వెబ్‌సైటు
వెబ్ సైటు (లేదా "అంతర్జాల స్థలం") అనగా వెబ్ సర్వర్ (ఒక కంప్యూటర్ లేదా ఒక సాఫ్ట్‌వేర్) లో చేర్చబడిన వెబ్ పేజీలు, బొమ్మలు, వీడియో, డిజిటల్ సమాచారాల యొక్క సముదాయం.[1] సాధారణంగా దీనిని ఇంటర్నెట్, ల్యాన్ లేక సెల్ ఫోన్‌ల ద్వారా కూడా సందర్శించవచ్చు. వెబ్ పేజీ అనేది HTML అనే కంప్యూటర్ భాషలో రాయబడిన ఒక డాక్యుమెంట్. HTTP అనే ప్రోటోకాల్ (నియమాల) ద్వారా వెబ్ సర్వర్ నుంచి వెబ్ బ్రౌజర్‌కు బదిలీ చేయబడుతుంది. బహిరంగంగా వీక్షించగల వెబ్‌సైటులన్నింటినీ కలిపి వరల్డ్ వైడ్ వెబ్ లేదా www అని వ్యవహరించడం జరుగుతుంది.

చరిత్ర సవరించు
వరల్డ్ వైడ్ వెబ్ ను 1991 సంవత్సరంలో CERN కి చెందిన ఇంజనీరైన టిమ్ బెర్నర్స్ లీ రూపొందించాడు. ఏప్రిల్ 30, 1993 వతేదీన CERN వరల్డ్ వైడ్ వెబ్ ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లుగా ప్రకటించింది. HTML, HTTP ని ప్రవేశపెట్టక ముందు ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్, గోఫర్ ప్రోటోకాల్ మొదలైన వాటిని సర్వర్ నుంచి ఫైళ్ళను రాబట్టేందుకు వాడేవారు.
వర్గీకరణ సవరించు
వెబ్ సైటుల అవసరాన్ని బట్టి వాటిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు
- వ్యక్తిగత వెబ్‌సైటు
- వ్యాపార/ వాణిజ్య వెబ్ సైటు
- ప్రభుత్వ వెబ్ సైటు
- స్వచ్ఛంద సేవాసంస్థల లేదా లాభాపేక్ష రహిత సంస్థల వెబ్‌సైటులు
- విద్యా సంస్థల వెబ్ సైటు
- ప్రసార మాధ్యమాల వెబ్‌సైటు, మొదలగునవి ముఖ్యమైనవి.
ఎదైనా ఒకవిషయానికి సంబంధించినవివరాలను, సంక్షిప్త సమాచారంతో ఇతర వెబ్సైటుల లింకులను ఇచ్చే వెబ్‌సైటులను ప్రవేశ ద్వారాలు (పోర్టల్) అంటారు. ఉదా:[2] అనే ప్రవేశ ద్వారంలో తెలుగులో వార్తలు, భవిష్యత్తు, వినోదం గురించిన సమాచారం అందిస్తుంది. భారత ప్రగతి ద్వారం అనే ప్రవేశ ద్వారంలో గ్రామీణ, సమాజాభివృద్ధికి సంబంధించిన వివిధ వివరాలుంటాయి.
బయటి లింకులు సవరించు
మూలాలు సవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-18. Retrieved 2008-12-12.
- ↑ http://in.telugu.yahoo.com/ యాహూ తెలుగు