వెంకటగిరి పోలేరమ్మ జాతర
వెంకటగిరి పోలేరమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసన వినాయక చవితి తర్వాత వచ్చే మూడో బుధవారం నాడు గ్రామస్థులు ఉత్సవాన్ని నిర్వహిస్తారు.పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతోంది.[1]
వెంకటగిరి పోలేరమ్మ జాతర | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | తిరుపతి |
ప్రదేశం: | వెంకటగిరి |
ఆలయ వివరాలు | |
ఉత్సవ దేవత: | పోలేరమ్మ తల్లి |
ముఖ్య_ఉత్సవాలు: | పోలేరమ్మ జాతర |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | దేవాలయం |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 1914 |
సృష్టికర్త: | వెంకటగిరి రాజులు |
చరిత్ర
మార్చువెంకటగిరి పోలేరమ్మ జాతర పూర్వం రాజుల కాలం నుండి జరుగుతుంది.1917 సంవత్సరంలో వెంకటగిరి సంస్థానంలో చాలామంది ప్రజలు కలరా, మశూచి వ్యాధులకు ఎక్కువగా రావడంతో ఎంతోమంది ప్రజలు చనిపోయారు.అప్పటి రాజులు ప్రజలను కాపాడేందుకు వెంకటగిరి రాజవంశస్థులు కలరా వ్యాధి తగ్గడం కోసం ఒక యాగం చేశారు. అప్పుడు కలరా వ్యాధి తగ్గింది.1919 లో కలరా వ్యాధి తగ్గిన కారణంగా వెంకటగిరి రాజావారు ఆ సంవత్సరం ఘనంగా జాతర జరిపారు.
జాతర జరిగే విధానం
మార్చుప్రతి సంవత్సరం భాద్రపద మాసాన వెంకటగిరి గ్రామస్థులు ఐదు రోజులు పాటు ఉత్సవాన్ని నిర్వహిస్తారు.ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత వచ్చే మొదటి బుధవారం నాడు అర్ధరాత్రి సమయంలో ఊరి గ్రామస్థులు మొదటి చాటింపు వేస్తారు.అలాగే రెండో బుధవారం రోజున కూడా చాటింపు వేస్తారు. మూడో బుధవారం, గురువారం అమ్మవారి జాతర నిర్వహిస్తారు.[2] జాతర జరుగుతున్న సమయంలో ఎవరింట్లోని శుభకార్యాలు చేసుకోరు.జాతర మహోత్సవం అయిదు రోజులపాటు సాంప్రదాయకంగా జరుగుతుంది.జాతర ముందు గ్రామ పొలిమేరలో రెండు రాళ్లును శక్తి స్వరూపలుగా ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తారు. ముందుగా భక్తులకు పుట్టమట్టితో అమ్మవారి విగ్రహాన్ని కళ్ళు లేకుండా దర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత విగ్రహానికి ముసుగు కప్పి పల్లకిలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగవారి వీధికి తీసుకొని వస్తారు.అర్ధరాత్రి తరువాత కళ్ళూ, దిష్టిచుక్క పెడతారు. అమ్మవారికి కళ్ళు పెడుతున్న సమయంలో నేరుగా కాకుండా అద్దంలో నుంచి చూస్తూ వెనుక నుండి పెడతారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు.అమ్మవారికి పసుపు కుంకుమ వేపాకులతో పూజలు నిర్వహిస్తారు.అనంతరం అమ్మవారికి దున్నపోతును బలిస్తారు.అలాగే భక్తుల్లో మొక్కులు ఉన్నవారు జంతుబలులు ఇస్తారు.ఇలా చేయడం అందరికీ మంచిదని ఆ గ్రామస్తుల నమ్మకం.1919లో గ్రామశక్తి పోలేరమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు.అప్పటి నుండి వేడుకను భారీగా చేయడం ఆనవాయితీగా మారింది.[3] వెంకటగిరి జాతర గురించి ప్రముఖ న్యాయవాది పెనుబాకు వేణు గారు "పోలేరమ్మ జాతర చరిత్ర" అనే పుస్తకం రచించారు. అలాగే ఈ పుస్తకాన్ని ప్రముఖ సినీ నటి అమల గారు ఆవిష్కరించడం జరిగింది, వెంకటగిరి జాతరలో ఆవిష్కరించడం జరిగింది. జాతరకు సంబంధించి పూర్తి వివరాలు ఆ పుస్తకంలో వివరించడం జరిగింది. అలాగే ఈ జాతరను 2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా (రాష్ట్ర జాతరగా) చేయడం జరిగింది.
ఊరేగింపు
మార్చుపోలేరమ్మజాతర అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం భారీగా నిర్వహిస్తారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఊరేగింపులో పాల్గొంటారు.సాంప్రదాయం ప్రకారం వెంకటగిరి రాజులు అమ్మవారికి సారే అందజేస్తారు.గురువారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో అమ్మవారిని ట్రాక్టర్‌పై ఊరేగింపుగా రాజావీధి మీదుగా కాశీపేట, శివాలయంవీధి మీదుగా మల్లమ్మగుడి ప్రాంతంలో నిమర్జనం చేస్తారు.ఈ జాతర చూడటానికి నెల్లూరు, తిరుపతి, శ్రీ కాళహస్తి, చెన్నై వంటి సమీప సమీప నగరాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు.
రవాణా సౌకర్యాలు
మార్చుఈ జాతర చూడడానికి వివిధ జిల్లాల నుంచి భారీగా జనం వస్తూ ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుండి వెంకటగిరికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఈ జాతరకి గోదావరి జిల్లాల నుండి అలాగే తమిళనాడులో చెన్నై నుండి అధికంగా భక్తులు వస్తూ ఉంటారు.
మూలాలు
మార్చు- ↑ "వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రారంభం". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2021-09-26. Archived from the original on 2022-09-11. Retrieved 2022-09-11.
- ↑ "నేడు పోలేరమ్మజాతర తొలిచాటింపు". Sakshi. 2016-09-07. Retrieved 2022-09-11.
- ↑ "'గిరి'లో జాతర సందడి". Sakshi. 2016-09-14. Retrieved 2022-09-11.