వెలమవారి పాలెం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా గ్రామం

వేమవరం బాపట్ల జిల్లా, బల్లికురవ మండలంలోని రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°55′30″N 79°53′53″E / 15.925°N 79.898°E / 15.925; 79.898
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంబల్లికురవ మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523201 Edit this on Wikidata


సమీప గ్రామాలు మార్చు

మైలవరం 2 కి.మీ,.ఉప్పలపాడు 4 కి.మీ, వెంపరాల 5 కి.మీ, కొప్పెరపాడు 6 కి.మీ.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

గుండ్లకమ్మ నదిమీద, భవానీ మినీ జలాశయం నిర్మాణంలో ఉంది. ప్రకాశం జిల్లాలోని వెలమవారి పాలెం మరియూ గుంటూరు జిల్లాలోని గోకనకొండ మధ్య ఆనకట్ట నిర్మించుచున్నారు. దీని కొరకూ, గోకనకొండ నుండి భవనాశి చెరువు వరకూ 12.6 కి.మీ. కాలువ పనులు జరుగుచున్నవి. దీని నిర్మాణ వ్యయం రు.27కోట్లు. ఈ పథకం వలన 5 వేల ఎకరాలకు రెండు పంటలకు, నీరు లభ్యమవుతుంది. దీనికి 2008 ఏప్రిల్ 28 న శంకుస్థాపన జరిగింది. 2014 చివరినాటికి పూరికావచ్చని భావించుచున్నారు.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో మామిళ్ళపల్లి ప్రవీణ్ కుమార్, సర్పంచిగా ఎన్నికైనారు.

దేవాలయాలు మార్చు

శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామాలయం మార్చు

ఈ ఆలయంలో 2016, నవంబరు-20వతేదీ ఆదివారంనాడు విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, ఉదయం 9-20కి వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభాన్నీ, గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించి, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [7]

విదేశీపక్షులు మార్చు

  • వెలమావారిపాలెం గ్రామంలో, సంవత్సరంలో ఆరు నెలలు విదేశీపక్షుల కిలకిలారావాలు వినపడుతుంటవి. ప్రతి సంవత్సరం, డిసెంబరు ఆఖరు, జనవరి మొదటి వారంలో, నైజీరియా నుండి విదేశీపక్షులు ఈ గ్రామానికి వచ్చి, చెట్లపై స్థావరాలు ఏర్పరచుకుంటవి. సంతానం కలిగిన తరువాత పిల్లలకు రెక్కలు వచ్చి, ఎగిరే సామర్థ్యం వచ్చే వరకు ఇక్కడ ఉంటవి. జూన్ తరువాత స్వదేశానికి వెళ్ళిపోతవి. సమీపంలోని గుండ్లకమ్మ, మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల, భవనాశి చెరువులలో ఆహారం తిని కాలం వెళ్ళబుచ్చుతవి. ఈ రకంగా సుమారు 200 పక్షులు ఈ గ్రామ పరిసర ప్రాంతాలలో ఉంటున్నవి. [3]
  • ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయినవి. పశుఇపక్ష్యాదులకు నీటి కొరత ఏర్పడినది. ఈ ప్రభావం ఇక్కడికి వచ్చే విదేశీపక్షులపైనా పడినది. వాతావరణం అనుకూలించకం గత నెలరోజులుగా ఇక్కడ 70 పక్షులు మృతిచెందినవి. ఇంతవరకు ఎప్పుడూ ఇక్కడ పక్షులు చనిపోవడం జరుగలేదు.

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు