వెస్ట్‌మిన్‌స్టర్ వంతెన

Coordinates: 51°30′03″N 0°07′19″W / 51.50083°N 0.12194°W / 51.50083; -0.12194

వెస్ట్‌మిన్‌స్టర్ వంతెన నడక మార్గంతో కూడిన వంతెన థేమ్స్ నదిపై వెస్ట్‌మిన్‌స్టర్, మిడిల్సెక్స్ తీరం, లాంబెత్, సర్రే తీరం మధ్యన ఇప్పటి గ్రేటర్ లండన్, ఇంగ్లాండ్ ఉంది.

వెస్ట్‌మిన్‌స్టర్ వంతెన
River Thames and Westminster Bridge, London-17Aug2009.jpg
River Thames: the bridge nearest the camera is Westminster Bridge, the next bridge is Lambeth Bridge, and bridge just visible in the distance is Vauxhall Bridge
(as seen from the London Eye observation wheel)
Coordinates51°30′03″N 0°07′19″W / 51.5008°N 0.1219°W / 51.5008; -0.1219
OS grid reference[1]
CarriesMotor vehicles
Pedestrians
CrossesRiver Thames
LocaleLondon, England
Heritage statusGrade II* listed structure
Characteristics
DesignArch Bridge
History
Opened1862
Location
1746 తొలినాళ్లలో కానాలెట్టోచే రంగులు వేయబడిన వెస్ట్‌మిన్‌స్టర్ వంతెన.
వెస్ట్‌మిన్‌స్టర్ వంతెన, 1750వంతెన యజమానులు అప్పటి 'హార్స్ ఫెర్రి' ఆపరేటర్లకు, స్థానిక వంతెన సిబ్బందికి పరిహారం చెల్లించాల్సి వుండేది.
1897లోని లాంబెత్ ప్యాలస్, లాంబెత్ వంతెన, హౌస్ ఆఫ్ పార్లమెంట్, వెస్ట్‌‌మిన్‌స్టర్ వంతెనలను చూపించే మ్యాప్.
వెస్ట్‌‌మిన్‌స్టర్ & లాంబెత్, 1746. 1740లో ప్రారంభించబడిన వెస్ట్‌‌మిన్‌స్టర్ వంతెన, వెస్ట్‌‌మిన్‌స్టర్ నుంచి లాంబెత్ ను అనుసంధానిస్తుంది; నిర్మాణం కావాల్సిన వాక్స్ హాల్ బ్రిడ్జ్ సైట్ లో హంట్లీ ఫెర్రి నదిని దాటుతున్న దృశ్యం.
రాత్రి వేళల్లో వెస్ట్‌‌మిన్‌స్టర్ వంతెన దాని పరిసర ప్రాంతాలు.
హౌస్ ఆఫ్ లార్డ్స్ అండ్ కామన్స్ రగులుతుండగా కుడివైపున వెస్ట్‌‌మిన్‌స్టర్ వంతెన ఉన్న దృశ్యం 1835లో జే.ఎమ్.డబ్ల్యూ. టర్నర్ చిత్రీకరించింది.

చరిత్రసవరించు

600 సంవత్సరాల క్రితం వరకు, లండన్ వంతెన‌కు సమీపంలోని వంతెన కింగ్స్‌టన్‌లోనే వుండేది. 1664 నాటి కాలంలోనే వెస్ట్‌మినిస్టెర్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదన జరిగింది. ఈ ప్రతిపాదనను లండన్ కార్పొరేషన్, సిబ్బంది వ్యతిరేకించారు. 1722లో మరింత వ్యతిరేకత ఉన్నప్పటికి, 1729లో పుట్నీలో కొయ్యలతో కొత్త వంతెన నిర్మాణం కావడంతో ఈ పథకానికి 1736లో పార్లమెంటు ఆమోదం లభించింది. ప్రైవేటు ఆర్థిక పెట్టుబడులు, లాటరీలు, గ్రాంట్లతో, స్విట్జర్లాండ్ ఆర్కిటెక్ట్ ఛార్లెస్ లాబ్లే రూపకల్పన చేసిన వెస్ట్‌మిన్‌స్టర్ వంతెన 1739-50 మధ్య కాలంలో నిర్మితమైంది.

వెస్ట్‌మిన్‌స్టర్ వంతెనకు లండన్ నగరం తన స్పందన తెలుపుతూ 1760-63 మధ్యకాలంలో లండన్ వంతెన మీది నిర్మాణాలను తొలగించి విస్తీర్ణ పరచింది. నగరం కూడా 1769లో ఆవిష్కరించబడిన, బ్లాక్ ఫ్రియార్స్ బ్రిడ్జ్‌‌పై తన పనులను ప్రారంభించింది. ఆ సమయంలోనే క్యూ వంతెన (1759), బట్టార్సియా వంతెన (1773), రిచ్ మాండ్ వంతెన (1777) తదితర వంతెనల పనులు కూడా అప్పుడే మొదలయ్యాయి.

ఈ వంతెన దక్షిణ లండన్ అభివృద్ధికి సహాయపడటంతోపాటు దక్షిణ తీరంలోని నౌకాశ్రయాలతో ప్రత్యక్ష సంబంధాలకు ఉత్తర తీర ప్రాంతాల విస్తీర్ణానికి తోడ్పడుతుంది. రవాణా రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా ఆక్స్‌ఫోర్డ్ స్ట్రీట్ గుండా లండన్ బ్రిడ్జ్ మీదుగా నగరంలోకి ప్రవేశించడానికి దోహదపడుతుంది. ఇందు కోసం మరికొన్ని బై-పాస్ రోడ్లు ఆవిర్భవించాయి. ఈ కారణంగా ఒకప్పటి సర్రేలో భాగమైన సౌత్‌వార్క్‌లోని ఎలిఫాంట్ అండ్ కాస్ల్ కూడలి సంక్లిష్టం అయ్యింది.

దీని నిర్వహణ ఖర్చులు మరింత భారంగా మారడంతో 19వ శతాబ్ది కాలంలో దీని పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుత థామస్ పేజ్‌చే రూపొందించబడి 1862[1]లో ప్రారంభించబడింది. మొత్తం పొడవులోని252 మీటర్లు (826.8 అ.), 26మీటర్ల వెడల్పులో ఇది దృఢమైన ఇనుముతో ఏడు ధనురాకార గోతిక్ భవన నిర్మాణ నైపుణ్యంతో ఛార్లస్ బార్రి (వెస్ట్మిన్‌స్టర్ ప్యాలెస్ భవన నిర్మాణ రూపకర్త) రూపొందించబడింది. మధ్య లండన్‌లో ఇది అత్యంత పురాతనమైన వంతెన.

హౌస్ ఆఫ్ కామన్స్‌లోని సీట్ల రంగు మాదిరిగానే వంతెన అత్యధిక భాగం పచ్చ రంగు పూయబడి వుంటుంది. హౌస్ ఆఫ్ కామన్స్ వెస్ట్‌మిన్‌స్టర్ ప్యాలెస్ పక్కనే వంతెనకు సమీపంలో ఉంటుంది. ఇది లాంబెత్ వంతెనకు పూర్తి విరుద్ధమైనది. లాంబెత్ వంతెన హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోని సీట్ల రంగు మాదిరిగా ఎరుపు రంగులో ఉంటుంది. ఈ వంతెన హౌస్ ఆఫ్ పార్లమెంటుకు ఎదురుగా దర్శనమిస్తుంది.

2005లో దీని సంప్రోక్షణ పనులు చేపట్టగా, 2007లో పూర్తయ్యాయి. వంతెనకు పూర్తిగా కొత్త రంగులు దిద్దడం, తుప్పు పట్టిన ఇనుమును మార్చడం వంటి పనుల ద్వారా వంతెన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఇంటర్‌సర్వ్ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు టోని జీ అండ్ పార్టనర్లు ఈ పనులను పూర్తి చేశారు.

ఈ వంతెన వెస్ట్‌మిన్‌స్టర్ ప్యాలెస్‌ను నది పశ్చిమ భాగం నుంచి కౌంటీ హాల్‌తోను, తూర్పున లండన్ ఐతోను అనుసంధానిస్తుంది. అదే విధంగా ఆరంభ కాలంలో లండన్ మారథాన్ ఇక్కడే ముగిసేది.

వంతెన దిగువున హంగర్‌ఫోర్డ్ పాదచారుల వంతెన, ఎగువన లాంబెత్ వంతెన ఉన్నాయి. 1981[2]లో ఈ వంతెన నిర్మాణ తీరులో రెండో గ్రేడ్*ను సాధించింది.

జనరంజక సంస్కృతిలోసవరించు

2002లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 28 డేస్ లేటర్‌లో కోమాలో నుంచి కోలుకునే ప్రధాన పాత్రధారి, నిర్మానుష్యంగా మారిన లండన్‌ను చూసి, మనుషుల కోసం వెస్ట్‌మిన్‌స్టర్ వంతెనపై నడుచుకుంటూ వెళతాడు.

లండన్ సాంప్రదాయ పరుగు పందెమైన బ్రిడ్జెస్ హ్యాండిక్యాప్ రేస్‌లో, వెస్ట్‌మిన్‌స్టర్ వంతెనే ఆరంభ, ముగింపు ప్రాంతం.

విల్లియమ్ ఓడ్స్ వర్త్ 14 పాదాల పద్యంను వెస్ట్‌మిన్‌స్టర్ వంతెన మీద సెప్టెంబర్ 3, 1802లో రాశారు.

బ్రిటీష్ సైన్స్ ఫిక్షన్ శీర్షిక డాక్టర్ హూలో, వెస్ట్‌మిన్‌స్టర్ వంతెనలోని పలు ప్రాంతాలను చిత్రీకరణకు ఉపయోగించుకున్నారు. వాస్తవానికి 1964లో ది దాలెక్ ఇన్వేషన్ ఆఫ్ ఎర్త్ అనే సీరియల్లో నిర్మానుష్యంగా ఏకాంతంగా ఉన్న కట్టడంకోసం దీన్ని వినియోగించుకున్నారు. పలు దాలెక్స్ వంతెనపై నుంచి, వంతెనను ఆనుకుని ఉన్న ఆల్బర్ట్ ఎంబాక్‌మెంట్ మీదుగా వెళ్ళాయి. శీర్షికను మళ్లీ చిత్రీకరించినప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని నిర్మాణ బృందం 2005లో మరో మారు ఉపయోగించుకుంది. రోస్ అనే ఈ భాగంలో తొమ్మిదవ డాక్టర్, రోస్ టైలర్ లు వంతెనపై పరుగెడతారు. డాక్టర్ హూ సౌండ్ ట్రాక్ అనే ఆల్బమ్‌లో ఈ వంతెన పేరుతో విడిగా ట్రాక్ ఉంది.

మోంటి పైథాన్ యొక్క సర్కస్ విన్యాసాలైన "నేషన్ వైడ్"లో వంతెన ప్రముఖ భూమికను పోషించింది ("హామ్లెట్", ఎపిసోడ్ 43). రిపోర్టర్ జాన్ డల్ (గ్రాహమ్ చాప్మన్) ను ఇక్కడకు పంపి వంతెనపై కుర్చీ వేసుకుని కూర్చుని కాళ్ళకు ప్రశాంతంగా విశ్రాంతి ఇవ్వడం సాధ్యపడుతుందో లేదో కనుగొనాల్సిందిగా ఆదేశించారు. ఓ పోలీసు (మైకేల్ పలిన్) అతని కుర్చీని స్వాధీనం చేసుకుని, దానికి పక్క వీధిలో నిలబడి ఉన్న ఒక మహిళ (టెర్రి జోన్స్) వద్ద నుంచి దొంగతనం చేయబడిందని చెప్పాడు. కుర్చీని సదరు మహిళకు తిరిగి ఇవ్వడానికి బదులుగా ఆ మహిళను కిందికి త్రోసేసి, అదేలాగే ఉన్న మరో కుర్చీని తీసుకుని రిపోర్టర్ పక్కనే కూర్చున్నాడు. ఆ తరువాత అతను అక్కడ నడుస్తున్న లేదా కూర్చున్న వ్యక్తుల నుంచి పలు రకాల వస్తువులను బీరు కోసం పడవేసి పగలగొడుతున్నాడు. (అద్దం పగులుతున్న శబ్దం ఆ వెంటనే అలారమ్ మోత వినిపించింది.

2000లో వచ్చిన 102 డాల్మేషియన్ చిత్రంలో, క్రూయెల్లా డి విల్‌కు బిగ్ బెన్ గడియారం శబ్దం వినగానే మతిభ్రమించి పోతుంది.ఆ సమయంలో వెస్ట్‌మిన్‌స్టర్ వంతెన మీద నుంచి చూడగా ఆమెకు తెలుపు నలుపు మచ్చలుగా (డాల్మేషియన్ల ప్యాటన్) లాగే కనిపిస్తుంది.

సూచనలుసవరించు

  1. వేర్ థేమ్స్ స్మూత్ వాటర్ల్ గైడ్
  2. మూస:IoE 27 నవంబర్ 2008లో పునరుద్ధరించబడింది

బాహ్య లింకులుసవరించు