వెన్నపండు
వెన్నపండు లేదా అవకాడో అనేది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఫలవృక్షం. దీని శాస్త్రీయ నామం పెర్సీ అమెరికాన (Persea americana). పుష్పించే తరగతికి సంబంధించిన ఈ చెట్టు లారేసి (Lauraceae) కుటుంబానికి చెందినది. ఈ వృక్షం ఫలించే కాయను వెన్న పండు అని అంటారు. ఆంగ్లంలో వెన్న పండును ఎవకాడో (Avocado) లేక అల్లెగటర్ పీయర్ (Allegator Pear) లేక బటర్ ఫ్రూట్ (Butter Fruit) అని అంటారు. కాయలు ఆకుపచ్చగా గాని లేదా నల్లగా గాని ఉంటాయి. మెత్తగా తినడానికి కొద్దిగా ఆవు వెన్న రుచిగానూ, కొద్దిగా చిరు చేదుగానూ ఉంటాయి. అందువలన వెన్నపండు అని అనడం కద్దు. వెన్న పూస దొరకని సమయాల్లో పసి పిల్లలకు వెన్న పండు అతి శ్రేష్టమైన ఆహారం. దీని మధ్య గల గింజలను పలు ఔషధాలలో వాడుతుంటారు.
వెన్నపండు | |
---|---|
Avocado fruit and foliage, Réunion island | |
Ripe avocado fruit and cross-section | |
Scientific classification | |
Kingdom: | Plantae
|
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | P. americana
|
Binomial name | |
Persea americana | |
Synonyms | |
Persea gratissima |
చరిత్ర
మార్చుఈ కాయల వాడుక క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలనుండి ఉంది. దక్షిణ, మధ్య అమెరికాలో క్రీస్తు శకం 900 సంవత్సరాలనుండి వెన్న పండు సాగు ఉంది. 1518-19 లో మార్టిన్ ఫెర్నాండెజ్ డి ఎన్సికొ అనే రచయిత తన పుస్తకంలో మొదటిసారిగా వెన్న పండు గురించి పేర్కొన్నాడు.[1][2]
స్వరూపం
మార్చువెన్న పండు చెట్టు సుమారు 20 మీటర్లు (66 అడుగులు ) ఎత్తు ఎదుగుతుంది. 12 సెంటీమీటర్ల నుండి 25 సెంటీమీటర్ల పొడవుతో ఆకులు, 5 నుండి 10 మిల్లీమీటర్ల వెడల్పుతో పువ్వులు, 7 నుండి 7.9 అంగుళాల పొడవు గల కాయలు కలిగి ఉంటుంది. దాల్చినచెక్క, కర్పూర చెట్టు, బే లౌరెల్ చెట్లు వెన్నపండు చెట్టుకు సమీప పోలికలున్న చెట్లు. వెన్నపండు లేక మొసలి బేరి పండు చెట్టు యొక్క పండు లోపల మధ్య భాగంలో ఒకే ఒక విత్తనాన్ని కలిగి ఉంటుంది. ఈ చెట్టు యొక్క పండు ఒక వైపు సన్నగా మరొక వైపు లావుగా బేరి పండు వలె, అండాకారం తోను, గోళాకారంలోను ఉంటాయి. వెన్నపండు వ్యాపారపరంగా మంచి విలువగల పంట కాబట్టి ఈ పంటకు సరిపడ వాతావరణం గల ప్రపంచంలోని అన్ని శీతోష్ణ, సమశీతోష్ణ మండలాలలో ఈ చెట్లను పెంచుతున్నారు. ఈ చెట్టు యొక్క పండు పరిపక్వానికి వచ్చి కోతకు వచ్చిన సమయంలో బాగా కండను కలిగి ఆకుపచ్చ రంగు తోలుతో విత్తనం తీసేసిన ముంత మామిడి కాయ ఆకారంలో ఉంటుంది.
సాగు
మార్చువెన్నపండ్లను సారవంతమైన ఎర్ర్ర నేలల్లో సాగు చేయవచ్చు. వెన్న చెట్లను పెరూ, పోర్చుగీస్, మొరొకొ, క్రెతె, లెవాంట్, దక్షిణ ఆఫ్రికా, కొలంబియా, చిలీ, వియత్నాం, ఇండొనేషియా, శ్రీలంక, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, మలేషియా, మధ్య అమెరికా, కరేబియన్, మెక్సికో, కాలిఫోర్నియా, అరిజోనా, ప్యూర్టో రికో, న్యూ మెక్సికో, టెక్సాస్, ఫ్లోరిడా, హవాయి, ఈక్వేడర్, మరియూ ర్వాండా దేశాల్లో సాగు చేస్తున్నారు.
విత్తనం నాటిన 4 నుండి 6 సంవత్సరాలకు వెన్న చెట్లు కోతకు వస్తాయి. వెన్న పండ్లు సాధారణంగా చెట్టున ఉన్నప్పుడే ముగ్గుతాయి. కాని వాణిజ్యంగా పండించేవారు వీటిని పచ్చిగానే ఉన్నప్పుడు కోసి 3.3 నుండి 5.6 సెంటీగ్రేడ్ల వద్ద ముగ్గడం కోసం భద్రపరుస్తారు.
రకాలు
మార్చుNutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 670 కి.J (160 kcal) |
8.53 g | |
చక్కెరలు | 0.66 g |
పీచు పదార్థం | 6.7 g |
14.66 g | |
సంతృప్త క్రొవ్వు | 2.13 g |
మోనోశాచురేటెడ్ కొవ్వు | 9.80 g |
బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు | 1.82 g |
2 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ | 1% 7 μg1% 62 μg271 μg |
థయామిన్ (B1) | 6% 0.067 mg |
రైబోఫ్లావిన్ (B2) | 11% 0.13 mg |
నియాసిన్ (B3) | 12% 1.738 mg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 28% 1.389 mg |
విటమిన్ బి6 | 20% 0.257 mg |
ఫోలేట్ (B9) | 20% 81 μg |
విటమిన్ సి | 12% 10 mg |
Vitamin E | 14% 2.07 mg |
విటమిన్ కె | 20% 21 μg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 1% 12 mg |
ఇనుము | 4% 0.55 mg |
మెగ్నీషియం | 8% 29 mg |
మాంగనీస్ | 7% 0.142 mg |
ఫాస్ఫరస్ | 7% 52 mg |
పొటాషియం | 10% 485 mg |
సోడియం | 0% 7 mg |
జింక్ | 7% 0.64 mg |
ఇతర భాగాలు | పరిమాణం |
నీరు | 73.23 g |
Fluoride | 7 µg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
చొక్వెట్, హాస్, గ్వెన్, లుల, పింకర్టన్, రీడ్, బెకాన్, బ్రాగ్డెన్, ఏట్టింగర్. ఇందులో నలుపు రంగులో కనిపించే హాస్ రకం మార్కెట్లో ఎక్కువగా లభ్యమవుతుంది.
ఉపయోగాలు
మార్చువెన్న పండులో అధిక శాతం క్రొవ్వు ఉంటుంది. అందుచేత వెన్న పండు గుజ్జును హోటళ్లలో చికెన్, ఫిష్, మటన్ కూరల్లో, సాండ్ విచ్చెస్, సలాడ్లలోను ఉపయోగిస్తారు. వెన్న దొరకని సమయాల్లో పసి పిల్లలకు వెన్న పండు గుజ్జుని తినిపించవచ్చు. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, వియత్నాం, దక్షిణ భారత దేశాల్లో ఐస్ క్రీములలోను, డెస్సర్ట్స్ లోను వాడుతారు. వెన్న పండు గుజ్జును పంచదార కలిపిన పాలలో లేదా పంచదార కలిపిన నీరులో కలిపి జ్యూస్ గా సేవించవచ్చును. వెన్న పండు గుజ్జు ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించి హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కేన్సర్,, మధుమేహం, హైపర్ టెన్షన్ లను అదుపు చేసే లక్షణం కూడా వెన్న పండుకు ఉంది. వెన్నపండు అధిక స్థాయిలో పొటాషియం కలిగి ఉంటుంది. ఇది రక్త పీడనం సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడొలు ఫోలిక్ ఆమ్లం కలిగి ఉంటాయి, క్యాలిఫార్నియ వెన్నపండు కమిషన్ ప్రకారం గర్బవతులు ఇది తినడము వలన పుట్టుకతో వచ్చే spina bifida and neural tube defects నిరోధిస్తుంది
- వెన్నపండు గుజ్జు నుండి తీసుకోబడిన నూనె గాయం ఉన్న ప్రదేశానికి వర్తించినప్పుడు మంటను తగ్గిస్తుంది. ఈ చర్య గాయాలను త్వరగా నయం చేస్తుంది. ఇంకా, గాయాలపై వెన్నపండు నూనెను ఉపయోగించడం వల్ల కొల్లాజెన్ సంశ్లేషణ, రీ-ఎపిథీలియలైజేషన్ మెరుగుపడింది.
- మొటిమల బారిన పడే చర్మానికి స్పాట్ ట్రీట్‌మెంట్‌గా వెన్నపండు నూనెను ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇప్పటికే ఉన్న మొటిమల పరిస్థితికి చికిత్స చేయడంలో సహాయపడవచ్చు.[3]
- సూర్యుని UV కిరణాలను తరచుగా బహిర్గతం చేయడం వల్ల సన్‌బర్న్‌లు, ఫోటోలు తీయడం, చర్మ రోగ నిరోధక శక్తి తగ్గడం, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వెన్నపండు నూనెలోని విటమిన్ E, లెసిథిన్, బీటా-కెరోటిన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు మీ చర్మానికి సహజమైన సూర్య రక్షకులుగా పనిచేస్తాయి. అవి UV కిరణాల ఎక్స్పోజర్ సమయంలో ఉత్పన్నమయ్యే రియాక్టివ్ ఆక్సిజన్ జాతులను స్కావెంజ్ చేస్తాయి, చర్మాన్ని శాంతపరుస్తాయి, తరచుగా ఫోటో డ్యామేజ్‌కు సంబంధించిన మంట, ఎరుపును తగ్గిస్తాయి.
- వెన్నపండులు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి, మెదడు కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. దీనిలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వుల శాతం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి6లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని అల్పాహారం, భోజనం, విందు ఆహారంలో కలిపి తీసుకోవచ్చు. వెన్నపండుస్ వినియోగం మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిరూపించబడింది.[4]
- మృదువైన జుట్టు కోసం మీరు వెన్నపండును ఉపయోగించవచ్చు. ఇది డీప్ కండిషనింగ్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టుకు చాలా (soft and shiny hair) ఉపయోగకరంగా ఉంటుంది. మీరు వెన్నపండును ఉపయోగించి అనేక రకాల హెయిర్ మాస్క్‌లను కూడా తయారు చేసుకోవచ్చు.[5]
- వెన్నపండులు అత్యధికంగా ఫైబర్తో లోడ్ చేయబడి ఉంటాయి, క్రమంగా ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి., ఊబకాయంతో సంబంధం ఉన్న అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పోషక విలువలు
మార్చువెన్న పండు నుంచి లభించే శక్తి 75 శాతం క్రొవ్వునుండే లభిస్తుంది. 100 గ్రాముల వెన్న పండు గుజ్జులో 160 కిలో కేలరీల శక్తి ఉంటుంది, 485 మిల్లీ గ్రాముల పొటాషియం లభిస్తుంది. బి, ఇ, కే విటమిన్లు కూడా లభిస్తాయి. పీచు పదార్థం 75 శాతం,, 25 శాతం సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది.
కొన్ని జాగ్రత్తలు
మార్చువెన్న పండు అరుదుగా కొందరిలో తాత్కాలికంగా తేలికపాటి ట్రీ-పాలిన్ (Tree-pollen), లాటెక్స్ ఫ్రూట్ సిండ్రొం (latex-fruit syndrome) (అనగా దురదలు, వాంతులు, నడుము నొప్పి) వంటి ఎలర్జీలకు కారణం అవవచ్చును. కాని వెన్న పండు ఏమాత్రము ఆరోగ్యానికి హానికరము కాదు. వెన్న చెట్టు ఆకులు, బెరడు ఆవులకు, గేదెలకు, కుక్కలకు, పిల్లులకు, మేకలకు, కుందేళ్ళకు, పక్షులకు, చేపలకు, గుర్రాలకు విషపూరితం.[6][7]
మూలాలు
మార్చు- ↑ California Avocado Association 1934 Yearbook 19: 106-110 - Early History of the Avocado - by Wilson Popenoe
- ↑ Fernández de Enciso, Martín
- ↑ https://vedix.com/blogs/articles/avocado-oil-for-skin
- ↑ https://telugu.news18.com/news/life-style/interesting-facts-about-avocados-and-its-health-benefits-here-is-the-list-hsn-gh-749128.html
- ↑ https://tv9telugu.com/lifestyle/avocado-for-dry-hair-use-avocado-in-this-way-for-soft-and-shiny-strong-hair-691432.html
- ↑ Clipsham, R. "Avocado Toxicity". Archived from the original on 12 January 2008
- ↑ Notes on poisoning: avocado". Canadian Biodiversity Information Facility. 2006-06-30
లంకెలు
మార్చు- https://web.archive.org/web/20131021034204/http://www.harvestofthemonth.cdph.ca.gov/download/spring/avocados/avo_edu_2.pdf
- http://www.dpi.nsw.gov.au/__data/assets/pdf_file/0003/119739/avocado-growing.pdf
- http://www.cfaitc.org/factsheets/pdf/Avocados.pdf
- http://www.avocadosource.com/CAS_Yearbooks/CAS_19_1934/CAS_1934_PG_106-110.pdf
- http://www.acading.org.ve/info/ingenieria/pubdocs/Fernandez_de_Enciso,_Martin.pdf Archived 2021-04-22 at the Wayback Machine