వెంకటగిరి పురపాలక సంఘం

వెంకటగిరి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తిరుపతిజిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం లోని,వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

వెంకటగిరి పురపాలక సంఘం
వెంకటగిరి
స్థాపన2005
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

రాష్ట్ర రాజధానికి అమరావతికి 352 కి.మీ దూరంలో ఉంది.2005 లో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.[1]వెంకటగిరి అనే గ్రామనామం వెంకట అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. వెంకట అనేది దైవ సూచి, శ్రీనివాసుని మరో పేరు వెంకట.[2]

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 52,688, జనాభా ఉండగా అందులో పురుషులు 26,132 , మహిళలు 22,556 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 84.27%,ఉండగా స్త్రీ జనాభాలో 68.93%. అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4888 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 13,247గృహాలు ఉన్నాయి.[3]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా శ్రీమతి నక్కా భానుప్రియ,[4]వైస్ చైర్మన్‌గా చింతపట్ల ఉమామహేశ్వరి పనిచేస్తున్నారు.[4]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  • వెంకటగిరి సంస్థానం: ఆంధ్రప్రదేశ్‌లోని సంస్థానాల్లోకెల్లా అతిపెద్దదైన, ప్రాచీనమైన సంస్థానాల్లో ఒకటి.[5]
  • రామలింగేశ్వర స్వామి దేవాలయం
  • ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం
  • పోలరమ్మ దేవాలయం.

ఇతర వివరాలు

మార్చు

ఈ పురపాలక సంఘం 23.50 చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.25 రెవెన్యూ వార్డులు,25 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘం లో మురికివాడల సంఖ్య 42 ఉండగా అందులో జనాభా 32160 ఉన్నారు.1 ప్రభుత్వ ఆసుపత్రి,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "Brief about Municipality". Commissioner and Director of Municipal Administration. Government of Andhra Pradesh. Archived from the original on 19 ఫిబ్రవరి 2015. Retrieved 19 February 2015.
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 233. Retrieved 10 March 2015.
  3. "Venkatagiri Population, Caste Data Sri Potti Sriramulu Nellore Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-07-04. Retrieved 2020-07-04.
  4. 4.0 4.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.
  5. శ్రీరామ్, వీరబ్రహ్మమ్ (1918). నానారాజన్య చరిత్రము. p. 2.

వెలుపలి లంకెలు

మార్చు