీవీ న్యూస్ (9 March 2018). "టీసాట్ కార్యాలయంలో వీహబ్‌..." Retrieved 12 April 2018.[permanent dead link]
 2. సాక్షి, తెలంగాణ, హైదరాబాద్ (9 March 2018). "వనితకు వరం.. 'వీ హబ్‌'". Retrieved 12 April 2018.
 3. మనం న్యూస్ (9 March 2018). "టీ హబ్‌లా వీ హబ్ ఎదగాలి". Archived from the original on 13 ఏప్రిల్ 2018. Retrieved 12 April 2018. Check date values in: |archive-date= (help)
 4. నవ తెలంగాణ, హోం, తాజా వార్తలు (8 March 2018). "వీహబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Retrieved 12 April 2018.
 5. తెలంగాణ మ్యాగజైన్. "వీహబ్‌తో నవశకం!". www.magazine.telangana.gov.in. Retrieved 12 April 2018.
 6. The Hindu, Telangana (9 March 2018). "WE Hub: game plan for women with potential". Retrieved 12 April 2018.
 7. The Hans India, Telangana (9 March 2018). "Start-up incubator for women 'We-Hub' launched in Telangana". Retrieved 12 April 2018.
 8. నేటి ఏపి, తెలంగాణ వార్తలు (9 March 2018). "టీహబ్ తెలుసు ఈ వీహాబ్ ఏంటీ కొత్తగా..?". Retrieved 12 April 2018.[permanent dead link]
 9. The Times of India, Business News/ India Business News/ T Gifts (9 March 2018). "T gifts 'We-Hub' to women entrepreneurs". Retrieved 12 April 2018.
 10. The New Indian Express, Telangana (9 March 2018). "WE-Hub ties up with technology majors; women entrepreneurs can apply from today". xpress News Service. Retrieved 12 April 2018.
 11. Deccan Chronicle (9 March 2018). "We-Hub launched on women's day". Retrieved 12 April 2018.
 12. Telangana Today, Telangana (8 March 2018). "Telangana rolls out women-only incubator WE-Hub". Telangana Today. Retrieved 12 April 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=వీ_హబ్‌&oldid=3398164" నుండి వెలికితీశారు